బుధ అష్టమి ~ దైవదర్శనం

బుధ అష్టమి

బుధ అష్టమి అనునది హిందువులకు అతి పవిత్రమైనది. ఈ అష్టమి అనగా 8 వ తిథి , శుక్ల పక్షమున గాని , కృష్ణ పక్షమున గాని , *బుధవారము నాడు* సంభవించినచో ఆ అష్టమిని *“బుధాష్టమి”* అని అంటారు. ఈ బుధాష్టమి పరమ శివుని పూజకు , అమ్మ పార్వతి దేవి పూజకు మిక్కిలి శ్ఱేష్టము. ఈ దినమున భక్తులు మిగుల భయ భక్తులచే పార్వతి , పరమేశ్వరులను ఆరాదించెదరు. మన హిందూ ధర్మశాస్త్ర ప్రకారము , ఎవరైతే ఈ బుధాష్టమి నాడు ఉపవాసము ఉండి , శివారాధన , పార్వతిదేవి ఆరాధన చేస్తారో , అట్టి వారు , వారి మరణానంతరం నరకమునకు పోవరట. ఈ *బుధాష్టమి వ్రతము* సలుపు వారు స్వచ్చమైన పుణ్య జీవితమును పొంది తమ జీవితంలో సకాల అభివృద్ధి పొందుతారు.

ఈ బుదాష్టమి వ్రతమును ఉత్తర దేశమున , అనగా గుజరాత్ యందును , మహారాష్ట్ర యందును ఎక్కువగా ఆచరిస్తారు.
బుధాష్టమి వ్రత విధానము:..
ఈ దినమున అనగా బుదాష్టమి నాడు భక్తులు నవగ్రహాలలో ఒకడైన బుదుడిని ఆరాదించి , ఆయన అనుగ్రహమును పొందుతారు.
ఈ దినము భక్తులు ఉపవాసముండి బుదుడికి ప్రత్యేక నైవేద్యమును నివేదించుతారు.
వ్రత పూజ పిదప ఆ ప్రసాదమును మాత్రము తీసుకొన వలయును.
ఈ వ్రతమునకై బుధ విగ్రహము కానీ , బంగారు , వెండి కాసులో చిత్రీకరీంచిన బుధరూప కాసు ను కానీ , ఉపయోగించెదరు.
ఈ బుధుడి ముందు నీటితో నింపిన కలశమును పెట్టి కొబ్బరి బోండామును ప్రతిష్టించెదరు.
పిదప భయ భక్తులచే వివిధ పూజలను చేసి , ఆ నైవేద్య ప్రసాదమును అందరికీ పంచి ఇస్తారు.
ఈ వ్రతము ప్రారంబించినవారు వరుసగా 8 మార్లు ఆచరించవలెను.
ఈ విధముగా ఆచరించిన పిదప , కడపటి బుధాష్టమి నాడు నీరు పేదలకు , భోజనాలు పెట్టి , తోచిన వస్త్ర దానం చేయవలెను. వారికి నెలకు సరిపడ బియ్యం , నూనె , పప్పులు దానము చేయవలెను , ఈ విధముగా బుధ అష్టమి వ్రతమును చేసిన వారికి , వారి సకల దోషములు తోలగి , పుణ్యం లభించి నరక లోకమునకు పోక కైవల్య ప్రాప్తి పొందుతారు. కొందరు ఈ దినమున శివ పార్వతులకు పూజలు కూడా నిర్వహిస్తారు.
ఈ బుధాష్టమి విశిష్టత:..
ఈ బుధాష్టమి యొక్క విశిష్టత *బ్రహ్మాండ పురాణము* నందు వివరింప బడివున్నది. ఈ వ్రతం చేసిన వారికి ప్రస్తుత , పూర్వ , జన్మ పాపముల నుండి విముక్తి లభించును. శివ , పార్వతి ఆరాధన ఈ బుధాష్టమి నాడు చేసిన అంతటి ఫలితం లభించును. ఈ వ్రతమాచరించిన వారికి బుధ గ్రహ దోషములు నివారింపబడి , బుధ గ్రహ బాధలనుండి విముక్తి లభించును.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List