శ్రీవైష్ణవ అభిమాన క్షేత్రం ~ దైవదర్శనం

శ్రీవైష్ణవ అభిమాన క్షేత్రం




శ్రీవైష్ణవ ఆచార్యుడు అయిన రామానుజుల వారికి పంచ సంస్కారములు జరిగిన ప్రదేశం.. తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం జిల్లాలో ఉన్న చిన్న పట్టణం... ఈ మధురాంతకం రావణ సంహారం జరిగాక రాములవారు సీతా సమేతుడై అయోధ్యకు తిరిగివెళుతూ భరద్వాజ మహర్షి ఆశ్రమం వద్ద ఆగారు. అక్కడ పుష్పక విమానం దిగి భరద్వాజ మహర్షిని సేవించారు. పుష్పక విమానం దైవవిమానం కావటం చేత భూమిని తాకదు. కొంత ఎత్తులో నిలిచి వుంటుంది. రాములవారు సునాయాసంగా విమానం దిగారు.


సీతమ్మ సుకుమారి కనుక దిగటానికి అవస్థ పడింది. రాములవారు ఆమెకు చేయూతనిచ్చి దింపుకున్నారు. అది చూచిన భరద్వాజ మహర్షి సీతాకల్యాణ వైభోగం సేవించలేని వారికొరకు అదే విధంగా తిరుక్కల్యాణ తిరుక్కోలంలో వేంచేసి వుండి భక్తుల ననుగ్రహించాలని కోరారు.


అలాగేనని సీతారాములు అదే విధంగా వేంచేసి భక్తులననుగ్రహిస్తున్నారు. ఆనాటి భరద్వాజాశ్రమమే నేటి మధురాంతకమని ఐతిహ్యం. మూలస్థానంలో సీతారాములు కల్యాణతిరుక్కోలంలో చేతులు కలుపుకొని సీతాపిరాట్టి ఎడమచేయి రాములవారి కుడిచేతిలో పట్టి దర్శనమిస్తారు.


స్వామికి ఎడమభుజం వైపు లక్ష్మణస్వామి వేంచేసి వుంటారు. ధ్వజస్తంభం వద్ద గరుడులవారి సన్నిధి వుంటుంది. ఆలయం బయట కోనేరు పక్కన ఆంజనేయుడి సన్నిధి వుంటుంది.  


కాంచీపురంలోని శ్రీ వరదరాజ పెరుమాళ్ మందిరములో ఉన్న తిరుకచ్చినంబి ద్వారా రామానుజుల వారికి శ్రీరంగంలోని పెరియనంబి వారి దగ్గరికి వెళ్ళమని ఆదేశం లభించింది.


ఆ ప్రకారం రామానుజులవారు శ్రీరంగం బయలుదేరారు. అక్కడ శ్రీరంగంలో పెరియ నంబి వారికి రామానుజులవారిని శ్రీరంగం తీసుకురమ్మని శ్రీ రంగనాథ స్వామివారి   ఆదేశం. స్వామి ఆదేశానుసారం పెరియ నంబి కాంచీపురానికి బయలుదేరారు. ఇద్దరూ మధురాంతకంలో కలిశారు.


ప్రియనంబివారు కాంచీపురంలో రామానుజుల వారికి సమాశ్రయం అనుగ్రహించాలని అనుకున్నారు. కానీ రామానుజుల వారు గతంలో తాము శ్రీరంగంలో యామునులవారిని సేవింపబోగా..


అప్పటికే వారు పరమపదించిన విషయం జ్ఞాపకం చేసి క్షణభంగురమైన జీవితంలో గతకాలం మరలిరాదని, తమకు గల ఆర్తి గమనించి అక్కడే సమాశ్రయం అనుగ్రహించాలని వేడుకొన్నారు.సరేనని పెరియనంబివారు అక్కడి శ్రీ కోదండ రామచంద్రస్వామి వారి కోవెలలో విడిది చేస్తారు.


రామానుజులవారు శ్రీ వరదరాజ స్వామి వారి ఆదేశానుసారం పెరియనంబి వారిని   ఆచార్యులుగా స్వీకరించి వారిచే సింహమాసం శుక్ల పంచమితిథి నాడు పంచ సంస్కారములను పొందిన పవిత్ర ప్రదేశం ఈ మధురాంతకంలోని శ్రీ కోదండరాముల వారి కోవెల అప్పటివరకు రామానుజులవారు గృహస్థాశ్రమంలో ఉన్నారు. 


కావున ఇక్కడ వారు అంచులున్న తెల్లని పంచ కట్టుతో దర్శనమిస్తారు.. ఈ కోవెలలో రామానుజుల వారికి సమాశ్రయం అనుగ్రహించటానికి వినియోగించిన శంఖచక్ర ముద్రలను చూడవచ్చు..


ఈ కోవెలలో కుడివైపు జనకజవల్లి తాయార్ , ఎడమవైపు ఆండాళ్ సన్నిధులు,చక్రత్తాళ్వార్ సన్నిధి ఆళ్వార్ సన్నిధి,‌ రామానుజుల వారి సన్నిధిలోనే పెరియనంబివారు, విడిగా వేదాంత దేశికుల వారి సన్నిధి వున్నది.  


వెలుపలి ప్రాకారంలో ఆండాళ్ సన్నిధి వెనుక పక్కన ఉన్న చిన్న మండపంలో రామానుజుల వారికి పెరియనంబి పంచ సంస్కారములు చేస్తూ ఉన్నట్లు చిత్రీకరించి ఉంటుంది..

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List