శివలింగం పైభాగంలో రెండు పావురాలు కలిగిన కపోతేశ్వరాలయం. ~ దైవదర్శనం

శివలింగం పైభాగంలో రెండు పావురాలు కలిగిన కపోతేశ్వరాలయం.

గుంటూరు జిల్లా నకరికల్లు మండలంలో ఉంది చేజెర్ల గ్రామం. నరసరావుపేటకు సుమారు 30 కి.మీ. దూరంలో ఉన్న ఈ గ్రామంలో పురాతనమైన కపోతేశ్వర స్వామి దేవాలయం ఉంది. పూర్వం చేరుంజర్ల, చేంజర్లలుగా పిలువబడిన ఈ చారిత్రక గ్రామానికి దాదాపు 2 శతాబ్దాల చరిత్ర ఉన్నది. ఆనంద గోత్రిజ రాజు అత్తివర్మ తండ్రి క్రీశ 3వ శతాబ్దంలో వేయించిన శాసనం మొదలు పలు రాజవంశాలకు చెందిన చక్రవర్తుల శాసనాలు ఇక్కడ లభ్యమయ్యాయి.
మహారాష్ట్రలోని తేర్‌, ఆంధ్ర ప్రదేశ్‌లోని చేజెర్ల - రెండు స్థలాలలోను ఒకప్పటి బౌద్ధ చైత్య గృహాలు తరువాత హైందవ శైవాలయాలుగా మార్చబడ్డవి. చేజెర్లలోని శైవాలయాన్ని కపోతేశ్వరాలయం అంటారు. ఇక్కడి గర్భగుడిలోని లింగం శిబి చక్రవర్తి శరీరంనుండి ఉద్భవించిందని స్థల పురాణ గాధ. శిబికి, కపోతానికి (పావురానికి) ఉన్న సంబంధం గురించి ఒక హిందూ గాధ, ఒక బౌద్ధ గాధ ఉన్నాయి.
మహాభారతంలోని కథ - మాంధాత కుమా రుడైన శిబి చక్రవర్తికి మేఘదాంబరుడు, జీ మూత వాహనుడు అనే ఇద్దరు తమ్ముళ్ళు ఉండేవారు. మేఘదాంబరుడు అన్న అనుమ తితో 1500 మంది పరివారం వెంటబెట్టుకొ ని కాశ్మీర దేశం విడచి తీర్ధయాత్రలకు బయ లుదేరాడు. అతడు ఒక కొండపై కొందరు యోగులతో కలసి తపో దీక్షనాచరించి కాలం చేశాడు. కొండపై అతని శరీరం దహనం చే యగా ఆ భస్మం ఒక లింగరూపం ధరించిం ది. అన్న తిరిగి రానందున అతనిని వెదుకు తూ జీమూతవాహనుడు అనుచరులను వెంటబెట్టుకొని ఆ కొండవద్దకు వచ్చాడు.
అన్నకు జరిగిన విషయం విని ఆకొండపైనే తపమాచరించి తానూ మరణించాడు. తమ్ము ళ్ళను వెతుక్కుంటూ శిబి చక్రవర్తి స్వయంగా అక్కడికి వచ్చి రెండు లింగాలను చూశాడు. అక్కడ నూరు యజ్ఞాలు చేయ సంకల్పించా డు. నూరవ యాగం చేస్తుండగా దేవతలు అతనిని పరీక్షింపదలచారు. శివుడు ఒక వేట గాని వలెను, బ్రహ్మ అతని బాణం లాగాను, విష్ణువు ఒక కపోతం లాగాను అక్కడికి వచ్చారు. వేట గానితో తరమబడిన పావురం శిబి చక్రవర్తి శరణు జొచ్చింది. శిబి ఆ పక్షికి అభయమిచ్చాడు. అక్కడికి వేటగాడు వచ్చి ఆ పావురాన్ని తనకు ఇవ్వకుంటే తాను, తన కుటుంబం ఆకలితో అలమటిస్తారని చెప్పాడు. శిబి ఇరకాటంలో పడ్డాడు.
చివరకు పావురం ఎత్తు మాంసం ఇస్తానని వేటగానిని ఒప్పించి, త్రాసులో పావురాన్ని ఒక వైపు ఉంచి, తన శరీరంలో కొంత మాంసాన్ని కోసి రెండవవైపు ఉంచాడు. అయినా అవి సరి తూగలేదు. చివరకు తన తల నరికి ఆ త్రాసులో పెట్టించాడు. అతని త్యాగ శీలతకు మెచ్చి దేవతలు అతనిని పునరుజ్జీవితుడిని చేసి వరం కోరుకోమన్నారు. తనకు, తన పరివారానికి కైలాస ప్రాప్తిని కోరుకొన్నాడు. పరివార సమేతంగా తమందరి శరీరాలు లింగాలుగా కావాలని కోరాడు. అలా తల లేని శిబి మొండెమే కపోతేశ్వర లింగమైందని స్థల పురాణం.
బౌద్ధ జాతక కథ - శిబిజాతకం కథ ప్రకారం శిబి చక్రవర్తి తన కన్నులను మారువేషంలో వచ్చిన ఇంద్రునికి దానం చేశాడు. మరో కథ అవసన సతకం కథ ఈ శిబిజాతక కథనూ, మహాభారత కథనూ అనుసంధానిస్తుంది. బౌద్ధ జాతక శిల్పాలలో శిబి కథ తరచు కనిపిస్తుంటుంది. అమరావతిలోను, నాగార్జున కొండ ఈ జాతక కధకు సంబంధించిన శిల్పాలున్నాయి.
గ్రామానికి వాయువ్య దిశగా ఉన్న ఈ కపోతేశ్వరాలయం తూర్పు ముఖంగా ఉంటుంది. తూర్పున ఉన్న ఒకే ఒకద్వారం పైన ఒక చిన్న గోపురం ఉంది. ఈ గోపురం అలంకరణలు లేకుండా సాదాగా ఉంది. స్తంభాలు, ద్వార బంధాలు కంచిలోని పల్లవ దేవాలయాలను పోలి చదరపు శీర్షభాగాలు కలిగి ఉన్నాయి. ఆలయం వెలుపల దక్షిణం వైపు ఒక పెద్ద చెట్టు ఉండేది. దాని కాండం వ్యాసం 56 అడుగులు ఉండేది. లోపల తొర్రగా ఉండేది. ఈ చెట్టు 1917లో కూలిపోయింది. దేవాలయంలో నగర, వెసర, ద్రవిడ నిర్మాణ రీతులు మిళితమై ఉన్నాయి.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List