విజయనగరం పట్టణానికి ఈశాన్యంగా 12 కి.మీ. దూరంలో చంపావతీ నదీ సమీపంలో శ్రీరామతీర్థం వుంది. శ్రీ రామచంద్రుడు ... శివుడిని ఎంతగా ఆరాధిస్తాడో, శివుడు అంతగా ఆయనను ప్రేమిస్తాడు. పురాణాలలో సైతం ఈ విషయం స్పష్టంగా కనిపిస్తూ వుంటుంది. రావణాసురుడిని సంహరించడానికి అవసరమైన శక్తి కోసం శివుడి గురించి తపస్సు చేసిన రాముడు, రావణ వధ అనంతరం ఆ పాపం అంటకుండా వుండటం కోసం వివిధ ప్రదేశాల్లో కోటి శివలింగాలను ప్రతిష్ఠించాడు.
(Ramatheertham Sri Rama Temple In Vizianagaram)
(Ramatheertham Sri Rama Temple In Vizianagaram)
ఆ క్రమంలో రాముడు ఈ ప్రదేశంలో నెలకొని ఉన్న సదాశివుడిని దర్శించాడు. ఈ ప్రదేశంలో ఓ కోనేరును తవ్వించి ఆ నీటితో ఇక్కడి శివుడికి అభిషేకం చేశాడు. రాముడు ఇక్కడ కోనేరును తవ్వించిన కారణంగానే ఈ ప్రాంతానికి 'రామతీర్థం' అనే పేరు వచ్చినట్టు స్థల పురాణం చెబుతోంది. రాముడు దర్శించిన నాటినుంచి ఇక్కడి స్వామివారు 'మోక్ష రామలింగేశ్వరుడు' గా పూజలు అందుకుంటున్నాడు.
'రామతీర్థం' గా చెప్పబడుతోన్న ఇక్కడి కోనేరులోని మట్టిని నుదుటిపై పెట్టుకుంటే విభూతి రాసుకున్నట్టుగానే ఉండటం గురించి విశేషంగా చెప్పుకుంటారు. ప్రకాశం జిల్లా ఒంగోలు తాలూకాలో వెలసిన ఈ క్షేత్రం నేటికీ భక్తులను తరింపజేస్తూనే వుంది. శివాలయంలో పార్వతీ అమ్మవారు దక్షనాభిముఖంగా కొలువుదీరగా, ఆ పక్కనే గంగాదేవి కూడా దర్శనమిస్తుంది.
ఈ అమ్మవారి అనుగ్రహాన్ని ఆశిస్తూ భక్తులు ప్రతి యేటా చైత్ర మాసంలో జాతర జరుపుతారు. అయితే ఈ జాతరలో జంతుబలులు కనిపించవు. శివయ్యకి గంగమ్మ అలా మాట ఇవ్వడమే అందుకు కారణమని చెబుతారు. ఇక మోక్ష రామలింగేశ్వరుడికి కార్తీక మాసంలో విశేష పూజలు జరుగుతాయి. మహా శివరాత్రి రోజున శివపార్వతులకు కల్యాణోత్సవం కన్నుల పండువగా జరుగుతుంది.
ఇక్కడ వెలిసిన శ్రీసీతారామ స్వామి తనను దర్శించిన భక్తుల కోర్కెలను తీర్చుతాడని నమ్మకం. రెండో భద్రాద్రిగా పేరొందిన ఈ రామతీర్థం రామస్వామి దేవస్థానం నిత్యం భక్తులు, పర్యాటకుల సందడితో కళకళలాడుతూ వుంటుంది.
ప్రధానంగా భీష్మ ఏకాదశినాడు స్వామివారికి తిరుకల్యాణ మహోత్సవం జరుగుతుంది. దీన్నే దేవుడి పెళ్లి అని కూడా అంటారు. ఈ దేవుడి పెళ్లి అనంతరం ఈ ప్రాంతవాసులు వివాహాలు జరిపేందుకు ముహూర్తాలు పెట్టుకుంటారు.
అలాగే జిల్లాలనుంచే గాక పక్కన వున్న ఒడిశా, మధ్యప్రదేశ్, రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతారు. శ్రీరామనవమి ఉత్సవాల సమయంలో పండుగ వాతావరణం నెల కొంటుంది.
ఈ దేవ స్థానానికి ఏటా కోటిరూపాయల ఆదాయం లభిస్తుంది. ప్రస్తుతం ఈ దేవస్థానానికి దేవా దాయశాఖ అధికారులు అసిస్టెంట్ కమిషనర్ హోదాకలిగిన ఉద్యోగిని కార్యనిర్వహణాధికారిగా నియ మించారు.
రామతీర్థం దేవస్థానంను 16వ శతాబ్దంలో అప్పటి విజయనగర రాజవంశీయుడు పూసపాటి సీతా రామచంద్రగజపతి నిర్మించారని చరిత్ర చెబుతోంది. పూర్తిగా అటవీ ప్రాంతంగా వున్న ఈ స్థలంలో నీటి అడుగున సీతారాముల విలావిగ్రహాలు లభించడంతో ఈ ప్రాంతానికి రామతీర్థం అని పేరు వచ్చినట్లు చెబుతుంటారు.
రామతీర్ధంలో భూమికి సమాంతరంగా తెల్లటి రాతి పరుపు వుంటుంది దీన్ని శ్వేతాచలం అని పిలుస్తారు. ఈ రాతి పరుపుపైన ఎలాంటి పునాదులు లేకుండా రాతిపలకల పేర్పుతో ఈ దేవాలయాన్ని నిర్మించారు. శతాబ్దాలు దాటినా ఎంతమాత్రం చెక్కు చెదరలేదు. అలాగే శ్వేతా చలపతి పక్కనే 500 అడుగుల ఎత్తులో పెద్ద నల్లటి రాతికొండ వుంది. దీన్ని నీలాచలం అనిపిలుస్తారు.
రాముని గుడిలో శివరాత్రి పూజలు...
ప్రధానంగా భక్తులు శివరాత్రినాడు శివుని దర్శనానికి వెళతారు. కానీ ఇక్కడ మాత్రం శివరాత్రికి సీతారాములను దర్శించుకునేందుకు భక్తులు అధికంగా తరలివస్తారు. ఇందుకు కారణంగా పెద్ద పురాణ గాథే వుంది. శివభక్తుడైన రావణాసురుని రాముడు చంపిన కారణంగా ఆ పాప నివృత్తికి శ్రీరాముడు శివరాత్రినాడు ఉపవాసంతో శివుడికి పూజలు చేసాడని, అందువల్లే శివరాత్రినాడు ఉప వాసంతో ఉన్న శ్రీరాముని దర్శించుకుంటే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం.
బోడి కొండపై కోదండరాముని ఆలయం వెనుక వున్న నీటి మడుగులో ఏడాది పొడుగున నీటి నిల్వలు వుండడం విశేషంగా చెప్పవచ్చు. మండువేసవిలో సైతం అదే స్థాయిలో నీరు వుంటుంది.
No comments:
Post a Comment