**ప్రతి వ్యక్తి తన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒకరకంగా ఎవరో ఒకరి ద్వారా జీవిసత్యాలను, జీవిత పాఠాలను నేర్చుకోవలసిందే. అయితే ఈ పాఠాలను ఏదైనా పుస్తకం చదవడం వల్ల గానీ, ఎవరైనా చెప్పేది విన్నప్పుడు గానీ, ఏదైనా దృశ్యాలను చూసినప్పుడు గానీ తెలుసుకొంటారు. అయితే ఇప్పుడు మనం మహాభారతం నుండి మనం తెలుసుకోవలసిన వాటి గురించి చూద్దాం !!*_
_*1.మనిషి తన జీవితంలో గెలవడానికి జాలి, దయ, మంచితనం మాత్రమే ఉంటే చాలదు, ఎందుకంటే కర్ణుడు అంటేనే మంచితనానికి, దాన, ధర్మాలకి పెట్టింది పేరు, కాని సమయాన్ని బట్టి, పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోక పోవడం వలన, గుడ్డిగా దుర్యోధనుని నమ్మి చెడు (కౌరవుల) వైపు నిలబడి ప్రాణాలని పోగొట్టుకున్నాడు, కావున జీవితంలో గెలవాలంటే మంచితనంతో పాటు చుట్టూ ఉండే సమాజ పరిస్థితులని, సమయాన్ని బట్టి సమయస్ఫూర్తితో నడుచుకోవాలి.*_
_*2.చెడు స్నేహం అనేది మీ ఊహలకి కూడా అందని విధంగా మీ జీవితం నాశనం చేయొచ్చు. శకుని.. పరోక్షంగా కౌరవ సామ్రాజ్యం మొత్తాన్ని నాశనం చేసి, వారితో స్నేహంగా వారి ఆస్థానంలో ఉంటూనే, వారికి కలలో కూడా ఊహించని పరాజయాన్ని మిగిల్చాడు, జీవితంలో శకుని లాంటి వారిచ్చే సలహాలని తీసుకోరాదు.*_
_*3. ఎటువంటి బేధాలు చూడని నిజమైన స్నేహం జీవితంలో మనల్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది...పాండవులు శ్రీ కృష్ణుడిని స్నేహం వలన, కౌరవులు కర్ణుడి స్నేహం పొందటం అది వారికి యుద్ధం సమయంలో ఏ స్థాయిలో ఉపయోగపడిందో తెలిసినదే, కర్ణుడు లేని రారాజు బలం ఏ పాటిదో, కౌరవ సేనకు కర్ణుడు ఏ స్థాయిలో ఉపయోగపడ్డాడో మనకు తెలిసిన సంగతే కదా ! కుల, మత, పేద మరియు ధనిక భేదాలని చూడకుండా మంచివారితో స్నేహం చేసేవారు ఖచ్చితంగా జీవితంలో గెలుస్తారు.*_
_*4. మమకారం అనేది అత్యంత ప్రమాదకరం. కౌరవుల తల్లి అయిన గాంధారీ కి వంద మంది కుమారుల పైన వల్లమాలిన ప్రేమ ఉండటం వల్ల వారిని క్రమశిక్షణగా పెంచటంలో చాలా కష్టపడాల్సి వచ్చింది, రాజ్యాన్ని బిడ్డలకి సమంగా పంచటమూ వారి బాగోగులు చూసుకోవడంలో కూడా చాలా కష్టం అయింది, అలాగే దుర్యోధనుడికి ఉన్న అధికమైన కోపం, అధికమైన రాజ్యకాంక్ష కారణంగా కౌరవులు నాశనం అయ్యారు..! కాబట్టి అన్ని చోట్ల ముఖ్యంగా చెడు పక్షాన అధికం అనేది అత్యంత ప్రమాదకరం.*_
_*5. ఎవరి పనులు వారే చేసుకోవడం నేర్చుకోవాలి. అరణ్యవాసం, అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులకి వాళ్ళు నేర్చుకున్న ఇంటిపనులు, వంట పనులు చాలా ఉపయోగపడ్డాయి. అలాగే మనం కూడా మన అవసరాల కోసం అయినా కొన్ని పనులు నేర్చుకోవాలి.*_
_*6. మనకి సంబంధించిన దాని కోసం ఎంత కష్టమైనా పోరాడవలసిందే. కౌరవులతో పోల్చుకుంటే పాండవుల సైన్యం చాలా తక్కువగా ఉన్న పాండవులు తమ కష్టాన్ని మాత్రమే నమ్ముకొని చిత్తశుద్ధితో పోరాటం చేసి విజేతలుగా నిలిచారు.*_
_*7. అతి ప్రేమ నష్టం కలిగిస్తుంది. ధృతరాష్ట్రుడు అటు బిడ్డల మీద ప్రేమ ఇటు తను నమ్ముకున్న సిద్దాంతాల మధ్య ఎలా నలిగిపోయాడో, కొడుకుల వినాశనం అంతా తెలుస్తున్నా వారి తప్పులని ఆపలేకపోయాడు, అదే ధృతరాష్ట్రుడు తన బిడ్డల మీద అంత ప్రేమని పెంచుకోకుండా వారిని క్రమశిక్షణలో పెట్టి ఉంటే విషయం అంత వరకూ వెళ్ళేది కాదేమో. ఎవరి మీద అయిన అతి ప్రేమ, అతి నమ్మకం అనేది నాశనానికి, మోసానికి దారితీస్తాయి.*_
_*8. విద్యను జీవితాంతం నేర్చుకోవటమే మీకు ఉత్తమ బహుమతి. అర్జునుడు తన జీవితం ఆసాంతం విద్యలు నేర్చుకుంటూనే ఉన్నాడు. ద్రోణా చార్యుల వారి నుండీ యుద్ద శాస్త్రం, దైవ సంబంధమైన ఆయుధాల వాడకాన్ని ఇంద్రుడు ద్వారా, మహదేవుడి నుండి పాశుపతాస్త్రం, యుధిష్టరుడు, కృష్ణుడి నుండి మరెన్నో రాజ నీతులు ఇలా ప్రతి దశలోనూ అభ్యసించటమే అర్జునుడికి ఓ ప్రత్యేకస్థానం దక్కింది, నిత్యం నేర్చుకోవడం వలన ఖచ్చితంగా విజయం సాధించవచ్చు.*_
_*9.కొన్నిసార్లు శత్రువులు కూడా మిత్రుల రూపంలో ఎదురవుతారు. కౌరవుల పక్షాన ఎంతో మంది ఉన్నా వాస్తవానికి వారిలో చాలా మంది పాండవులకి సహాయపడ్డ వాళ్ళే, భీష్మ, విదుర, ద్రోణాచార్యుడు పరోక్షంగా పాండవులకి ఎంత సహాయం చేసారో మనకు తెలిసినదే, ఇక విదురుడు అయితే కౌరవుల ప్రతీ అడుగు పాండవులకి మోసుకొచ్చిన వాడే కదా.*_
_*10. స్రీలని ఆపదల నుండి కాపాడటం. నిజానికి ద్రౌపది ఐదుగురు భర్తలూ సంపన్నులూ, అత్యంత బలవంతులు కూడాను. కానీ సభామందిరాన ఆమెకు జరిగిన అవమానాన్ని ఆపలేకపోవటంలో విఫలమయ్యారు కదా.*_
_*11. అర్ధ జ్ఞానం అత్యంత ప్రమాదకరం. పద్మవ్యూహం లోనికే ప్రవేశించటమే కానీ బయటపడటం తెలియక తనకున్న అర్ధ జ్ఞానమతో అభిమన్య్యుడు వంటి మహావీరుడే నేల రాలిపోయాడు. ఏ పనిని అయిన పూర్తిగా తెలుసుకున్నాకే మొదలుపెట్టాలి, అలా తెలుసుకోకపోతే ఆ పనిని మధ్యలోనే వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది.*_
_*12. ఆడది తలుచుకుంటే ఏమైనా చేస్తుంది. కేవలం ద్రౌపదికి జరిగిన అవమానం వలన, ఆమె కౌరవ సామ్రాజ్యం మీద పెంచుకున్న కోపం చివరికి కౌరవులని వాళ్ళ సామ్రాజ్యాన్ని నామ రూపాలు లేకుండా చేసింది.*_
_*13. నీకు ఆసక్తి ఉంటే నిన్ను ఎవ్వరూ ఆపలేరు. చాలా మందికి తెలిసినంత వరకూ అర్జునుడే ప్రపంచం మొత్తంలో అతిపెద్ద విలుకాడు, కానీ కుటిల రాజకీయాల వలన తన వేలుని కోల్పోయిన ఏకలవ్యుడు, అర్జునుడిని మించిన వీరుడు నేరుగా గురు శిక్షణ లేకున్నా, అతనికి ఉన్న ఆసక్తే అర్జునుడి కన్నా గొప్ప వీరుణ్ణి చేసింది. కావున ఏదైనా సాధించాలంటే ముందుగా మనకు దాని పైన అమితమైన ఆసక్తి ఉండాలి లేకపోతే సాధించలేము.*_
_*14.మంచి వ్యూహం విజయానికి తప్పనిసరి. పాండవులకే కనుక కృష్ణుడి అతిచక్కని వ్యూహం లేకపోయి ఉంటే పాండవులు విజయాన్ని సాధించ గలిగే వారు కాదేమో, ఏ పని చెయ్యాలన్న ఒక మంచి ప్రణాళిక (వ్యూహం) ఉండాలి అలా అయితేనే ఆ పనిని సక్రమంగా పూర్తి చేయ గలుగుతాం.*_

No comments:
Post a Comment