హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం, కుల్లూ జిల్లాలోని ఈశాన్య భుంతర్‌లోని బియాస్ మరియు పార్వతి నదుల మధ్య ఉన్న పార్వతీ లోయలో నెలకొని ఉంది. ఇది 1760 మీటర్ల ఎత్తులో ఉంది, కుల్లు నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఈ చిన్న పట్టణం తన వేడి నీటి బుగ్గలతో, యాత్రా కేంద్రాలతో, మనాలి మరియు కుల్లు సందర్శిస్తున్న పర్యాటకులను తన వైపుకు ఆకర్షించుకుంటోంది. ప్రయోగాత్మకమైన భూఅంతర్గత ఉష్ణశక్తి కర్మాగారం కూడా ఇక్కడ స్థాపించబడింది.
మణికరన్ హిందువులు మరియు సిక్కులకు తీర్థయాత్రా కేంద్రం. వరద తర్వాత మనువు మణికరన్‌లో మానవజీవితాన్ని పునఃసృష్టించాడని, ఆ విధంగా దీన్ని పవిత్ర స్థలంగా చేశాడని హిందువులు విశ్వసిస్తారు. ఇక్కడ పలు ఆలయాలు మరియు ఒక గురుద్వార కూడా ఉన్నాయి. ఇక్కడ రాముడు, కృష్ణుడు, మరియు విష్ణు ఆలయాలు ఉన్నాయి. ఈ ప్రాంతం వేడినీటి బుగ్గలకు మరియు సుందర ప్రకృతి దృశ్యానికి పేరుగాంచింది.
పురాణాల ప్రకారం, పరమశివుడు ఆయన దేవేరి పార్వతి ఈ లోయలో నడుస్తున్నప్పుడు, పార్వతి తన కర్ణాభరణాలలో ఒకదాన్ని ఇక్కడ జారవిడిచిందట. ఈ కర్ణాభరణాన్ని నాగదేవత అయిన శేషుడు స్వాధీనపర్చుకుని దాంతోపాటు భూమిలోకి మాయమైపోయాడట. పరమశివుడు విశ్వ నృత్యమైన తాండవ నృత్యం చేసినప్పుడు మాత్రమే శేషుడు ఈ ఆభరణాన్ని స్వాధీనపర్చి నీటలోకి విసిరివేశాడట. స్పష్టంగానే, 1905లో భూకంపం వచ్చేంతవరకు మణికరన్ జలాల్లో ఆభరణాలు విసిరివేయబడటం కొనసాగింది.
ఈ ప్రాంతం చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు పరమశివుడు, పార్వతీదేవి పర్వతాలతో, హరిత పత్రాలతో వ్యాపించి ఉన్న ప్రాంతానికి వచ్చారని మణికరన్ పురాణ గాధ చెబుతోంది. ఆ ప్రాంత సౌందర్యాన్ని చూసి మరులుగొన్న వీరు కాస్సేపు అక్కడే గడపాలని నిర్ణయించుకున్నారు. వాస్తవానికి వీరు ఇక్కడే పదకొండు వందల సంవత్సరాలు గడిపారని భక్తుల విశ్వాసం.
వారు ఇక్కడ గడిపిన కాలంలో, పార్వతీదేవి మణి నీటి ప్రవాహంలో జారిపోయిందట.
ఈ పురాణగాధ నుంచే మణికరన్ పేరు పుట్టింది. ఇక్కడి నీళ్లు ఇప్పటికీ వేడిగానే ఉంటూ పరమ శుభదాయకంగా భావిస్తుంటారు. ఈ ప్రాంతాన్ని సందర్శిస్తే తీర్థయాత్ర ముగించిన ఫలితం ఒనగూరుతుందని నమ్మిక. ఈ ప్రాంతాన్ని సందర్శించాక ఇక కాశీని కూడా సందర్శించనవసరం లేదని జనం విశ్వాసం. ఈ బుగ్గలోంచి ఉబికి వచ్చే నీటికి వ్యాధులను పోగొట్టే శక్తులు ఉన్నాయని భావిస్తుంటారు. ఇక్కడి నీరు ఎంత వేడిగా ఉంటుందంటే బియ్యం కూడా ఉడికిపోతాయి.
పరమశివుడికి చెందినది కావడంతో ఈ ఆలయాన్ని అత్యంత భయభక్తులతో చూస్తుంటారు. అయితే, 1905లో సంభవించిన భూకంపం ఆలయాన్ని స్వల్పంగా దెబ్బతీసింది మరియు ఆలయం కాస్త పక్కకు ఒరిగిపోయింది. కుల్లు లోయలోని దేవతలు ఒక ప్రత్యేక దినం ఈ ప్రాంతాన్ని సందర్శిస్తుంటారనే వాస్తవం నుంచి మణికరన్ ప్రాధాన్యతను ఎవరైనా అంచనా వేయవచ్చు.
No comments:
Post a Comment