విజయనగర సామ్రాజ్య ఆరంభ దశలో విద్యారణ్యులు నారాయణ భట్టు అనే పండితుడిని పినాకిని నది ప్రాంతంలో సంచరించమని ఆదేశించారు. అప్పటికే భాస్కర క్షేత్రంగా విరాజిల్లుతున్న ఈ ప్రాంతంలో తాళఫలవృక్షాలు ప్రాంతంలో అధికంగా ఉండడంతో తాటి పల్లెగా నారయనభట్టులు నామకరణం చేశారని చరిత్ర చెబుతోంది. అది తాడిపత్రిగా రూపాంతరం చెందింది. రాయల కాలానికి ముందు జైన సామంత రాజు ఉదయాదిత్యుడు 1199 లో ఇక్కడ పాలన చేసినట్లు దేవాలయ శిలా శాసనంలో ఉంది.
కాశీ క్షేత్రాన్ని తలపించే విధంగా 1460 – 1475 మధ్య కాలంలో ఈ దేవాలయాన్ని తాడిపత్రి పాలకుడు తిమ్మ నాయుని కుమారుడు రామలింగనాయకుడు నిర్మించాడు. ఖజురహో తరహాలో అద్భుత శిల్ప సంపదతో తీర్చిదిద్దారు. శివలింగం చుట్టూ ఎప్పుడు నీరు ఉబికి వస్తుండటంతో బుగ్గ రామలింగేశ్వరస్వామిగా ప్రసిద్ధికెక్కాడు. అభిముఖంగా పెన్నానది,, వెనుక శ్మశానం ఉండడంతో రెండో కాశి క్షేత్రంగా వాసికెక్కింది. కారణంతరాల వాళ్ళ ఆలయ గోపురాలు అసంపూర్తిగా వదిలేసారు. ఇప్పటికి అత్యంత ఎత్తులో ఉన్న శివలింగం చుట్టూ నీరు ఉబికి రావడం విస్మయం గొలిపే అంశం.
రామలింగేశ్వరుని విగ్రహం నీటి బుగ్గలలో దొరికినందున ఈ స్వామి బుగ్గరామేశ్వరుడై నాడు. అమ్మ వారు పార్వతీదేవి. రామలింగేశ్వర ఆలయాన్నీ చూస్తే ఈ స్థలం దేవాలయాల భూమియా! అన్న ఆశ్చర్య ఆనందాలు మదిలో నింపుకుని వస్తారు. ఎంతటి అసాధారణ శిల్పగరిమ! దేవాలయాలలోని అద్భుతమైన శిల్పసంపద, గట్టిగా మాట్లాడితే హోయసల దేవాలయాలయిన హళీబీడు, బేలూరు శిల్పాలని మురిపిస్తాయని చెప్పవచ్చును.
ఈ ఆలయ ప్రకారాలు సువి శాలమైనవి. ఆనాటి రాజుల కళాభిరుచీ, ఆ అమర శిల్పుల నిర్మాణ వైచిత్రీ సుస్ప ష్టంగా ఈ ఆలయాలలో దర్శించి పరవశిస్తాము. ఈ కట్ట డాలు పునాదుల నుంచే ఉత్తమ చిత్ర నిర్మాణాలతో అసామాన్యాలుగా గోచరిస్తాయి. రామలింగని ఆలయం పినాకినీ తీరాన ఉన్నది. ఆలయానికి గల ఉత్తర, దక్షిణ, పశ్చిమ గోపు రాలు శిథిలాలైనాయి. రామలింగేశ్వర లింగం భూమిలో నుంచీ చొచ్చుకొని వచ్చినట్లుంటుంది. రామలింగని ఎదురుగా నంది ఉన్నది. నందికి చేరువలో ఉన్న గోపురం నుంచి చూస్తే నిర్మలంగా ప్రవహించే పినాకిని కన్నుల విందుగా కనిపిస్తుంది. వర్షాకాలంలో పై నుంచీ కురిసిన గంగ గలగలా పారుతూ పెన్నలో కలుస్తుంది. మితిమీరిన వర్షా లొస్తే పినాకిని గంగానాథుని కలవటానికి గుడిలోకి ప్రవ హించి వస్తుంది. ఈ ఆలయాలు శిథిలావస్థలో ఉన్నా కళావై భవం మాత్రం చెక్కు చెదర్లేదు. విజయనగర చక్రవర్తుల శిల్ప కళా సంపదకు తాడిపత్రి ఆలయాలు నిలువెత్తు నిదర్శనాలు, గీటురాళ్లూను.
No comments:
Post a Comment