రామదాసు స్వామిజీ, నదిలో ధ్యానమగ్నులై వుండగా అక్కడికి దగ్గరిలోని ఊరి నుండి ఒక స్త్రీ రోజు వచ్చి ఆయనకు దణ్ణం పెట్టి వెళ్తుండేది.
ఒకరోజు అలా ఆమె దణ్ణం పెడుతుండగా స్వామి కళ్లు తెరిచి “అష్టపుత్ర భాగ్యవతి భవ” అంటూ ఆశీర్వదించి మళ్ళీ ధ్యానమగ్నులయ్యారు. ఆ మాటకి ఆమె ఎంతో ఆశ్యర్యపడింది. ఆమెకు పెళ్ళి అయ్యి ఎన్నో సంవత్సరాలయిన సంతానం లేదు సరికదా ఆమె భర్త దీర్ఘరోగి. ఇంక బ్రతకడు... అని చుట్టు ప్రక్కల వాళ్లు ఆమె మీద దయ చూపిస్తున్న పరిస్థితిలో ఆమె భర్త వున్నాడు. అలాంటిది ఆమె ఎంతో మహానుభావుడని భావిస్తున్న ఆ బాలయోగి నోటి వెంట వచ్చిన ఆశీర్వాదం ఆమెకి ఆశ్చర్యాన్ని కలిగించిందేగాని, ఆనందాన్ని కాదు.
కాని అలాంటి మహాయోగి ఆశీర్వాదం వృధాకాదు అని ఆమె త్వరగా గ్రహించింది. ఆమె భర్త ఆరోగ్యవంతుడవడమే కాదు. త్వరలోనే ఆమెకు ఒక పుత్రుడు కూడా కలిగాడు ఆ భార్యభర్తలు తమ మొదటి సంతానాన్ని స్వామికే ఇవ్వాలనుకున్నారు. వారి ఆ నిర్ణయాన్ని బంధువులు, ఊరి వారు ఎంతో వ్యతిరేకించారు మళ్ళీ సంతానం కలుగుతుందో లేదో అని భయపడ్డారు. కాని ఆ తల్లికి స్వామి ఆశీర్వాదం మీద నమ్మకం కుదిరింది. అందుకే ఆ బిడ్డను తీసుకువెళ్ళి స్వామికి అప్పగించింది. ఆయనే రామదాస స్వామిజీ ప్రియశిష్యులలో ఒకరయిన ఉద్దవ స్వామి. 12సం.ల తపోవన్ సాధన తరువాత 1632వ సం.లో తమ ఆధ్యాత్మికతలో భాగంగా పాదయాత్రను మొదలుపెట్టారు. ఉత్తరం నుండి దక్షిణం వరకు పూర్తి భారతదేశాన్ని నడిచారు. ఆ సమయంలో భారతదేశం చాలా వరకు పరమతస్థుల ఆధీనంలో వుంది. ఎన్నో చోట్ల హిందూ దేవాలయాలు కూల్చబడటం దోచుకోబడటం చూశారు, ప్రజల కష్టాలు చూశారు. వీటన్నిటిని ఆయన “ఆస్మాని సుల్తానీ”మరియు "పరాచక్రాణిపూర్ణ" అను పుస్తకాలలో వివరించారు. 12సం.లు ఆసేతు హిమాచలం తిరిగాక చివరిగా మహాబలేశ్వర్‌లో ఆగారు. అప్పుడే దగ్గర లోని అంగాపూర్ అనే గ్రామంలో ...కృష్ణానదిలో రాముని విగ్రహం దొరిగింది స్వామిజికి. ఆయన దానిని అక్కడి ప్రతిష్ఠించి ఆ సంవత్సరం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వామి రాముని ప్రియ భక్తుడయిన, హనుమంతుడిని ఎంతో ప్రేమతో ఆరాధించారు. హనుమంతుని స్వామి భక్తి, ధైర్యసాహసాలు ఆయనను ఎంతో ప్రభావితం చేశాయి. ఆయన తమ జీవితంలో ఎన్నో వందల హనుమంతుని విగ్రహాలను ప్రతిష్టించి ఆయన పట్ల తమకున్న భక్తి చాటుకున్నారు.
ఆయన తమ ప్రవచనాలు ఎక్కువగా యువతను ఉద్దేశించి, స్త్రీ సమానత్వాన్ని ఉద్దేశించి వుండేవి. హిందూమతం తిరిగి పూర్వవైభవం పొందాలంటే అది యువత వల్లే సాధ్యమని ఆయన నమ్మారు. అంతే కాదు స్త్రీలను ఇంటికే పరిమితం కాకుండా ఆధ్యాత్మిక ఉద్యమంలో భాగం పంచుకోవాలని ప్రవచించారు. కీర్తనల ద్వారా, ప్రవచనం ద్వారా ఆధ్యాత్మికతను బోధిస్తు మహారాష్ట్రలోని కొల్హాపూర్ చేరారు స్వామిజీ. అది 1645వ సంవత్సరం అక్కడ ఆయన తమ కీర్తనల ద్వారా, ప్రవచనాల ద్వారా అందరిని ఆకర్షిస్తున్నారు. అలా స్వామికి ఆకర్షితులయిన వారిలో బావాజీ పంత్ ఒకరు. ఆయన ఒక రోజు స్వామిని తమ ఇంటికి భిక్షకి ఆహ్వానించారు. ఆయన ఆహ్వానాన్ని మన్నించి స్వామి వారి ఇంటికి భిక్షకి వెళ్ళారు. భిక్ష తరువాత , భావజీ పంత్ స్వామికి దక్షిణగా కొంత డబ్బులివ్వబోయారు. స్వామి ఆ దక్షిణ తిరస్కరించడంతో భావాజీ పంత్ బాధపడుతూ స్వామిని ప్రాధేయపడటం మొదలుపెట్టాడు. దానితో స్వామి నీవు నిజంగా ఇవ్వాలి... అనుకుంటే నీ మేనల్లుడు అయిన అంబాజీని నాకు ఇవ్వు అని అడిగారు. ఈ అంబాజీ, బాబాజీ పంత్ చెల్లెలు రుక్మాభాయి కృష్ణాజీపంత్ కులకర్ణిల పుత్రుడు. అంబాజీ మరియు దత్తాత్రేయ అను పుత్రులు కలిగాక కృష్ణాజీ సన్యాసం తీసుకొని ఎటో వెళ్ళిపోయారు. అప్పటి నుండి రుక్మాబాయి ఇద్దరు పిల్లలతో అన్న దగ్గరే వుంటుంది.
సమర్ధ రామదాస స్వామి కోరిక మేరకు రుక్మాభాయి ఆమె ఇద్దరు పిల్లలు స్వామి వారి బృందంలో కలిసిపోయారు.

No comments:
Post a Comment