నడవడి నేర్పిన రాముడు. ~ దైవదర్శనం

నడవడి నేర్పిన రాముడు.


హిందూలు పవిత్రంగా భావించే గ్రంధాలు రామాయణం, భారతం, భాగవతం. ఇవి అన్నీ మానవ మనుగడకి కావలసిన జీవిత నౌకల వంటివి. వాటిలోని ప్రతీ సన్నివేశం క్షుణ్ణంగా పరిశీలిస్తే, నేడు మనకి వస్తున్న అనుభవాలలాగే ఉంటారుు. ఇక అందులో ప్రతి పాత్రా మానవజీవిత పరమార్ధానికి అద్దం పట్టేవే. రామాయణ కాలంలో శ్రీరాముడు, హనుమంతుడు, లక్ష్మణుడు, రావణుడు, గుహుడు ఇత్యాది చరిత్రలన్నీ మనం ఏ విధంగా నడచుకుంటే ధర్మాన్ని నిలబెట్టగలమో సూచించే దిక్సూచులే. అదేవిధంగా మహాభారత కాలంలో ధర్మరాజు, శ్రీకృష్ణూడు, అర్జునుడు, దుర్యోధనుడు మెుదలైన వ్యక్తుల వ్యక్తిత్వాలు కూడా మనల్ని జీవితాంతం నడిపించే జీవగరల్రే. అందుేక, ‘రాముడిలా నడచుకోవాలి, కృష్ణూడిలా మసలుకోవాలి’ అని పెద్దలు చెప్తూవుండేవారు. శ్రీరాముడు మనిషి ఏవిధంగా నడచుకోవాలో ఆ విధంగా తాను ఆచరించి చూపించాడు. శ్రీకృష్ణూడు అన్నిటా తానై ఉంటున్నట్టు కనిపించినా తామరాకు మీద నీటి బిందువులా మసలుకున్నాడు.
అమృత వాక్కులు
రజీవులను సేవించడమే శివుని సేవించడం రచేతులకు నూనె రాసుకొని పనసపండును ఒలిస్తే దాని జిగురు చేతులకు అంటుకోదు. అలాగే ముందునీ మనస్సుకు భక్తి అనే నూనెను రాసుకున్న పక్షంలో కామినీ కాంచనాల మాలిన్యం నీకు అంటక సంసారంలో మనలగలవు
రాముని జనన విశేషం...
రాముడు అదితి దేవతా నక్షత్రం అయిన పునర్వసు నక్షత్రంలో నవమినాడు ఈ భూమిపై జన్మించాడు. అదే విధంగా రాక్షస రాజైన రావణాసురుడు మఖ నక్షత్రంలో జన్మించాడు. మఖకి, పునర్వసు 3వ నవకంలో 7వ తార అవుతుంది. ఈ 7వ తారని నైధనతార అంటారు. నిధనం అంటే మరణం అని అర్ధం. మరణాన్ని ప్రసాదించడం కోసమే రాముని జననం. అదే రాముని జన్మరహస్యం. ‘దుష్ట శిక్షణ శిష్ట రక్షణ’ చేయడం కోసం అవతరిస్తానని స్వయంగా శ్రీహరి ఇచ్చిన మాటని నెరవేర్చుకునే క్రమంలో రాక్షస బాధల నుంచి లోకాన్ని రక్షించే కార్యక్రమం కోసం, తిరిగి భూమి మీద ధర్మాన్ని నిలపే ప్రయత్నంలో భాగమే రామావతారం. రావణ సంహారం చేసి ఈ భూమి మీద ‘పునర్‌ వసు’ (సంపద) నిలబెట్టడమే రామావతార లక్ష్యం.
ఇందులోనే శిష్ట రక్షణ కూడా దాగివుంది. ఎలాగంటే, వైకుంఠ ద్వారపాలకులైన జయవిజయులు శ్రీహరి పరమ భక్తులు. సప్త ఋషుల వల్ల శాపగ్రస్తులవ్వగా శ్రీహరి తరుణోపాయాన్ని ప్రసాదించాడు. అవి ఏమిటంటే, పరమ భక్తులుగా పుట్టి 7జన్మల తర్వాత తనను కలుసుకోవడం ఒక మార్గం, ఇక రెండవది బద్ధ శత్రువులై శ్రీహరి చేతిలోనే సంహరింపబడి 3 జన్మల్లోనే స్వామి సన్నిధిని చేరుకోవడం. ఈ రెండింటిలో ఏది కావాలో కోరుకోమని శ్రీహరి అడగగా, శ్రీహరిని విడిచి 7జన్మలు గడపటం అసాధ్యంగా భావించిన జయవిజయులు, ‘స్వామీ మేము తమకు బద్ధ విరోధులమై 3జన్మల్లోనే తిరిగి మీ వద్దకు వచ్చేటట్టు వరాన్ని ప్రసాదించు’ అని వేడుకున్నారు. శిష్టులైన వీరికి శాప విమోచనాన్ని కలిగించి రక్షించడం తన కర్తవ్యం.
రాముని జననం వెనుక ఉన్న దేవరహస్యాన్ని ఒక్కసారి పరికిస్తే, భూలోకంలో మానవులు పడుతున్న కష్టాలు చూడలేక అన్ని సుఖాల్నీ వదిలి ఆ వైకుంఠవాసుడు మన కోసం అవతారం ధరించాడు. పుట్టడం కూడా రామ అనే పేరుతో పుట్టాడు. రాక్షస మర్ధనం కోసం జన్మించినందున రామా అనే నామంతో పుడుతానని ఆ శ్రీహరి ముందుగానే నిర్ణయించాడు. ఒక సామాన్య మానవునిలా మన మధ్య సం చరిస్తూనే, చక్రవర్తి కుమారునిగా జన్మించి కూడా మాన వాళి కోసం, విశ్వ శ్రేయస్సుకోసం అన్నిటినీ త్యజించి తండ్రి మాట జవదాటకుండా వనవాసానికి వెళ్ళి అన్నిరకాల కష్టా లూ అనుభవించాడు. పుట్టడానికి ముందే ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్న రాముడు లక్ష్యసాధనలో సామాన్య మానవు నిగానే ఉన్నాడు తప్ప దివ్యపురుషుడిగా మహిమాన్వితునిగా ఎక్కడా ప్రకటించుకోలేదు. తన దైవత్వాన్ని ప్రదర్శించలేదు.
ఆ కాలంలోనే శ్రీరాముడు జాతి, కుల వివక్షలేకుండా స్నేహ ధర్మాన్ని పాటించి విశ్వసౌభ్రాతృత్వం కనబరచిన మాన్యుడు శ్రీరామచంద్రుడు. అందుకు ఉదాహరణ, తనకన్నా తక్కువ స్థితిలో ఉన్న గుహుడ్ని ప్రేమతో అక్కున చేర్చుకుని కులం అంటే మనవత్వం అని చాటిచెప్పిన గొప్ప మానవతావాది శ్రీరాముడు. పక్షి జాతి అయిన జటాయువుని పట్ల కృతజ్ఞతా భావంతో అంత్యక్రియలు కూడా చేసి సద్గతుల్ని ప్రసాదించిన ఆదర్శమూర్తి శ్రీరామచంద్రుడు. వనచర జాతికి చెందిన వానర సమూహంతో స్నేహ బంధాలు ఏర్పరచుకున్న స్నేహశీలి.
దుష్టుడైన వాలిని వధించి, రాజ్యాన్ని వాలి తమ్ముడు సుగ్రీవునకు ధారపోసాడు. అలాగే రావణాసుర సంహారం తర్వాత లంకకి విభీషణుడ్ని రాజుని చేసాడు. ఈ రెండు చర్యల వల్లా శ్రీరాముడి ఔన్నత్యం కళ్ళకి కట్టినట్టు నేటికీ కనబడుతుంది. రాజ్యకాంక్షగానీ, లోభత్వం కానీ, స్వలాభాపేక్షగానీ రామునిలో కనిపించవు. అదీకాక ఈ సంఘటనల వల్ల శ్రీరాముని దాతృత్వం కూడా వ్యక్తమవుతుంది. అలాగే కైకేయి కోరిక మీద, తండ్రి ఆనతి తలదాల్చి రాజ్యాన్ని భరతునికి ధారపోసి వనవాసానికి వెళ్ళడం వల్ల తల్లిదండ్రుల పట్ల తనయుల కర్తవ్యాన్ని ప్రత్యక్షంగా చూపించిన ధీరుడు శ్రీరామ చంద్రుడు. కట్టుకున్న ఇల్లాల్ని ఎంతగా ప్రేమించాడో, ఆమెని విడిపించడాన్ని బట్టే అర్ధం అవుతుంది. క్షత్రియ వంశంలో పుట్టినా, ఎవరో ఎత్తుకుపోయాడు మనకెందుకులే, మరో రాకుమార్తెను పెళ్ళాడదాం అనుకోలేదు. సాక్షాత్‌ లక్ష్మీదేవి అంశతో పుట్టిన సీతాదేవిని తిరిగి తెచ్చుకోవడం కోసం తనే స్వయంగా రావణసంహారానికి పూనుకున్నాడు. తమ్ముళ్ళ మీద అమిత ప్రేమానురాగాల్ని కురిపించాడు. ఈవిధంగా రామునిలో ఉన్న ప్రేమతత్వం విశిధమవుతుంది.
ఇక్కడ మరో విషయం ఏమిటంటే, రామునిది ఒకే మాట, ఒకే బాణం, ఒకే పత్ని. ఇది కూడా ఆయన స్వయంగా ప్రకటించుకున్నాడు. చెప్పినదానినే తూ.చా. తప్పకుండా ఆచరించాడు. తండ్రికిచ్చిన మాటని పాటించాడు. అరణ్యవాసం తరువాత నగరానికి వచ్చిన శ్రీరాముడు పట్టాభిషిక్తుడై ప్రజలకిచ్చిన మాట కోసం మళ్ళీ సీతామాతను పరిత్యజించాడు. అందుకే ఒకే మాట మీద నిలబడే రాముడు, సత్యవాక్పరిపాలకుడు అన్న బిరుదు వహించాడు.
ఎంతటి శత్రువుకైనా, తప్పు తెలుసుకునేందుకు, ప్రవర్తన మార్చు కునేందుకు అవకాశం ఇచ్చాడు. రావణాసురునికి కూడా అవకాశాన్నిచ్చాడు. ధర్మ యుద్ధాన్నే సాగించాడు. రామభాణానికి తిరుగులేదు. అయినా వెంటనే దానిని ప్రయోగించకుండా అంచెలంచెలుగా విజయాన్ని సాధిస్తూ రావణుడు ఏకాకిగా మిగిలేంతవరకూ అవకాశం ఇచ్చాడు. చివరికి రామబాణం ప్రయోగించి రావణ సంహారం గావించాడు. ఒకే బాణంతో ప్రాణాలు హరించాడు.
సీతామాతనే తప్ప అన్యకాంతల ముఖాలు కూడా చూడలేదు. శూర్పణఖ వృత్తాంతమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. ఏకపత్నీ వ్రతాన్ని ఆచరించిన మహోన్నతుడు శ్రీరామచంద్రుడు. అందుకే ఆయనకి ఒకే పత్ని. అన్న బాటని అనుసరించారు తమ్ముళ్ళు. తమ్ముల మాటని గౌరవించాడు శ్రీరాముడు. భ్రాతృప్రేమకి ఇదే నిదర్శనం. రామునిలో ఇన్ని కోణాలు దర్శించి రచించిన వాల్మీకి ఆ రామాయణ కావ్యాన్ని మనకందించాడు. రామాయణం అన్ని యుగాలకీ నిత్య పారాయణం.
రామునిది ఒకే మాట, ఒకే బాణం, ఒకే పత్ని. ఇది కూడా ఆయన స్వయంగా ప్రకటించుకున్నాడు. చెప్పినదానినే తూ.చా. తప్పకుండా ఆచరించాడు. తండ్రికిచ్చిన మాటని పాటించాడు. అరణ్యవాసం తరువాత నగరానికి వచ్చిన శ్రీరాముడు పట్టాభిషిక్తుడై ప్రజలకిచ్చిన మాట కోసం మళ్ళీ సీతామాతను పరిత్యజించాడు. అందుకే ఒకే మాట మీద నిలబడే రాముడు, సత్యవాక్పరిపాలకుడు అన్న బిరుదు వహించాడు.
రాజ్యకాంక్షగానీ, లోభత్వం కానీ,
స్వలాభాపేక్షగానీ రామునిలో కనిపించవు. అదీకాక ఈ సంఘటనల వల్ల శ్రీరాముని దాతృత్వం కూడా వ్యక్తమవుతుంది. అలాగే కైకేయి కోరిక మీద, తండ్రి ఆనతి తలదాల్చి రాజ్యాన్ని భరతునికి ధారపోసి వనవాసానికి వెళ్ళడం వల్ల తల్లిదండ్రుల పట్ల తనయుల కర్తవ్యాన్ని ప్రత్యక్షంగా చూపించిన ధీరుడు శ్రీరామ చంద్రుడు. కట్టుకున్న ఇల్లాల్ని ఎంతగా ప్రేమించాడో, ఆమెని విడిపించడాన్ని బట్టే అర్ధం అవుతుంది.
దేవతలు ఎందరు?
ఎవరిని అడిగినా దేవతలు ఎంతమంది అంటే మూడుకోట్ల మంది అని ఠక్కున చెప్పేస్తారు. వారి ఉత్పత్తి మాత్రం పండితులకు తప్ప సామాన్యులెవ్వరికీ తెలియదంనడంలో అతిశయోక్తి లేదు.దేవతలు రెండు రకాలు. జన్మదేవతలు, కర్మ దేవతలు. అగ్ని, ఇంద్రుడు, యముడు, వాయువు, వరుణుడు మొదలగు వారంతా జన్మ దేవతలు. భూలోకం, ఇతర లోకాల్లో పుణ్య కర్మలు చేసి వాటికనుగుణంగా స్వర్గాది భోగాలను అనుభ వించడానికి వెళ్ళే నహుషుడు మొదలగు వారు కర్మ దేవతలు. మొదటిరకం వారు.. లోక హితానికై సృష్టిం చబడి, ఆయా అధికారాలు చెలాయిస్తూ యజ్ఞ, యాగాదులలో భోక్తల్తె, ప్రళయం వర కు ఉండేవారు, ఇక రెండవ రకం, వారి పుణ్యఫలాలు తరిగిపోగానే, మళ్ళీ వారి కర్మలననుసరించి ఇతర లోకాలకు పోయి జన్మించే వారు. మొదటి తరగతి వారు అష్ట వసువులు, ఏకాదశ రుదల్రు, ద్వాదాశాది త్యులు, ఇద్దరు అశ్వినీ దేవతలు మొత్తం 33 వర్గాలు. 33 కోట్ల దేవతలని కూడా ప్రసిద్ధి.
ఇక్కడ కోటి అంటే సమూహం అనే అర్థమే తీసుకోవాలి గానీ, సంఖ్యతో సంబంధం లేదు. ఇంకా పితృదేవతలు అని మరొక వర్గం ఉంది. వీరు మరణించిన వారి సంత తిచే చేయబడే శ్రాద్ధ కర్మలచే తృప్తి పొంది, మృతులకు వారి బంధువులకు కూడ దుర్గతి నివారణ, సద్గతి ప్రాప్తి కలిగించగల అధికా రాన్ని కలిగి ఉంటారు. మనిషి మరణించడం తోటే, మొదట వెళ్ళేది పితృ లోకానికే. అక్క డే అందరి జన్మల వివరాలు, చేసిన పాప పుణ్యాల జాబితాలు ఉంటాయి. ఆ లోకంలో ఉన్న జాబితాకు కనుగుణంగా, జీవి ఆయా లోకాలకు వెళ్తాడు. తిరిగి కర్మలనాచరించి ఈలోకానికి చేరుతుంటాడు. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం. అన్నారు శంకర భగవత్పాదులు.
ఒక్కొక్క సారి చాలామందికి ఎన్నో సందేహాలు కలుగుతూవుం టాయి. పురాణాల్లో కూడా అనేక సందేహాలు తలెత్తుతాయి. అయితే వాటన్నిటికీ సందేహ నివృత్తి కూడా ఆయా పురాణాల్లోనే ఉంటుంది. అదే పురాణ గ్రంధాల్లోని విశిష్టత. ఇక్కడ దుర్వాసునికి కోపం ఎందుకు పెట్టవలసి వచ్చిందో కూడా ఆయన వృత్తాంతంలోనే ఉంది.
దూర్వాసునికి కోపం వచ్చింది
అయితే, దూర్వాసుడి పుట్టుక గురించి పురాణాలలో ఎన్నో కథలు ఉన్నాయి. వాటిలోని ఒక కథను అనుసరించి, ఒకసారి బ్రహ్మకు, శివుడికి మధ్య మాటామాటా పెరిగి పెద్ద రాద్థాంతం అయ్యింది. పరమేశ్వరుడు ప్రళయరుద్రుడు అయ్యాడు. ఆయన కోపాగ్ని జ్వాలకు దేవతలు తల్లడిల్లిపోయారు. పార్వతి కూడా తన భర్త కోపాన్ని భరించలేక, శివుణ్ని చేరి ‘దూర్వాసంభవతిమి’ అంటే మీతో కాపురం చేయడం కష్టమై పోతోంది’ అంటూ వాపోయింది. అప్పుడు శివుడు తన కోపాన్నీ, ఉద్రేకాన్నీ మరొకరిలో ప్రవేశపెట్టి పార్వతిని సుఖపెట్టాలని అనుకున్నాడు. తరువాత జరిగిన మరో సంఘటనలో త్రిమూర్తులు అనసూయా దేవికి ప్రత్యక్ష్యమై ఏదైనా వరం కోరుకొమ్మన్నారు.
అప్పుడు ఆ మహా సాధ్వి ‘మీ ముగ్గురి దివ్యాంశలతో నాకు బిడ్డలు కలగాలి’. అని కోరుకుంది. వారు సరేనన్నారు. ఆ ప్రకారం బ్రహ్మ అంశతో చంద్రుడు, మహా విష్ణువు అంశతో దత్తాత్రేయుడు కలిగారు. ఆగ్రహాన్ని శివుడు అనసూయలో ప్రవేశపెట్టగా, ఆ కోప స్వభావునిగా, ఆనసూయకు దూర్వాసుడు పుట్టాడు. అలా కోపానికి మారు పేరయ్యాడు. దేవతలు సైతం దూర్వాసుడు పేరు చెప్తే వణికిపోతారు.
ఆత్మజ్ఞానం అందించేదే గీత
నేటి యాంత్రిక జీవన విధానంలో ప్రతి ఇంటా చేయవలసిన భగవద్గీత పారాయణం చాలా మందికి సాధ్యపడని విషయం. అందుకే కనీసం రోజుకు రెండు గీతా శ్లోకాలు చదివితే జీవిత పరమార్ధం, గీతార్ధం అందరికీ అవగతమౌతాయి.
(ద్వితీయోధ్యాయం- సాంఖ్యాయోగం)
శ్లోకంః యం హి న వ్యథయం త్యేతే
పురుషం పురుషర్షభ
సమ దుఃఖ సుఖం ధీరం
సోమృతత్వాయ కల్పతే
హే పురుష శ్రేష్ఠా! ప్రకృతి సిద్దమైన అనుకూల, ప్రతికూల అనుభవాలు త్రోసిపుచ్చ రానివే. ఎండ, వానల వల్ల కలిగే శ్రమను సహించుట అలవాటే. అలాగే యుద్ధంలో బంధువధవల్ల కలిగే సుఖమైనా, దుఃఖమైనా తాత్కాలికమే అనే ధైర్యంతో ఎదుర్కొను సమ బుద్ధి కలవానిని మాత్రా స్పర్శలు ఏమీ చేయ లేవు. అట్టి స్వవర్ణోచిత కర్మను బాధలెదురైనా సమబుద్ధితో సహనబుద్ధితో చేయు మానవుడు మాత్రమే అమృతత్వమునందగలడు. అందుకే ఓరిమి అలవరచుకొమ్ము. అమృతత్వాన్ని సాధింపుము.
శ్లోకంః అవినాశి తు తద్విద్ది
యేన సర్వ మిదం తతం
వినాశ మవ్యయ స్వాస్య
న కశ్చిత్‌ కర్తు మర్హతి
ఆత్మ నాశమునొందక నిత్యముగా ఉండుటకొక కారణమును తెలిపెదను. ఏదైనా ఒక వస్తువు మరొక వస్తువును నశింపజేయ వలెనంటే, అందులో దూరి, దానిని నిశింపజే యవలెను. ఆత్మలు అతి సూక్ష్మములు. ఏ సూక్ష్మ పదార్థమునందైనా ప్రవేశించగలవు. కానీ ఆత్మయందు ప్రవేశించగల సూక్ష్మ పదార్ధం ఏదీ లేదు. ప్రకృతిలో అన్ని పదార్ధాల్లో ప్రవేశించగల శక్తి ఆత్మకుంది. కాబట్టి ప్రకృతి వల్ల తయారగు శరీరములన్ని నశించేవి. ఆత్మ నశించనిది. కనుకనే ఏ విష శస్త్రాదులూ ఆత్మను ఏమీ చేయలేవు.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List