సముద్రుడు రాముడికి నమస్కరించి " మీరు నా మీద సేతువుని నిర్మించుకోండి. అందుకని వానరులు తెచ్చి పడేసిన చెట్లు, బండలు మొదలైనవి అటూ ఇటూ చిమ్మకుండా నా తరంగముల చేత తేలేటట్టు చేస్తాను. నాలొ ఉన్న ఏ క్రూర మృగము వల్ల వారధిని దాటేటప్పుడు వానరములకి ఎటువంటి భీతి లేకుండా నేను కాపాడతాను. సేతు నిర్మాణం వెంటనే ప్రారంభించండి" అన్నాడు. అప్పుడు అక్కడున్న వానరులందరూ సంతోషపడిపోయి పర్వతాలు, కొండలు ఎక్కి పెద్ద పెద్ద శిలలు మోసుకొచ్చి వాటిపైన 'శ్రీ రామ్' అని రాసి సముద్రంలో పడేస్తున్నారు. ఆ సమయంలో ఎవరినోట విన్నా ' సీతారామ ప్రభువుకి జై ' అంటూ, ఉత్సాహంగా రకరకాల చెట్లని తీసుకొచ్చి సముద్రంలో పడేశారు. మొత్తం అయిదు రోజులలో 100 యోజనముల సేతువు నిర్మాణం అయిపోయింది. చివరికి అన్ని కోట్ల వానర సైన్యం లంకని చేరుకుంది.
Home »
» కోట్ల వానర సైన్యం లంకని ఎలా చేరింది.?
కోట్ల వానర సైన్యం లంకని ఎలా చేరింది.?
RB.VENKATA REDDY
B.KOTHAPALLI
No comments:
Post a Comment