భగవంతుడిని ఏమి కోరుకోవాలి. ~ దైవదర్శనం

భగవంతుడిని ఏమి కోరుకోవాలి.

మనం దేవాలయాలకు ఎందుకు వెళ్తాం, భగవంతుడిని దర్శించుకునేందుకు, అలాగే మన మనసులోని కోర్కెలను తీర్చమని ఆయనను కోరుకునేందుకు. మరి ఆ కోరికలు ఎలా ఉండాలి, నాకు వ్యాపారంలో మంచి లాభాలు రావాలని, డబ్బు బాగా సంపాదించాలని, నేను MLA, MP, వీలైతే ముఖ్యమంత్రిని కావాలని, మావాడు ఫస్ట్ క్లాస్ లో పాసై మంచి ఆదాయాన్నిచ్చే ఉద్యోగం రావాలని, మిమ్మల్ని నెత్తిన పెట్టుకొని పూజించే కోడలు రావాలని ఇలా ఎన్నేన్నో కోరికలు కోరుకోవడానికి. అవునా ఇలాంటి కోరికలనేనా మనంకోవలసింది.*_

        _**భగవంతుడిని మనం ఫలానా కావాలి అని ఎప్పుడూ కోరుకోకూడదు. ముఖ్యంగా డబ్బు కావాలి అని అస్సలు కోరుకోకూడదు. ఎందుకంటే కావలసినంత డబ్బు ఉండీ కూడా అది మన దగ్గర నిలవక పోతే? లేదా, డబ్బు ఒక పరిమితిని మించి ఉండీ, మనకు దానిని అనుభవించే ఆరోగ్యం లేకపోతే? లేదా, ఆ డబ్బు వలన మనకు శతృ బాధలు కలిగితే? లేదా పిల్లలు డబ్బు ఎక్కువై, చెడుమార్గాలు పడితే? ఆ డబ్బు కారణంగా అన్నదమ్ములతోనూ, ఇతర బంధువులతోనూ గొడవలు వస్తే? గృహంలో అశాంతి పెరిగితే? ఎంత డబ్బు , అధికారం ఉన్నప్పటికీ, ఒక్కోసారి పట్టెడన్నం దొరకక బాధపడతాం. కంటినిండా కునుకు లేక బాధపడతాం. మానసికంగా మనశ్శాంతిని, ప్రశాంతతను కూడా కోల్పోతాం.*_

        _**అందుకే భగవంతుడిని ఎప్పుడూ ప్రశాంతమైన, ఆరోగ్యవంతమైన, సుఖమయమైన, సౌకర్యవంతమైన, సంతృప్తి కలిగిన జీవితాన్ని కోరుకోవాలి. మన కడుపుకు మనం తినడమే కాకుండా, పదిమంది ఆకలి తీర్చగలగడం, వారి అవసరాలను తీర్చగలిగే సహాయం చేయగల బుధ్ధిని, మనసుని కల్పించమని వేడుకోవాలి.*_

       _**రోగాలతో మంచానబడి భార్య, కొడుకు, కోడలు అసహ్యించుకోని అనాయాస మరణం కోరుకోవాలి. బ్రతికినన్నాళ్ళూ ఒకరి దగ్గర చేయి చాచకుండా బ్రతికే వరాన్ని కోరుకోవాలి. కష్టాల్లో మనలను ఓదార్చే పదిమంది బంధువులను, స్నేహితులను కోరుకోవాలి. అలాగే మన సంతోషంలో పాలుపంచుకుని, మన అభివృధ్ధికి ఆనందించే ఇరుగుపొరుగును, బంధువర్గాన్నీ కోరుకోవాలి. ఎప్పుడూ ధర్మం తప్పకుండా నడవగలిగే ఆత్మస్థైర్యాన్ని ఇవ్వమని కోరుకోవాలి.*_

       _**ఇలా భగవంతుడిని నీతివంతమైన, ధర్మపదమైన, న్యాయపరమైన కోరికలను కోరుకోవాలి. అంతేతప్ప గొంతెమ్మ కోరికలు కోరుకోకూడదు. అలాంటి వారిని భగవంతుడు ఎప్పుడూ ఆశీర్వదించడు. ధర్మ మార్గాన నడిచేవారికి భగవంతుడు ఎప్పుడూ ఆశీస్సులు అందిస్తూ తోడుగా ఉంటాడు.*_

     _**అలా ఆ భగవంతుని దివ్య శుభాశీస్సులు మనందరికీ అంది అందరమూ ఆనందంగా, ఆరోగ్యంగా, మానసిక ప్రశాంతతో, దీర్ఘాయువుతో జీవించాలని మనసా వాచా కర్మణా కోరుకుంటూ....*_
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List