బేలూరు. ~ దైవదర్శనం

బేలూరు.


కర్నాటక, బెంగళూరులోని హసన్‌జిల్లాలో ఉన్న బేలూరు పట్టణం చాలా ప్రసిద్దిచెందింది. ఈ ప్రాంతానికి వేల సంఖ్యలో టూరిస్టులు నిత్యం వస్తూవుంటారు. బెంగళూరు ఏ చిన్న పనిమీద వెళ్ళిన వారైనా ఎన్ని సార్లు వెళ్ళినా బేలూరు మరొక్కసారి వెళ్ళి చూసివస్తారనడంలో అతిశయోక్తి లేదు.
చారిత్రకంగా బేలూరు హౌరుసాల వంశీయుల రాజ్యానికి రాజధాని. దీనితో పాటు బేలూరుకు 16 కి్ప్పమీల దూరంలో ఉన్న హలిబీడు కూడా ఇందులో భాగమే. బేలూరు ముఖ్యంగా చెన్నకేశవ దేవాలయానికి చాలా ప్రసిద్ది. దీనిని ఆ కాలంలో ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న విష్ణువర్ధన మహారాజు భార్య, శంతలాదేవి నిర్మించారు. అపðడు ఈ నగరాన్ని వేలాపురి అని కూడా వ్యవహరించేవారు. ఈ దేవాలయం అడుగు భాగాన చుట్టూ ఏనుగుల శిల్పాలు చెక్కడం ఒక విశేషం. దీని రాజగోపురం ఆ తరువాత కాలంలో విజయనగర రాజులు ద్రవిడ సంప్రదాయ రీతిలో నిర్మించారు. విజయనగర వంశీయుల కులదైవం కూడా చెన్నకేశవస్వామే.
అయినప్పటికీ ఈ దేవాలంలో హౌరుసాల శిల్పకళారీతులకి అద్దం పడుతుంది. అణువణువులోను వీరి శిల్పకల్పనా చాతుర్యం తొణికిసలాడుతుంది. ఈ దేవాలయాన్ని మున్ముందుగా విష్ణువర్ధన మహారాజు 1117లో తలకాడ్‌లో జరిగిన యుద్దంలో చోళుల్ని జయించిన విజయోత్సాహానికి గుర్తుగా ఈ ఆలయ నిర్మాణం సాగించాడు. అయితే దీని నిర్మాణం 103 సంవత్సరాల కాలవ్యవధి పట్టింది. విష్ణువర్థన మహారాజు మొదలు పెట్టిన ఈ నిర్మాణం ఆతని మనుమడు 2వ వీరబల్లల పూర్తిచేసాడు. ఈ దేవాలయంలో ఎక్కడా ఒక్క అంగుళం కూడా వదలకుండా శిల్పాన్ని చెక్కడం మనల్ని ఆశ్చర్యానికి లోనుచేస్తుంది. దేవాలంలోని స్థంభాలు అత్యంత మనోహరంగా తీర్చిదిద్దారు. ఇందులో అన్ని శిల్పాల్లోను దర్పణ సుందరి శిల్పం మరీ మనోహరంగా ఉండి, రాతి మీద ఇటువంటి చెక్కడాన్ని చూపించడం సంభ్రమాశ్చరాలకి లోనుచేస్తుంది. ఈ దేవాలయంలో ఈ శిల్పమే అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇక దేవాలయం నిండా ఏనుగులు, గుర్రాలు, సింహాల మొదలైన అనేక శిల్పాలు ఉంటాయి. వేటికవే పోటీపడుతున్నట్టు ఎంతో కనులపండుగ చేస్తాయి. ఈ అపార శిల్పకళానైపుణ్యం అంతా 'అమర శిల్పి జక్కన్న'కే దక్కుతుంది.
ఇక జక్కన విషయానికి వస్తే, ఈ దేవాలయ నిర్మాణం పూర్తి అయ్యి చెన్నకేశవస్వామి విగ్రహ ప్రతిష్ట జరుగుతున్న సమయంలో జక్కన కుమారుడు డంకనాచార్యుడు, ఈ విగ్రహం లోపభూయిష్టమైనదని, ఆ విగ్రహం ఉదరభాగంలో కప్ప ఉందనీ చెప్పాడు. దానికి ఖంగుతిన్న జక్కనాచార్యుడు దానిని నిరూపించమన్నాడు. ఒక ఉలితో బొమ్మని ఉదరభాగంలో కొట్టగా అందులోంచి కప్ప బైటికి దూకింది. ఈ విషయాన్ని కనిపెట్టలేకపోయానన్న విచారంతో జక్కన్న తన కుడిచేతిని నరికేసుకున్నాడు. ఆ తరువాత ఇదే ప్రదేశంలో మరో ఆలయ నిర్మాణాన్ని చేపట్టాడు. ఇప్పటికీ ప్రాంగణంలో ఉన్న పాత ఆలయాన్ని మనం దర్శించవచ్చు. దీనిని ఆకాలంలో కప్పిచిన్నగరాయ దేవాలయం అని పిలిచేవారు.
ఈ బేలూరు కూడా వేలాపురి అని, వేలూరు అని, బిలపూర్‌ అని, దక్షిణ కాశీ అనీ రకరకాలుగా పిలవబడింది. ఈ చెన్నకేశవ దేవాలయంలో మూల విరాట్టు 3.7 అడుగుల ఎత్తు ఉంటుంది. మదనికలనబడే, ద్వారపరిరక్షకురాళ్ళ విగ్రహాలు చాలా మనోజ్ఞంగా ఉంటాయి. అసలు అమరశిల్పి జక్కన శిల్పకళానైపుణ్యాన్ని గురించి చెప్పడం అవరి తరమూ కాదంటే అతిశయోక్తికాదు. వీటిని ప్రత్యక్షంగా దర్శించి పులకరించవలసినదే.
ఇక ఈ పరిసర ప్రాంతాల్లో చూడదగ్గ ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడికి సమీపంలోనే జైనుల ఆరాధ్యదైవం గోమఠేశ్వరాలయం కూడా ఉంది. అలాగే అనేక విజ్ఞాన, వినోద, విహార ప్రాంతాలు ఈ బేలూరు చుట్టూ అల్లుకుని ఉన్నాయి.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List