దేవలోకంలో మందాకిని, పాతాళలోకంలో భాగీరధి, భూలోకంలో గంగ ముల్లోకాలలో పుణ్యం అనుగ్రహించే
' త్రిపాదకా ' అని కీర్తించబడుతున్నది. ఈ పుణ్య జలాలలో స్నానం చేసినా, కొంచెం నీరు తలపై జల్లుకున్నా సకలపాపాలను తొలగిపోతాయని పురాణాలు తెలియచేస్తున్నవి.
తల్లీ.. గంగా దేవీ.. అని పఠిస్తూ భక్తిశ్రద్ధలతో గంగని పూజించాలి.
ప్రవహించే గంగని స్పర్శించి నమస్కారించడం;
గంగలో మునిగి స్నానం చేయడం;
గంగా నదిలో నిలబడి పూజించడం;
గంగలో నిలబడి పితృ దేవతలకు అర్ఘ్యం యివ్వడం;
నదిలోని మట్టిని తీసుకుని నమస్కారం చేయడం వంటి విధానాలను మన పూర్వీకులు ఏర్పరిచారు.
ఈ విధంగా చేయడం వలన సర్వ పాపాలు నశిస్తాయి. గంగనదిని దర్శించలేనివారు గంగదేవి నామాన్ని స్మరించడం.. చేతిలో ఉదక పాత్రను పెట్టుకుని మకరం మీద ఆశీనురాలైన గంగాదేవి పటానికి నమస్కరిస్తూ
భక్తిశ్రద్ధలతో పూజలు చేయవచ్చును.
No comments:
Post a Comment