ప్రొద్దుటూరు ముక్తి రామేశ్వరం పురాణ చ‌రిత్ర‌. ~ దైవదర్శనం

ప్రొద్దుటూరు ముక్తి రామేశ్వరం పురాణ చ‌రిత్ర‌.


* పినాకి భార్య పినాకిని న‌ది గా ఎలా మారింది...?
* ప్రొద్దుటూరు కు అపేరు ఎలా వ‌చ్చింది...?
.
ప్రొద్దుటూరు పట్టణం, భారత దేశం లోని ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో, వైఎస్ఆర్ జిల్లాలో కడప పట్టణానికి 55 కి మీ ల దూరంలో ఉన్న ప్రముఖ వ్యాపార కేంద్రం. ప్రొద్దుటూరు .
శ్రీరామచంద్రుడు, రావణవధానంతరము, సీతా లక్ష్మణ హనుమంతులతో అయోధ్యకు పోతూ సూర్యోదయకాలానికి ఒక ప్రాంతములో దిగవలసి వచ్చింది.సూర్యుదయ సమయములో దిగుట వలన ఆ ప్రాంతానికి 'బ్రధ్న పురి ' అన్న నామకరణము చేసినాడు. అచట శివుని ధనుస్సగు పినాకము ఓలే వంపుసొంపులసోయగాలతో ప్రవహిచే నది ఆయనకు గోచరించుటవల్ల అక్కడ దిగవలసి వచ్చింది. ఎందుకంటే స్నాన సంధ్యానుష్ఠానములకు నదీ తీరము శ్రేష్ఠము . ఆ నదిని పినాకిని అంటారని ఆయన తెలుసు కొన్నాడు. అసలు పినాకి అంటే శివుడు. శివుని భార్య శివాని అయినట్లు పినాకి భార్య పినాకిని అవుతుంది. అంటే ఆ తీర్థము గంగాదేవియొక్క ఒక పాయ అనేకదా. ఇక అంతకంటే ప్రశస్థమైన స్థలము వేరొకటుందని తలచి రాములవారు అక్కడ దిగటము జరిగినది.
లంకాధిపతియైన రావణుడు సాక్షాత్తూ బ్రహ్మ మనుమడు. అందు చేత బ్రాహ్మణుడు. శ్రీ రాముడు రావణుడిని సంహరించిన తర్వాత ఒక బ్రాహ్మణుడిని చంపినందుకు బ్రహ్మ హత్యా పాతకం రాముడిని ఒక పిల్లి రూపంలో వెంటబడింది. దానినుంచి విముక్తుడు కావడానికి శ్రీ రాముడు దండకారణ్యంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాలనుకొన్నాడు. పినాకినీ నదీ తీరాన గల ఈ ప్రాంతాన్ని పవిత్రమైనదిగా భావించి ఇక్కడే శివలింగ ప్రతిష్ఠ చేయడానికి నిశ్చయించుకొన్నాడు. ముహూర్తం నిర్ణయించి, కాశీ నుంచి శివలింగాన్ని తెమ్మని హనుమంతుడిని పంపగా, హనుమంతుడు సకాలంలో తిరిగి రాలేక పోయాడు. దాంతో రాముడే పెన్నా నది లోని ఇసుక తో ఒక లింగాన్ని తయరు చేసి ప్రతిష్ఠించాడు. అది సైకత లింగం (=ఇసుక లింగం)గా పేరుగాంచింది. కాశీ నుంచి ఆలస్యంగా తిరిగి వచ్చిన హనుమంతుడు అది చూసి నొచ్చుకున్నాడు. దాంతో శ్రీ రాముడు అతడికి సంతోషం కలిగేటట్లు సైకత లింగానికి ఎదురుగా కొంత దూరంలో హనుమంతుడు కాశీ నుంచి తెచ్చిన లింగాన్ని కూడా ప్రతిష్ఠించాడు. అందుకే ఆక్షేత్రాల్ని రామలింగేశ్వర క్షేత్రమ్, హనుమ క్షేత్రం అని పిలుస్తారు. రాముడు మొదటి పూజ కాశీ లింగానికీ, తరువాతి పూజ సైకత లింగానికీ జరిగేటట్లు అనుగ్రహించాడు. ఈ ప్రతిష్ఠలు అయిన తర్వాత పిల్లి పెన్నా నది ఒడ్డు దాకా నడిచి అదృశ్యమైందట. పిల్లి పాదాల గుర్తులు అక్కడ ఉన్నాయంటారు. పిల్లి నదిలో దిగిన చోటును "పిల్లి గుండం" అంటారు. రామలింగేశ్వర స్వామికి ప్రక్కన రాజరాజేశ్వరి, శ్రీ చక్రం ప్రతిష్ఠించారు. ఆలయ ప్రాంగణంలో విఘ్నేశ్వరుడు, వీరభద్రుడు, సుబ్రహ్మణ్యస్వామి ఉన్నారు. చైత్ర మాసంలో పౌర్ణమి నుండి పది రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. కార్తీక సోమవారాల్లో భక్తులు విశేషంగా వస్తారు. ఈ ఆలయానికి, ప్రక్కన, వెనుక ఇద్దరు మునుల ఆలయాలున్నాయి. స్థలపురాణం ప్రకారం శ్రీ రాముడు శివ లింగాన్ని ప్రొద్దు పొడవక ముందే తయారు చేసి ప్రతిష్ఠించాడు. అందుకే ఈ ఊరిని ప్రొద్దుటూరు అంటారు. ఈ క్షేత్ర ప్రతిష్ఠతో రాముడు బ్రహ్మహత్యా పాతకం నుంచి విముక్తిని పొందాడు. అందుకే ఈ క్షేత్రాన్ని ముక్తి రామేశ్వరం అంటారు.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List