నాడీ జ్యోస్యం తెలియజేసే వైదీశ్వరన్ కోయిల్. ~ దైవదర్శనం

నాడీ జ్యోస్యం తెలియజేసే వైదీశ్వరన్ కోయిల్.


తమిళనాడు లోని తంజావూర్ జిల్లాలో ఉన్న ఒక గ్రామం. చిదంబరానికి, కుంభకోణానికి మధ్యలో ఉన్న వైదీశ్వరన్ కోయిల్, శీర్కాళ్ గొప్ప క్షేత్రాలు. వైదీశ్వరన్ కోయిల్, శీర్కాలి రెందు, కేవలం 8 కి.మీ. దూరం ఉన్న ప్రక్క ప్రక్క ఊళ్ళు. వైదీశ్వరన్ కోయిల్ ఉత్తర తమిళనాడు వారికి చాలా ముఖ్యమైన పవిత్రస్థలం. ఒకానొక ముని తనకు గొప్ప జబ్బు చేయగా పరమేశ్వరుని గూర్చి ఎంతో భక్తితో తపస్సు చేయగా శంకరుడు ఒక వైద్యుని రూపంలో ప్రత్యక్షమై, అతని జబ్బు నయం చేశాడమొ స్థల పురాణం. ఈ ప్రాంతం వారు ఇంట్లో ఎవరికీ ఏ జబ్బు చేసినా, ఈ వైదీశ్వరునికి మొక్కుకుంటారు. ఊరు మాత్రం అతిచిన్న పల్లెటూరు. అయినా దేవాలయం మాత్రం ఎన్నడూ భక్తులతో నిండి ఉంటుంది. ఈ మధ్య ఈ ఊరికి చెందిన 'నాడీగ్రంథ' జ్యోతిష్కులు అన్నిచోట్ల వెలియడంతో ఈ ఊరికి జ్యోతిషం చెప్పించుకుంటానికి వచ్చేవారు ఎక్కువ అయ్యారు. వైదీశ్వరన్ కోయిల్ కు శీర్కాలి మధ్యదూరం కేవలం ఐదు మైళ్ళు. తమిళులందరికి శిర్కాలి చాలా పవిత్రమైన యాత్రాస్థలం. తమిళులకు ఈ దేవాలయం సంస్కృతిక కేంద్రం లాంటిది. ఈ ఊరిని గూర్చి వారందరూ ఎంతో పవిత్రంగా భావిస్తారు. గొప్ప శివభక్తాచార్యుడు 'జ్ఞాన సంబంధర్' ఈ శిర్కాలిలోనే జన్మించారు. ఈ సంబందర్ పసికూనగా ఉన్నప్పుడు పార్వతీదేవి స్వయంగా తన స్తన్యమిచ్చి ఆ పిల్లవాని ఆకలి తీర్చింది. ఆ తరువాత నుంచి ఆ పిల్లవాడు అమిత జ్ఞానవంతుదై చిన్నతనం నుండే గొప్ప శివభక్తుడై శివతత్వాన్ని అందరకూ ప్రభోదిస్తూ కేవలం పదహారు సంత్సరాలు మాత్రమే జీవించి, తనువూ చాలించారు. అయితే, ఆ పదహారు సంవత్సరాల లోపునే అయన అనేక వేల కీర్తనలు రచించారు. అందులో దాదాపు నాలుగు వందల కృతులు.
మనయొక్క భూత భవిష్యత్ వర్తమానాలను తెలియజేసే తాళపత్ర గ్రంథాలు భారతదేశంలో కొన్ని కుటుంబాల వద్ద ఉన్నాయి. ఆ కుటుంబాలు వాటిని వంశ పరంపరగా, చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాయి. "శివపార్వతుల" సంభాషణగా, సిద్ధులందించిన ఈ విజ్ఞాన నిధిని "నాడీ జ్యోతిష్యం" అంటారు. దక్షిణ భారతదేశంలో తమిళనాడులోని 'చిదంబరం' పట్టణానికి దగ్గర గల 'వైదీశ్వరన్ కోయిల్' అనే గ్రామంలో కొన్ని కుటుంబాల వద్ద ఈ తాళపత్రాలు ఉన్నాయి. ఈ తాళపత్రాలనే నాడీ పత్రాలు అంటారు. ఇప్పుడు మనకు లభిస్తున్న తాళపత్రాలు కొన్ని మాత్రమే. కనుక అందరి వృత్తాంతాలు ఈ నాడీ పత్రాలలో ఉండవు. కొన్ని తాళపత్ర గ్రంథాలను ఆనాటి తంజావూరు మహారాజు 'రెండవ షర్ఫోజి'వారు 'సరస్వతీ మహల్' గ్రంథాలయంలో ఉంచగా, వాటిని బ్రిటిషు వారు స్వాధీన పరుచుకొన్నట్టు తెలుస్తున్నది. బ్రిటిషు వారి నుంచి వాటిని సంపాదించి కొందరు విదేశీయులు వీటితో వ్యాపారం చేస్తున్నారు. ఈ నాడీ 'జోస్య' విధానం మొదట వ్యక్తి తన చేతి బొటన వేలిముద్ర ఇవ్వాలి. దీని ఆధారంగా నిపుణులు తాళపత్ర గ్రంథాలను పరిశీలించి ఆ వ్యక్తి వివరాలను తెలియజేస్తారు, అవి సరిపోలితే తదుపరి పరిశీలన ప్రారంభిస్తారు. ఆ లభించిన వారికి తండ్రి పేరు, తల్లి పేరుతో సహా పుత్రుల, భార్య పేరు తెలియజేయటం కూడా అబ్బురపరచే విషయం. ఇందులో కూడా నేడు కొందరు నకిలీ నాడిజోస్యులు ప్రవేశించి శాస్త్రాన్ని వ్యాపారపరంగా వాడుకుంటున్నారు.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List