అభిజిత్ లగ్నం అంటే.? ~ దైవదర్శనం

అభిజిత్ లగ్నం అంటే.?


అభిజిత్ అనేది కాంతిలేని నక్షత్రం. పురాణాల్లో దీని వెనుక ఓ ఆసక్తికర కథ కూడా ఉంది. నక్షత్రాలెన్ని అంటే.. అందరూ టక్కున చెప్పే సమాధానం ఇరవై ఏడు అని. కానీ అభిజిత్ అనే ఓ నక్షత్రం ఉందనీ, దానికి కొంత ప్రత్యేకత ఉందని ఎంతమందికి తెలుసు? 

ఆ విశేషాలేమిటో మనం తెలుసుకుందాం..


అభిజిత్ అంటే కనిపించని చుక్క అని మనం అనుకోవచ్చు. అంటే కాంతిలేనిదన్నమాట. నిజానికి నక్షత్రం అనేది కూడా ఒక్కటి కాదు…. అనేక నక్షత్రాల సమూహం. వీటిని 27 మండలాలుగా విభజించి వాటికి అశ్వని, భరణి అంటూ పేర్లు నిర్ణయించారు. ఇక అభిజిత్ విషయానికి వస్తే ఉత్తరాషాఢ నక్షత్రం చివరి పాదం, శ్రవణా నక్షత్రంలోని మొదటి పాదంలో 15వ వంతు భాగాన్ని అభిజిత్ నక్షత్రం అంటారు. ఈ నక్షత్రం వెనుక ఓ పురాణ కథ ఉంది అదేంటో మనం తెలుసుకుందాం..


మనకున్న 27 నక్షత్రాలనూ దక్షప్రజాపతి కుమార్తెలుగా చెబుతారు. దక్షుడు వీరిని చంద్రుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. 


అందరికన్నా రోహిణి మీదే చంద్రుడికి ప్రేమ ఎక్కువ. ఆమెతోనే ఎక్కువ కాలం గడిపేవాడు. మిగతా నక్షత్రాలు ఊరుకున్నా శ్రవణం మాత్రం ఊరుకోలేదు. తనలాగే ఉండే తన ఛాయను తీసి తన స్థానంలో ఉంచి చంద్రుడి వ్యవహారం తేల్చడానికి తండ్రి దగ్గరకు వెళ్లింది. 


శ్రవణా నక్షత్రం వదిలిన ఛాయ పేరే అభిజిత్తు. అది 28వ నక్షత్రంగా ఏర్పడింది. ఆ తర్వాత కాలంలో దీనికి ఒక పవిత్రమైన స్థానం కూడా ఏర్పడింది. సర్వ దోషాలనూ పోగొట్టే శక్తి ఈ నక్షత్రానికి వచ్చింది. ప్రతి రోజూ ఈ నక్షత్రానికి సంధించిన సమయం ఉంటుంది. దాన్నే అభిజిత్ ముహూర్తం అంటారు. ఆ వివరాలు చూద్దాం…


ఈ పదం ఒకప్పుడు పల్లెటూళ్లకు కొత్త కాదు. కాలంమారింది కాబట్టి ఇప్పుడది అంతగా వినపడటం లేదు. అభిజిత్ లగ్నాన్ని పల్లెటూళ్లలో అలా పిలిచేవారు. గడ్డపలుగును భూమిలో పాతిపెట్టి దాని నీడ మాయమయ్యే సమయాన్ని గడ్డ పలుగు ముహూర్తం అనేవారు. అంటే మిట్టమధ్యాహ్నం అన్నమాట. ఈ ముహూర్తంలో సూర్యుడు దశమ స్థానంలో ఉంటాడని, ఈ ముహూర్తం చాలా దోషాలను పోగొడుతుందని నమ్మకం. నిజానికి ఇది చాలా బలమైన ముహూర్తం. 


ప్రస్తుతం రామాలయ నిర్మాణం కోసం అయోధ్యలో జరుగుతున్న భూమిపూజను ఈ అభిజిత్ లగ్నంలోనే చేశారంటే దీనికున్న ప్రాధాన్యం ఏ పాటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీన్ని విజయ ముహూర్తం అని కూడా అంటారు. 


ఈ ముహూర్తం మధ్యాహ్నం 11-45 నుండి 12-30 వరకు ఉంటుంది. 

ఈ ముహూర్తం లోనే శివుడు త్రిపురాసుర వధ చేశాడు. 

ఇదే ముహూర్తం లో దేవతలు సముద్ర మధనం ప్రారంభించారు. 

ఈ శుభ ముహూర్తం లోనే ఇంద్రుడు దేవ సింహాసనాన్ని అధిరోహించాడు. శ్రీరాముడి జననం, సీతారాముల కల్యాణం, భీష్మ పితామహుడు ధ్యాన స్థితుడై ప్రాణాలను విడిచిపెట్టిన సమయం… ఇవన్నీ ఈ ముహూర్తంలోనే జరిగాయి. 


ఈ ముహూర్తంలో పెళ్ళి జరిగింది కాబట్టి ఇలా కష్టాలు వచ్చాయని అనుకోవడం కూడా తప్పే. అసలు ఆ లగ్నంలో ఏ శుభకార్యం చేపట్టినా, ఇక మిగతా విషయాలు ఏవీ ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఇంకా ఈ ముహూర్తానికి సంబంధించి మరికొన్ని విశేషాలు ఉన్నాయి. ఈ ముహూర్త సమయంలో దక్షిణ దిక్కుకు ప్రయాణం మంచిది కాదని నారద సంహిత పేర్కొంటోంది. దక్షిణం యమస్థానం కాబట్టి బుధవారం మాత్రం ఆ దిక్కుకు వెళ్లరాదని నారద సంహిత పేర్కొంది. అలాగే ఉపనయనానికి కూడా ఈ లగ్నం పనికిరాదని పేర్కొంది. దీనికి కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. ఆ నక్షత్రాధిపతుల సమయంలో ఈ అభిజిత్ ముహూర్తం వస్తే మాత్రం దక్షిణ దిక్కుకు నిరభ్యంతరంగా ప్రయాణం చేయవచ్చు. సూర్యుడు చీకటిని ఎలా పారదోలతాడో అలా సర్వదోషాలనూ ఈ ముహూర్తం హరించి వేస్తుందని వశిష్ఠ సంహిత పేర్కొంది. ముహూర్త వల్లరి అనే గ్రంథం మాత్రం అభిజిత్ ముహూర్తం కేవలం ప్రయాణాలకే తప్ప ఇతర కార్యాలకు పనికిరాదని అంటోంది. ఈ లగ్నంలో వివాహం చేస్తే నష్టమని బ్రహ్మ శపించినట్లు నారద సంహిత పేర్కొంది. ఎన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నా అభిజిత్ లగ్నం సర్వశ్రేయోదాయకమని అనేక గ్రంథాలు పేర్కొన్నాయి.

 

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List