నాడీ దోషం. ~ దైవదర్శనం

నాడీ దోషం.

నాడీ దోషం ఎంతో విశిష్టమైనది.విడువరానిది.వదూవారులిద్దరిదీ ఏకనాడీ అయితే వారి వివాహం ఎట్టి పరిస్ధితులలోను చేసుకొనకూడదు.వదూవరులిద్దరిదీ ఏక శరీర తత్వము కాకూడదు అనేది నాడీ నిర్ణయం.వివాహమునకు తరువాత వ్యక్తి క్రొత్త జీవితములోనికి ప్రవేసించునని పెద్దలు అంటారు, పెద్దలు ఇట్లు చెప్పుట చాలా వరకు సరైనది కూడ. వివాహమునకు తరువాత ప్రారంభమగు క్రొత్త జీవితము సుఖమయముగా వుండుటకు కుండలి యొక్క లెక్కింపు చేసెదరు. కుండలి యొక్క లెక్కింపు క్రమములో అష్టకూటము ద్వారా విచారణ చేసెదరు. ఈ అష్ట కూటము (Ashtkoot)లో ఎనిమిదవ మరియు అంతిమ కూటము నాడీ కూటము. నాడీ కూటమి సరిగా లేకుంటే మిగతా ఏడు కూటాల గుణాల్ని కూడా నాశనం చేస్తుంది.

శరీరాన్ని మూడు భాగాలుగా విభజించారు.జ్యోతిష్య శాస్త్రము (Astrology)లో నాడులు మూడు ప్రకారములుగా వుండును, ఈ నాడుల పేర్లు ఆదినాడి, మధ్య నాడి, అంత్య నాడి.

1.    ఆది నాడి: జేష్ట, మూల, ఆర్ద్ర, పునర్వసు, ఉత్తరఫల్గుని, హస్త, పూర్వభాద్ర మరియు అశ్విని నక్షత్రములు ఆది లేదా ఆద్య నాడిలో వుండును. దీని వల్ల మేదోసంపత్తి,ప్రతీకార వాంఛ,ఆలోచనా విధానం,కోపం,ఆవేశం తెలుపుతుంది.

2. మద్య నాడి: పుష్యమి, మృగశిర, చిత్ర, అనురాధ, భరణి, దనిష్ట, పూర్వాషాడ, పూర్వఫల్గుణి మరియు ఉత్తరాభాద్ర నక్షత్రములు మధ్య నాడిలో వుండును. దీని వల్ల శరీరం మద్య భాగంలో ఉన్న రుగ్మతలు,సంతానం, ఊపిరితిత్తులుగుండెలో ఉన్న రుగ్మతలు తెలుపుతుంది.

3. అంత్య నాడి: స్వాతి, విశాఖ, కృత్తిక, రోహిణి, ఆశ్లేష, మఘ, ఉత్తరాషాడ, శ్రవణ మరియు రేవతి నక్షత్రములు అంత్య నాడిలో వచ్చును. దీనివల్ల మర్మాయవాలు,కమవాంఛ,నపుంసకత్వం గురించి తెలియజేయును.

జ్యోతిష్య శాస్త్ర ఆదారముగా యది వరుడు మరియు కన్య ఇరువురి నక్షత్రములు ఒకే నాడిలో వుండిన అప్పుడు ఈ దోషము కలుగును. అన్ని దోషముల కన్నా నాడీ దోషము అశుభ కరముగా చెప్పబడుతున్నది. ఎందుకంటే ఈ దోషము కలుగుట వలన 8 అంఖము యొక్క హాని కలుగును. ఈ దోషము కలుగుట వలన వివాహ ప్రసంసము చేయుట శుభకరముగా వుండదు.

మహర్షి వశిష్టు (Maharishi Vashisht)ని అనుసారముగా నాడీ దోషము లో ఆది, మధ్య మరియు అంత్య నాడులకు వాతము (Mystique), పిత్తము (Bile) మరియు కఫము (Phlegm) అనే పేర్ల ద్వారా తెలిపెదరు.

నాడి మానవుని యొక్క శారీరక ఆరోగ్యమును కూడ ప్రభావితము చేయును (Nari also effect human health). ఈ దోషము కారణముగా వారి సంతానము మానసికముగా వికసితము లేని మరియు శారీరకముగా అనారోగ్యముతో వుండును (Naridosh also effect Mind of their Child and Health of their Child).

ఈ స్థితులలో నాడీ దోషము కలుగదు: (Naridosha will not affect you in this Conditions)

1. యది వరుడు - వధువు యొక్క జన్మ నక్షత్రములు (Birth Nakshatras) ఒకటిగా వుండిననూ ఇరువురి చరణములు ప్రదమ చరణమైన ఎడల నాడీ దోషము కలుగదు.

2. యది వరుడు - వదువు ఒకే రాశిగా వుండి (Bride and Groom have Same Rashi) మరియు జన్మ నక్షత్రము బిన్నమైన (Different Birth Nakshatras) ఎడల నాడీ దోషము నుండి వ్యక్తి ముక్తి పొందగలడు.

3. వరుడు - వధువు యొక్క జన్మ నక్షత్రము ఒకటిగా వుండి మరియు రాశులు వేరు వేరుగా (Different Rashi) వుండిన ఎడల నాడీ దోషము కలుగదు.

  తప్పనిసరి అయితే నాడీ దోష పరిహారానికి మృత్యుంజయ జపం సువర్ణ దానం చేయాలి.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List