**మనం చేసే ప్రతి పనిని కర్మ అని అంటారు. మంచి పనులు చేస్తే వాటిని ఉత్తమ కర్మలని, చెడు పనులు చేస్తే వాటిని చెడు కర్మలని అంటారు. ఉత్తమ కర్మలు చేసిన వారిని ప్రశంసిస్తాము. అలాగే చెడు కర్మలు చేసిన వారిని శిక్షిస్తాము.*_
_**అయితే తప్పు చేసిన వారిని శిక్షించే అధికారం చట్టానికి, కోర్టులకు ఉన్నాయి. కానీ చట్టంలోని కొన్ని లొసుగుల వల్ల కానీ, సాక్ష్యాధారాలు లేకపోవడం వల్ల కానీ కొంతమంది అసలైన దోషులు శిక్షలు పడకుండానే తప్పించుకొని సమాజంలో పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్నారు. అది మనమూ చూస్తూనే ఉన్నాము.*_
_**మరి ఇదేం న్యాయం ఇదేం ధర్మం. దీనికి పరిష్కారమే లేదా ? వీరిని శిక్షించే వారే లేరా ? అయితే అలాంటి వారిని చట్టాలు, కోర్టులు ఏమీ చెయ్యలేక పోవచ్చును, కానీ విధి అనేది అలాంటి వారిని తప్పకుండా శిక్షిస్తుంది. అదెలాగో చూద్దాం...*_
_**మన చుట్టూ ఎవరూ లేనప్పుడు, ఎవరూ చూడలేదు అనుకుంటూ తప్పుడు పనులను చేయడం మానవ బలహీనత. అలా చేసేవాడు ఇక్కడ ‘నేను ఒక్కడినే కదా ఉన్నాను, నన్ను ఎవరూ గమనించడం లేదు కదా ' అని అనుకొంటాడు. కానీ అలా అనుకోవటం చాలా పొరపాటు. మనిషి ఏ పని చేస్తున్నా నిశితంగా గమనించేవి మూగ సాక్షులు పద్దెనిమిది ఉన్నాయి.*_
_**అవి "నాలుగు వేదాలు, పంచభూతాలు, అంతరాత్మ, ధర్మం, యముడు, ఉభయ సంధ్యలు, సూర్య చంద్రులు, పగలు, రాత్రి ". వీటినే అష్టాదశ మహా పదార్థాలు అంటారు. ఈ మూగసాక్షులు మనిషిని అనుక్షణం నీడలా పర్యవేక్షిస్తుంటాయి. ఇవి మనలోకంలోని న్యాయస్థానాల్లో సాక్ష్యం చెప్పపోవచ్చును గాని, వీటి గమనిక నుండి మనిషి తప్పించుకోవడం సాధ్యపడదు.*_
_**అయితే వీటిని గుర్తించలేని కారణంగానే ఇవన్నీ జడ పదార్థాలేనని, సాక్ష్యం చెప్పడానికి వీటికి నోరులేనివని మానవుడు భ్రమపడుతుంటాడు. ఈ మహా పదార్థాలు రహస్య యంత్రాల వంటివి. అవి మనిషి చేసే ప్రతి చర్యనూ నమోదు చేస్తాయి. ఆ నివేదికల్ని విధికి చేరవేస్తాయి. అది వాటిని కర్మలుగా మలుస్తుంది.*_
_**మనిషి చేసే పనులు మంచివి అయితే సత్కర్మలుగా, చెడ్డవి అయితే దుష్కర్మలుగా విధి నిర్ణయిస్తుంది. సత్కర్మలకు సత్కారాలు, దుష్కర్మలకు జరిమానాలు అమలవుతాయి. అవి ఏవో మరుజన్మకో ఆ తరువాతో ఫలిస్తాయని అనుకోకూడదు, ఈ జన్మలోనే అమలు చేయబడతాయి. అది మనకు తెలియకుండానే జరిగిపోయే ప్రక్రియ, అవి ఏ రూపంలో అయినా ఉండవచ్చు.*_
_**ఉదా :- జబ్బుల రూపంలో, కష్టాలు, నష్టాలు, బాధల రూపంలో, ఇంకా ఎన్నో రూపాల్లో "విధి" శిక్షిస్తుంది. ఇది నిరంతరాయంగా సాగిపోయే సృష్టిపరిణామక్రమం. దీన్ని కొంతమంది నమ్మక పోవచ్చు. కానీ తప్పులు చేసేవారిని విధి శిక్షించడం తథ్యం.*_
_**దీన్ని చాలా మంది నమ్మక పోవచ్చు, కానీ నమ్మడానికి ఉదాహరణ ఎలాగంటే మనలో అంతరాత్మ అనేది ఒకటుందని ప్రతి మనిషికీ తెలుసు. అది మనం చేసే పని మంచిదా? చెడ్డదా? అనే విషయాన్ని ఎప్పటికప్పుడే చెప్పేస్తుంది. కానీ ఆవేశం, కోపంతో విచక్షణ కోల్పోయిన వ్యక్తి అంతరాత్మ సలహాను కూడా కాలరాస్తాడు. అది అనేక రకాలుగా అనర్థాలకు దారితీయటం మనందరికి అనుభవమే. ఒక్కోసారి అంతరాత్మ నిలదీస్తున్నప్పుడు పశ్చాత్తాపంతో సిగ్గుతో తలదించుకుంటాం. కానీ దీన్ని మనమెవరితోనూ పంచుకోము. అందువల్ల అంతరాత్మ ఫలాలు అనుభవపూర్వకంగా నిజమైనప్పుడు మిగతా పది హేడు కూడా నిజమేనని గ్రహించగలగటం వివేకం.*_
_**నలుగురికీ తెలిసేలా దానధర్మాలు, క్రతువులు, పూజలు నిర్వహించాలన్న కుతూహలం అవివేకం. వాటివల్ల నీవు ఇతరుల మెప్పు మాత్రమే పొందుతావు తప్ప పుణ్యఫలం రాదు, గుప్త దానాలు, పదిమందికి ఉపయోగపడే మంచి పనులు చేయాలి. అలాంటి వాటిని ఎవరు చూసినా చూడక పోయినా, అష్టాదశ సాక్షులు ఎల్లవేళలా గమనిస్తున్నాయంటే, ఎవరు చూడాలో వాళ్ళు చూస్తున్నట్లేగా అర్థం. ఈ ఎరుక కలిగినప్పుడు ఏ మనిషీ చెడ్డ పనులు చేయటానికి తెగించడు.*_
_**ఎవరు చూసినా చూడకపోయినా మంచితనంతో, తోటి వారికి సాధ్యమయినంత సహాయం చేయాలనే సత్‌సంకల్పంతో జీవితాన్ని గడపడం ఉత్తమం. ఈ జ్ఞానం వల్ల మనిషి సాధ్యమైనన్ని మంచిపనులు చేయడానికి పయ్రత్నిస్తూ సుఖశాంతులకు నోచుకుంటాడు.*_
_**కాబట్టి అందరూ కూడా వీలైనంత మంచి పనులు చేసి ఆనందంగా, ఆరోగ్యంగా, మానసిక ప్రశాంతతతో, దీర్ఘాయుష్షుతో జీవించాలి కోరుకుంటూ...*_

No comments:
Post a Comment