జ్వాల తోరణం అంటే ఏమిటి ? ~ దైవదర్శనం

జ్వాల తోరణం అంటే ఏమిటి ?

జ్వాల తోరణం …..అఖండము అనగా పెద్ద మట్టి మూకిడి కొత్తది తీసుకుంటారు. దానిలో తాముమొక్కుకున్న మేర నువ్వుల నూనె పోసి రూపాయి నాణెమును వేస్తారు. కొత్త గుడ్డతో వత్తిని చేసి మూకిడిలో ఉంచుతారు. ప్రమిదను వెలిగించి దానితో అఖండమును వెలిగిస్తారు. ఈ అఖండమును రెండు చేతులతో పట్టుకొని ఆలయం చుట్టూ ఒక ప్రదక్షిణం పూర్తి చేసి, తదుపరి ఆలయ గోపురంపై, మండపంపై, గోడలపై ఉంచుతారు . ఆ ప్రమిదలను దూరం నుండి చూసినప్పుడు ఆకాశంలో ని నక్షత్రాల గుంపు కిందకి వచ్చినట్లు మిణుకు మిణుకు మంటూ బహు సుందరంగా కనిపిస్తుంది. చిచ్చుల తోరణాన్నే జ్వాల తోరణం అని కూడా అంటారు.కార్తిక పౌర్ణమి నాటికి అప్పుడే వచ్చిన వరి గడ్డిని తీసుకువస్తారు . కొత్తగా తీసిన గోగునారను తాడులా పేని వరిగడ్డిని విచ్చెలు విచ్చెలు గ వేలాడ దీస్తారు. ఈ జ్వాలా తోరణాన్ని శివాలయమునకు ఎదురుగా ఉన్న రెండు వేప చెట్లకు వేలాడ దీస్తారు. అఖండములు పూర్తి అయిన పిమ్మట జ్వాలా తోరణం వెలిగిస్తారు. గడ్డి అంతా కాలడం మొదలు పెట్టిన తర్వాత గ్రామంలోని రైతు లందరూ ఆ గడ్డి పోచలు, నారా పీచులు దక్కించుకోవటానికి పోటి పడతారు(యువకులు పోటీ పడటం రగ్బీ ఆటను తలపిస్తుంది!). వీటిని పశువుల మేతలో కలిపి పెట్టుట, పశువుల మెడలో కట్టుట చేస్తారు. ఈ విధంగా చేయుట వలన పశువులకు ఎలాంటి హానీ జరగదని నమ్మకం. అఖండములు వెలిగించుట , చిచ్చుల తోరణం మండించుట… చూడవలసినదే కానీ వర్ణించుట తరము కాదు. భక్తి పారవశ్యంతో స్వామి వారికి అఖండములు సమర్పించే సమయంలో గ్రామం మొత్తం శివాలయం వద్దే ఉంటుందనుట అతిశయోక్తి కాదు.కార్తీక పౌర్ణమినాడు ఎవరు జ్వాలా తోరణం కిందనుంచి శివుని పల్లకితో ప్రయాణం చేస్తారో, వారు యమపురి ద్వార తోరణ బాధను తప్పుకొంటారు అని. మరో విశ్వాసం కూడా ప్రచారంలో ఉన్నది. క్షీరసాగర మథనం జరిగినపుడు మొట్టమొదట హాలాహలం ఉద్భవించినపుడు, లోకాలను కాపాడటానికై శివుడు దానిని మింగి తన కంఠంలో నిలుపుకొని గరళ కంఠుడు లేదా నీల కంఠుడు అయ్యాడు. అయితే విషాన్ని మింగిన తన భర్తకు ఏ హానీ కలుగకుండా ఉంటే తాను తన భర్తతో సహా జ్వాలాతోరణంగుండా మూడూ సార్లు నడుస్తానని ఆవిడ మొక్కుకొందిట.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List