మణికేశ్వరం గంగా భ్రమరాంబా సమేత శ్రీ మల్లేశ్వర స్వామి ~ దైవదర్శనం

మణికేశ్వరం గంగా భ్రమరాంబా సమేత శ్రీ మల్లేశ్వర స్వామి





ప్రతి ఆలయంలో శివుడు లింగ రూపంలో దర్శనం ఇస్తాడనే విషయం మనకి తెలుసు అయితే ఈ ఆలయ పురాణానికి వస్తే ఒక భక్తుడు మానికను శివలింగం లాగా భావించి ఇక్కడ పూజలు చేసాడని తెలుస్తుంది. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయంలోని విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం...


ఇక్కడి శివాలయ పరిసరాల స్వరూపం కాశీలో దేవాలయం పరిసరాల స్వరూపం ఒకటిగా పోలి ఉండటంచే ఈ మణికేశ్వరాన్ని చిన్న కాశీ అని పిలుచుకొనుట నానుడి ఉన్నది...!


అద్దంకి మండలంలో మణికేశ్వరం గ్రామంలో శ్రీ గంగా భ్రమరాంబా సమేత శ్రీ మల్లేశ్వరస్వామి దేవాలయం వందల సంవత్సరాలకు పూర్వం నుంచి వున్నట్లు శిలాశాసనాల వల్ల తెలుస్తోంది. ఈ దేవాలయం ఆవిర్భావం గురించి అనేక గాథలు ప్రచారంలో వున్నాయి. 


స్థల పురాణం..


ఒక గాథ ప్రకారం ఉప్పు అమ్ముకొని జీవించే ఒకానొక శివ భక్తుడు శివరాత్రి రోజున యిక్కడ శివుని పూజించడానికి శివలింగం లభించకపోవడంతో, తన వద్ద నున్న ‘మానిక’ (కొలపాత్ర)ను  పెట్టి, భక్తితో స్తుతించి పూజించగా, ఆ 'మానిక’ అలాగే లింగమూర్తిగా మారిందని, అందువల్ల ఈ స్వామికి “మానికేశ్వరుడు" అని పేరు వచ్చిందని, కాలక్రమాన మల్లేశ్వరుడుగా మారినట్లు ప్రతీతి. ఆగస్త్య మహాముని ఈ లింగాన్ని ప్రతిష్టించినట్లు మరొక విధంగా తెలుస్తోంది.


ఇక్కడి స్థల విశేషం ఏమనగా - కొండ, కొండ దిగువ భాగాన దేవాలయం, దేవాలయానికి ఉత్తరంగా గుండ్లకమ్మ (గుండీనది)గా పిలువబడే జీవనది, నది ఒడ్డున శ్మశాన వాటిక ఉన్నాయి. మరియు ఈ ఆలయం కాశిలోని ఆలయ పోలికలతో ఉండటం చేత ఇది ‘దక్షిణ కాశి’ అయిందంటారు. 

 

ఇక్కడి శిలాశాసనాలను బట్టి ఈ దేవాలయం  1202 నాటిదని, తొలుత ఈ గ్రామం పేరు 'బుద్ధపూండి' అని, శ్రీ మన్మహా మందలేశ్వర చోడ మహాదేవ మహారాజు (చోళరాజులు) కాలం నాటిదని, ఇది గుండీనది తీరమని అర్థమవుతుంది.


దేవాలయానికి ఎదురు గానే రుద్రభూమి కలదు ఇప్పటికి ఇక్కడ శవ దహన క్రతు ధర్మాలు జరుగు చున్నవి....!


( ప్రకాశం జిల్లా : మణికేశ్వరం శ్రీ గంగా భ్రమరాంబా సమేత శ్రీ మల్లేశ్వరస్వామి దేవాలయం)


 

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List