లంకమల్లేశ్వర కొన. ~ దైవదర్శనం

లంకమల్లేశ్వర కొన.

* శివుడి జటాజుటం నుంచి జాలువారుతున్న గంగా జలపాతం...
* లంకమల్ల అభయారణ్యంలో అమర్‌నాథ్‌ యాత్రని తలపించే లంకమల్లేశ్వర కొన దర్శనం...
* శ్రీరాముడు నల్లమల అటవీప్రాంతంలో ప్రతిష్టించిన అత్యంత మహిమాన్వితమైన శివలింగం....
* అష్టైశ్వర్యాలు ప్రసాదించే లంకమల్లేశ్వరుడు....
.
.
ఎత్తైన కొండలు, లోయలు...
పెద్ద పెద్ద చెట్లు...
వాటి నడుమ సవ్వడులు చేస్తూ...
జల జల పారుతున్నచిన్న సెలఏర్లు...
భారీ ఎత్తున హోరు చేస్తూ...
వందల మీటర్ల ఎత్తు నుంచి జాలు వారు తున్న జలపాతాలు...
నలమలలో అడవుల్లో లంకమల్లేశ్వర క్షేత్రం నేడు లక్షలాది మంది భక్తులని ఆకర్షిస్తూ...
శివయ్య అలరిస్తునే ఉన్నాడు...
.
.
ఈ కొండకోనల్లో కొలువై ఉన్న శివయ్యను దర్శించుకోవటమంటే, భారత దేశ సరిహద్దులో అమర్‌నాథ్‌ యాత్ర చేసి అక్కడి హిమ లింగాన్ని దర్శించుకోవటమేనన్న నమ్మ కం భక్తజనాళి లో నెలకొనటమే... ఏటా లంకమల్లేశ్వర క్షేత్రం యాత్రకి వచ్చేవారి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది....
దట్టమైన అడవులు....
రాళ్లూ రప్పలతో కూడిన గుట్టలు...
చిన్న చిన్న బాటలు..
పక్షుల కిలకిలా రావాలు...
కౄర మృగాల గర్జింపులు...
ఏనుగుల ఘీంకారాలు...
వందల అడుగుల ఎత్తు నుండి జారే జలపాతాలు...
కాలు జారితే అధ:పాతాళానికే అనిపించేలా భీతిని గొలిపే లోయలు...
పచ్చదనం పరచుకున్న ప్రకృతి ...
అమర్‌నాథ్‌ యాత్రని తలపించే రీతిగా సాగే మరో అద్భుతం....
నల్లమల్ల అడవుల్లో కొలువై ఉన్న శివయ్య దర్శనం.....
.
.
కాకులు దూరని కారడవి... చీమలు దూరని దట్టమైన చిట్టడవులుగా నల్లమల అటవీప్రాంతం బహుప్రసిద్థి చెందింది. విరబూసిన పూలు, రంగు రంగుల పక్షులు, పురివిప్పి ఆడే నాట్య మయూ రాలు.. పచ్చని చెట్లు , వాటిని వాటేసుకుని ప్రకృతితో ఎలా కలసి ఉండాలో చెప్పే అనేక రకాల లతలు, తీగలు, పొదలు వాటిని మించి కోటలకు దీటుగా చీమలు కట్టిన పుట్టలు.. సమాజంలోని దౌర్జన్యకారుల్లా వాటిని ఆక్రమిం చుకుని బుసలు కొట్టే విషసర్పాలు... ఇలా ప్రకృతి అంతా ఒక్కదగ్గరే దర్శనమిస్తూ... కనువిందు చేసే ఈ ప్రాంతాన్ని చూస్తు, మైమరచి పోవాల్సిం దే ఎవరైనా... ఇంత అందమైన అందాలనా,మనం ఇష్టానుసారంగా నరి కేస్తూ... పర్యావరణకి ముప్పుతెస్తునే.. మానవ జాతి మనగడపై ప్రభావం చూపేతీరుగా మనిషి చేస్తున్న తీరుతెన్నుల పట్ల ఏవగింపు కలగక మానదు...
ఇంతటి అద్భుత అందాల నడుమ.. ప్రకృతిని పాలిస్తున్న తీరుగా... కొండకోనల్లో నెలకొన్న గుహల్లో కొలువైన శివయ్య దర్శనం నిజంగా అద్భుత అనుభూతుల్ని మిగిలిస్తుందనే చెప్పక తప్పదు.
.
.
ఆంద్ర ప్రదేశ్, రాయలసీమ, కడప జిల్లా, మైదుకూరు.... కు అటవీ సంపదకు పెద్ద దిక్కుగా ఉన్న ..... నల్లమల అటవీప్రాంతంలో అత్యంత మహిమాన్వితమైన శివాల‌యం....
త్రేతా, ద్వాపరయుగాలలో...
నల్లమల అటవీ ప్రాంతం శైవ క్షేత్రాలకు ప్రసిద్దిగా చెప్పొచ్చు. ఈ క్షేత్రా లలోని మూల విరాట్టు అయిన శివుడికి ప్రతిరూపమైన లింగాలను దేవుళ్లే ప్రతిష్టించారన్నది ఈ ప్రాంత ప్రజల విశ్వాసం...
.
త్రేతాయుగంలో శ్రీరాముడు సీతా, లక్ష్మణుడితో కల్సి వన వాసం చేసిన సమయంలో వారికి ఈ నల్లమల ఆతిథ్యమిచ్చిన ట్లు చెప్తారు. ఈ సమయంలోనే శ్రీరాముడు నల్లమలలో పలు ప్రాంతాలలోని గిరిసీమల్ని దర్శించి... అక్కడక్కడా శివలింగాలు ప్రతిష్టించారని... స్థానిక కథనాలు బోలెడు వినిపిస్తాయి.
ఇక ద్వారపయుగంలోనూ పాండవులు ద్రౌపదీ సమేతులై... అరణ్య వాసంలో ఇక్కడికి వచ్చినప్పుడు వారిని సాదరంగా నల్లమల అక్కున చేర్చుకుని వారికి అన్ని వసతులూ కల్పించిం దని ఈ ప్రాంత ప్రజలు నమ్ముతారు. ఇలా తమ ప్రాంతంలో వనవాస కాలంలో గడిపిన పాండవులు సైతం ఉమామహేశ్వ రం... శ్రీశైలం... మల్లెల తీర్థం ఇలా పలు చోట్ల లింగాలు ప్రతిష్టిం చారని... ఆ క్రమంలోనే లంకమల్లేశ్వర క్షేత్రం లో కూడా లింగాన్ని త్రేతాయుగంలోనో.. ద్వాపర యుగంలోనో ప్రతిష్టించి ఉంటారన్నది ఇక్కడి వారి నమ్మకం.
.
.
అద్భుత జలపాతం..
శివయ్య కొలువుదీరిన గుడి పాదాలను తాకేలా వందల అడుగుల ఎత్తులో శివుడి జటాజుటం నుంచి ఎగిసిపడుతూ... ఉరకలేస్తూ... దూకుతున్న దృశ్యం ఓ మహాద్భుతం. పున్నమి రోజుల్లో చంద్రుడు విరజిమ్మే వెన్నెల పెరుగు తున్న కొలదీ ఈ జలపాతం ధారకూడా పెరుగుతూ ఉంటుందని వచ్చే యాత్రీకులు చెప్తారు.
.
.
అద్భుత జల పాతాల నుంచి వచ్చిన ఔషధగుణాలున్న నీటితో ఏర్పడ్డ గుండంలో పున్నమి నాడు రాత్రి వేళ చంద్రకాంతి పడుతున్న సమయాన స్నానమా చరిస్తే... సర్వ వ్యాధులు తొలగిపోతాయన్నది భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇలా స్నానమాచరించి లింగమయ్యని దర్శించుకుంటే కోరుకున్న కోర్కెలు తీరటంతో పాటు పాపాలు తొలగిపోతాయన్నది విశ్వాసం ప్రబలంగా భక్తుల్లో నేటికీ ఉంది.
.
.
ఎలా వెళ్లాలి....
కడప జిల్లా, మైదుకూరు నుంచి బద్వేలుకు పోవు దారి రాణిబావి దగ్గర కు 16 కిలోమీటర్ల అక్కడ నుండి అడవి మార్గన 14 కిలోమీటర్ల వాహనాలు లేక కాలినడక ద్వార అలయానికి చేరవచ్చును.
బద్వేలు నుంచి 25 కిలోమీటర్ల దూరంలోని లంకమల్ల అడవుల్లో లంకమల్లేశ్వర క్షేత్రం ఉంది. సరైన దారి సౌకర్యం లేదు. దాదాపు 12 కిలోమీటర్లు అడవి మార్గాన ప్రయాణం చేయాల్సి ఉంది.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List