రకరకాల ఆసనాలు, ప్రాణాయామం వంటి ప్రక్రియలను సాధన చేయడమే యోగా అని చాలామంది పొరబడతారు. వాస్తవానికి అవి సోపానాలు మాత్రమే! యోగజీవనం సిద్ధించడానికి అవి సాధనాల వంటివి. పరికరాల వంటివి. యోగమంటే పరిపూర్ణ జీవన విధానం. తొణికిసలాడే అద్భుతమైన జీవన కళ! యోగస్థితి ఉన్నతమైందని గీతాచార్యుడు బోధించాడు. యోగి కావాలని అర్జునుణ్ని స్వయంగా ఆదేశించాడు.
శరీరాన్ని బుద్ధితో, బుద్ధిని మనస్సుతో, మనసును ఆత్మతో, ఆత్మను పరమాత్మతో ఐక్యం చేయగలగాలి. ఇలా చేయడం అంత తేలికేం కాదు. ఈ స్థితిని సాధించాలంటే ఒక క్రమ పద్ధతిలో జీవించాలి. ఆలోచించాలి. ఆ జీవన విధానాన్ని యోగ సాధన అంటారు. శరీరం, మనసు కేంద్రీకృతమైనప్పుడే ఈ లక్ష్యాన్ని సాధించగలుగుతాం. ప్రాణాయామ ధ్యాన ఆసనాదులు యోగసిద్ధికి దోహదం చేస్తాయి.
రామాయణం ఆరంభంలో వాల్మీకి వర్ణించిన పదహారు సత్పురుష లక్షణాలలో ‘ఆత్మవాన్’ అనేదొకటి. ‘రాముడు ఆత్మవిదుడు’ అన్నారు వాల్మీకి. అది యోగి లక్షణం. ‘నీకు పట్టం కడుతున్నాను’ అని తండ్రి అన్నప్పుడు రాముడు పట్టరాని సంతోషంతో ఊగిపోలేదు. మర్నాడే అరణ్యాలకు పోవాలని తీర్పిస్తే కుంగిపోనూలేదు. అడవుల్లో కష్టాలకు కంటతడి పెట్టిన దాఖలాలు లేవు. ‘ఏనాడో పాపం చేసి పుట్టాను. ఈ కోతి మూకతో వేగుతున్నాను’ అని చింతించిన ఘట్టాలు లేవు. భరతునితో, విభీషణుడితో మధ్యలో గుహుడితోనూ ఆయన ఒకేలా ఉన్నాడు. అయోధ్యలో, అడవిలో ఒకేలా ఉండగలిగాడు. అదే యోగజీవనమంటే!
ఇంతటి స్థిర చిత్తం, స్థిత ప్రజ్ఞత రావాలంటే తనను తాను తెలుసుకోవాలి. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా అదుపు చాలా ముఖ్యం. అందుకే యోగమంటే చిత్తవృత్తుల నిరోధంగా పతంజలి మహర్షి నిర్వచించారు. మన శరీరంలో 72వేల నాడులు, 206 ఎముకలు, ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు, ఐదు కోశాలు అనేక ధాతువులు ఉన్నాయి. శరీరం పటిష్టంగా ఉండాలంటే నాడీ మండలం దృఢంగా ఉండాలి. నాడీ మండలాన్ని ప్రభావితం చేస్తూ ప్రధాన శక్తి కేంద్రాల్ని షట్చక్రాలుగా వ్యవహరిస్తారు. మూలాధారం, స్వాధిష్ఠానం, మణిపూరం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞ అనే ఆరు చక్రాల్ని అధిగమిస్తే పరమపదమైన సహస్రార చక్రం ఉంటుంది. ఆ చక్రాన్ని అందుకోవడానికి సాధకులు సాగించే మార్గమే యోగ. ‘ఉద్ధరేదాత్మనాత్మనం’ తనను తానే ఉద్ధరించుకోవాలి. ఇది యోగావలంబనకు మౌలిక సూత్రం. ఆరోగ్యమనేది ఒకరి నుంచి అరువు తెచ్చుకునేది కాదు. ఆధ్యాత్మిక శక్తి ఒకరు ధారపోస్తే సంక్రమించేది కాదు. ఎవరికివారు శోధించుకోవాలి. సాధించాలి. ఆస్వాదించాలి. ‘యోగ ఫర్ లివ్ లైఫ్ టు పొటెన్షియల్’ అనే నినాదంతో నేటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి ప్రతిపాదించింది. ‘జీవితాన్ని శక్తివంతం చేసుకోవడానికి యోగ సాధన చేయాలి’ అనే శారీరక ఆరోగ్య సూత్రాన్ని విశ్వవ్యాప్తంగా ప్రచారం చేస్తోంది. యోగ అనేది మధురమైన మిఠాయి లాంటిది. ఆస్వాదిస్తేనే దాని వైశిష్ట్యం తెలుస్తుంది.

No comments:
Post a Comment