.
కర్ణాటక రాష్ట్రంలోని 'మైసూర్' నుండి 600 కి.మీ. దూరంలో గల క్షేత్రం 'తలకాడు'. ఈ ఆలయం పేరు 'పాతాళేశ్వరాలయం'. క్రీ.శ. 1004 వరకు పాలించిన గంగవంశ రాజుల కాలం నుండి ఈ ఆలయ ఉంది. కాల ప్రవాహంలో ఇసుకతో కప్పబడింది. పురావస్తు శాఖవారి దయ వలన బయటపడింది. నేల మట్టంకన్నా చాలా లోతుగా ఉన్న ఆలయంలోని శివలింగం ఉదయం ఎరుపు, మధ్యాహ్నం నలుపు, సాయంకాలానికి తెలుపు రంగులోకి మారుతూ కనిపిస్తుంది.
తలకాడు పట్టణం ఒకప్పుడు ఎంతో ఆకర్షణీయంగా ఉండేది. సుమారు 30 కి పైగా దేవాలయాలుండేవి. అయితే ఈ పట్టణం 16వ శతాబ్దంలో ఇసుక తిన్నెలతో కప్పబడింది. చరిత్ర ఆధారాలమేరకు ఒడయార్ల పాలనలో ఇక్కడ సహజ నాశనం జరిగింది. కాని స్ధానిక కధనాలు, ఊహాగానాలు మరో రకంగా కూడా ఉంటాయి. ఈ ప్రాంత దేవత అయిన అలమేలు అమ్మవారి శాపం కారణంగా తలకాడు ఇసుకచే కప్పబడిందని కూడా చెపుతారు.
తలకాడు పట్టణంలో ఒకప్పుడు అయిదు ప్రఖ్యాత శివాలయాలుండేవి. ప్రారంభంలో గంగ వంశస్ధులు, ఆ తర్వాత చోళులు ఈ ప్రాంతాన్ని పాలించారు. చోళులను హోయసల రాజు విష్ణు వర్ధనుడు తలకాడునుండి తరిమి వేశాడు. తర్వాత ఈ ప్రాంతాన్ని విజయనగర రాజులు, ఆ తర్వాత వారినుండి మైసూరు ఒడయార్లు పాలించారు.
అలమేలు అమ్మవారి నగలపై కన్ను వేసిన మైసూరు రాజు తలకాడుపై తన సైన్యంతో దాడిచేస్తాడు. ఆమె తన నగను కావేరి నదిలో పడవేసి అక్కడే ముణిగిపోయిందని, చానిపోయే ముందు తలకాడు ఇసుక దిబ్బగా మారిపోవాలని శపించిందని మాలంగి ఒక సరస్సుగాను, మైసూరు రాజులు వారసులు లేకుండా పోతారని శపించిందని స్ధానిక కధనాలు నడుస్తాయి. 16వ శతాబ్దంలో ఈ నగరం ఇసుక మేటలు వేసింది.
ఈ పట్టణం అయిదు దేవాలయాలకు ప్రసిద్ధి. అవి వైద్యనాధేశ్వర, పాతాళేశ్వర, మరుళేశ్వర, అరకేశ్వర మరియు మల్లిఖార్జుల దేవాలయాలు. ప్రతి సంవత్సరం కొద్ది కొద్దిగా ఇవి ఇసుకలోకి కూరుకుపోతున్నాయి. వీటిని రక్షించటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రాంతంలోనే విష్ణు భగవానుడి ఆలయం కీర్తినాధేశ్వర పేరుతో ఉంది. ఇది అయిదు శివాలయాలలో ఒకటి దీనిని ఇపుడు తిరిగి నిర్మిస్తున్నారు.
కావేరి నది పట్టణం గుండా ప్రవహిస్తూ ఒక చక్కటి మలుపు తీసుకుంటుంది. సీనరీలు ఎంతో రమణీయంగా ఉంటాయి. 12 సంవత్సరాలకు ఒక సారి వచ్చే పంచలింగ దర్శనం ఇక్కడ ప్రసిద్ధి. చివరి దర్శనం 2009 లో జరిగింది. ఈ పంచలింగ దర్శనం కార్తీక పౌర్ణమి రోజున రెండు నక్షత్రాలు ఖుహ యోగ మరియు విశాఖ కలసినపుడు ఏర్పడుతుంది.
తలకాడు చుట్టుపట్ల గల సోమనాధపూర్, శివసముద్ర, మైసూర్, శ్రీ రంగపట్న, రంగని తిట్టు మరియు బండిపూర్ లు ఉన్నాయి.
తలకాడు చుట్టుపట్ల గల సోమనాధపూర్, శివసముద్ర, మైసూర్, శ్రీ రంగపట్న, రంగని తిట్టు మరియు బండిపూర్ లు ఉన్నాయి.
తలకాడు సందర్శనకు నవంబరన్ మరియు మార్చి అనుకూలంగా ఉంటుంది. అప్పుడు ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. తలకాడు మైసూర్ జిల్లాలో మైసూర్ కు 43 కి.మీ. దూరం మరియు బెంగుళూరు నుండి 120 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. ఈ రెండు ప్రధాన నగరాలు, పర్యాటకులకు ఎన్నో రకాల రవాణా సౌకర్యాలు కలిగిస్తాయి.
No comments:
Post a Comment