అందమే అందం.. ప్రశాంత వాతావరణ, పచ్చని చెట్లు, కళ్ళు చల్లబడే వాతావరణం జనాన్ని ఆకట్టుకుంటుంది. ఎత్తైన కొండలు ఇవి ఇక్కడ కనిపించే దృశ్యాలు. ప్రకృతి అందాలు ఇంత అందంగా ఉన్నాయా అనిపిస్తుంది. ప్రకృతి రమణీయ దృశ్యాలు, భక్తి పారవశ్య ప్రదేశాలు, ఎటుచూసినా అభయారణ్యాలు… విజ్ఞానం, వినోదం… ఇవన్నీ వింటుంటే ఏదో దేశంలోనో, రాష్ట్రంలోనో అని అనుకున్నట్లతే మీరు పప్పులో కాలేసినట్లే..! ఎందుకంటే, ఇవన్నీ ఎక్కడో కాదు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా నల్లమల ప్రాంతంలోనే ఉన్నాయి. అందమైన సుందర దృశ్యాలనే కాదు…నలుపక్కలా పరుచుకొని ఉన్న ప్రకృతి రమణీయత యాత్రికులను అలౌకిక ఆనందంలో ముంచెత్తి వేస్తాయనటంలో ఆశ్చర్యం లేదు. అక్కడి అందాల గురించి తెలిసిన తరువాత కూడ అక్కడకు వెళ్ళకుండా మీరు ఉండలేరేమోనిపిస్తుంది. నల్లమలలో దర్శనీయ స్థలాలలో ముఖ్యంగా చెప్పుకోవా ల్సింది కడప జిల్లా, జ్యోతి క్షేత్రంలో కాశిరెడ్డి నాయన ఆలయం ఈ ఆలయం వెనుకాల పూరాతనమైన మరిన్ని ఆలయాలు కలవు అన్నపూర్ణదేవి, రాధ-కృష్ణలు, సీతా, రామ లో హనుమాన్, దత్తాత్రేయుడు, కాళికాదేవి, సుబ్రహ్మణ్యస్వామి, శివ పార్వతులు, నాగులు, వినాయకుడు, నవగ్రహాలు మండపం, జ్యోతి నరసింహ స్వామి, గరుడాద్రి, ఆవు సామాది ఇలా మరెన్నో పురాతనమైన ఆలయాలను చూడవచ్చును.
No comments:
Post a Comment