రుద్రాక్ష అనగా మాగ్నోలియోఫైటా కు చెందిన చెట్టు. దీని శాస్త్రీయ నామం Elaeocarpus Ganitrus. హిందువులు ఈ చెట్టు యొక్క కాయలను పవిత్రంగా భావిస్తారు.
రుద్రాక్షలు ఎలా పుట్టాయో అంటే ఈశ్వరుడు మూడు నేత్రాలను మూసివేసి ధ్యానంలో చాల సంవత్సరాలు ఉన్నారు .
ధ్యానం నుంచి ఈశ్వరుడు కళ్ళు తెరవగానే, ఆయన నేత్రాలనుండి రాలిన కొన్ని బాష్పాలు గౌడ, మధుర, అయోధ్య, కాశీ వంటి క్షేత్రాల యందు – మలయ ; సహ్యాద్రి పర్వతాలయందు పడి – కాలాంతరాన అవే రుద్రాక్షలుగా పరిణమించాయి.
ఈ బిందువులు రుద్రాక్ష వృక్షాలుగా ఆవిర్భవించాయి. మొత్తం 38 రకాల వృక్షాలు స్వామి కంటి బిందువుల నుంచి ఏర్పడ్డాయి. ఎడమకన్ను నుంచి 12, కుడి కన్ను నుంచి 16, మూడోకన్ను అగ్నినేత్రం నుంచి నల్లని రంగులో వున్న 10 రుద్రాక్ష వృక్షాలు ఆవిర్భవించాయి.
జపం చేసుకోవడానికీ – ధారణకు కూడా చిన్న రుద్రాక్షలే అత్యంత ఫలవంతమైనవి. గురివింద గింజ ప్రమాణంలో ఉండే రుద్రాక్షలే శ్రేష్ఠమైనవి. రేగుపండు – ఉసిరికాయ ప్రమాణాల్లోనూ రుద్రాక్షలు లభిస్తాయి.
రుద్రాక్షలన్నీ ధరించదగ్గవికావు. కొన్నిటి విషయంలో అశుభదాయకమైనవీ ఉన్నాయి. పగిలినవీ – పురుగులు ప్రవేశించినవీ – గుండ్రంగా లేనివీ – కండలేనివీ పనికిరావు. వీటితో జపమైనా నిషిద్ధమే! నునుపుగా, కంటకయుతంగా, గట్టిగా ఉండే రుద్రాక్షలు ఎంపిక చేసుకోవాలి. మాల ఏర్పడాలంటే సూత్ర ద్వారం ఉండాలి. కనుక, అదీ సహజంగా ఏర్పడిన రుద్రాక్ష శ్రేష్ఠం! పదకొండు వందల రుద్రాక్షలను ధరించినచో అతడు సాక్షాత్ శివస్వరూపుడు, బ్రాహ్మణులు తెల్లనివీ – క్షత్రియులు ఎర్రనివి, వైశ్యులు పసుపు రంగువీ, అన్నీ కలిసిన వర్ణాలు ఇతర వర్ణాలవారూ ధరించవచ్చు! రుద్రాక్షధారణ ఆరోగ్యరీత్యా కూడా ఎంతో మంచిది.
వ్యాధులు – బాధలు ఉండవు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. శాంతి సౌఖ్యాలు లభిస్తాయి. మామిడిచెట్టును పోలినట్టుండే వృక్షం రుద్రాక్ష ఫలాలను ఇస్తుంది. శరదృతువులో ఫలిస్తుంది. ఫలం యొక్క పై పొర దళసరిగా ఉంటుంది. పండు రూపంలో దీన్ని సేకరించగలిగితే మంచిదే! దానంతట అదే ఎండి, గట్టి పడుతుంది. పండు పుల్లగా ఉంటుంది. వాత – కఫ దోషాలను నివారిస్తుంది. రుద్రాక్షధారణ క్షయరోగ నివారిణి. నీటిలో రుద్రాక్షను అరగదీసి మశూచి రోగాన్ని నివారించడం ఆయుర్వేదంలో మనకి తెలిసినదే! అలాగే తేనెలో అరగదీసి మూర్చరోగాన్ని పోగొట్టవచ్చు! వీటికి ఉండే చారలను బట్టి ముఖాలను నిర్ణయిస్తారు.
ఏకముఖి రుద్రాక్ష: : దర్శనం మహాపాతక నాశనం ; అర్చనం లక్ష్మీకటాక్ష కారణం.
ద్విముఖి : : గోహత్యాపాతక నివారిణి, సర్వాభీష్ట కారిణి.
త్రిముఖి : : కార్యసిద్ధి ; విధ్యాభివృద్ధి.
చతుర్ముఖి : : బ్రహ్మస్వరూపం, దర్శన – స్పర్శ మాత్రాన స్పర్శ పాపహారిణి, నరహత్యాదోష నివారిణి.
పంచముఖి: కాలాగ్ని రుద్ర స్వరూపం. మోక్షకారకం.
షణ్ముఖి : కుమారస్వామి స్వరూపం. సమస్తపాపహారిణి.
సప్తముఖి : మన్మధరూపిణి. వశీకరనణి.
అష్టముఖి : దారిద్ర్య విధ్వంసిని ; భైరవ స్వరూపం ; దీర్ఘాయుష్య కారకం.
నవముఖి : నవదుర్గా స్వరూపం. శివతుల్య వైభవదాయిని.
దశముఖి : విష్ణురూపిణి. సకలాభీష్టప్రదాయిని.
ఏకాదశముఖి : రుద్రరూపిణి. విశేష ఫలదాయిని.
12, 13, 14 ముఖాలు : ఏవైనా ఒక ప్రత్యేకమైన ఇచ్చను హృదయ మందుంచుకొని, ఆరాధన చేయదగ్గవి. మండలం (40)రోజుల్లో ఫలితాన్నివ్వగలవు.
పద్నాలుగు ముఖాలు గల రుద్రాక్షలు పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది.
#ధారణకుమంత్రబీజాలు :
ఏకముఖ, చతుర్ముఖ, పంచముఖ, దశముఖ, త్రయోదశ ముఖాలకు : “ఓం హ్రీం నమః” అనే మంత్రంతో ధరించాలి.
ద్విముఖ, చతుర్ముఖి, చతుర్దశ ముఖాలకు : “ఓం హ్రీం నమః”
త్రిముఖ రుద్రాక్షకు : “ఓం క్లీం నమః” అని 108 సార్లు జపించాలి.
6, 9, 11 ముఖాలు గల రుద్రాక్షలకు : “ఓం హ్రీం నమః”
సప్త, అష్టముఖి రుద్రాలకు : “ఓం హుం నమః”
ద్వాదశ ముఖికి : “ఓం క్రౌం నమః”
మంత్ర హీనంగా రుద్రాక్ష ధారణ ఫలితాన్నివ్వదు.
రుద్రాక్షలు వాటి విశిష్టతలు...........!!
1) ఏకముఖి రుద్రాక్ష : ఇది శివుని ప్రతిరూపం. ఇది ధరించిన వ్యక్తికి ఏ విషయంలోనూ కొరత ఉండదు. వ్యక్తి వికాసం, జ్ఞాన సమృద్ధి, సంపద చేకూరతాయి.
2) ద్విముఖి : అర్ధనారీస్వర తత్వానికి సంకేతం. దీనిని ధరించడం వలన కుండలినీ శక్తి పెరుగుతుంది.
3) త్రిముఖి : ఇది అగ్నికి సంకేతం. ఆరోగ్యానికీ, అభ్యుదయానికీ ఉపకరిస్తుంది.
4) చతుర్ముఖి : బ్రహ్మకు ప్రాతినిధ్యం వహిస్తుంది. పాలలో వేసి త్రాగితే మానసిక రోగాలు నయమవుతాయి. విద్యార్ధులకు బాగా ఉపకరిస్తుంది.
5) పంచముఖి : గుండె జబ్బులున్నవారికి మంచిది. శతృవులను సులభంగా జయించవచ్చు. పాము కాటునుంచి రక్షణ కలుగుతుంది.
6) షణ్ముఖి : కార్తికేయునికి ప్రతీక. రక్తపోటు, హిస్టీరియా పోతాయి.
7) సప్తముఖి : కామధేనువుకి ప్రతీక. అకాల మరణం సంభవించద.
8.) అష్టముఖి : విఘ్నేశ్వరునికి ప్రతీక. కుండలినీ శక్తి పెరుగుతుంది.
9) నవముఖి : భైరవునికి ప్రతీక. దుర్గ ఆరాధకులకు మంచిది. దీనిని ఎడమ చేతికి ధరించాలి.
10) దశముఖి : జనార్ధనుడికి పరీక్ష. అశ్వమేధ యాగం చేసినంత ప్రయోజనం కలుగుతుంది. దీనిని స్త్రీలు ఎక్కువగా ధరిస్తారు.
11) ఏకాదశముఖి : 11 ముఖాలు. రుద్రుని 11 రూపాలకు ప్రతీక. దుష్ట శక్తులనుంచి కాపాడుతుంది.
12) ద్వాదశముఖి : 12 మంది ఆద్యులకు ప్రతీక. గౌరవం పెరుగుతుంది.
13) త్రయోదశముఖి : కామధేవునికీ, కార్తికేయునికీ ప్రతీక. పాలలో వేసి, ఆ పాలను త్రాగితే అందం పెరుగుతుంది.
14) చతుర్దశముఖి : 14 ముఖాలు. ఉపనిషత్తుల ప్రకారం ఇది పరమశివుని కన్ను.
15) పంచదశముఖి : పశుపతికి ప్రతీక. ఆధ్యాత్మిక సాధనకు ఉపకరిస్తుంది.
16) షోడశముఖి : 16 ముఖాలు కలది. ఇది కల్పిమాడుకుకు ప్రతీక.
17) సప్తదశముఖి : విశ్వకర్మకు ప్రతీక. దీని వలన సంపద కలుగుతుంది.
18) అష్టాదశముఖి : 18 ముఖాలు. ఇది భూమికి తార్కాణం.
19) ఏకోన్నవింశతిముఖి : 19 ముఖాలు. ఇది సాక్షాత్తూ నారాయణుడికి సంకేతం.
20) వింశతిముఖి : 20 ముఖాలు. ఇది సృష్టికర్త బ్రహ్మకు సంకేతం.
జన్మ నక్షత్ర రీత్యా ధరించవలసిన రుద్రాక్షలు........!!
నక్షత్రము ధరించవలసిన రుద్రాక్ష
అశ్వని - నవముఖి
భరణి - షణ్ముఖి
కృత్తిక - ఏకముఖి, ద్వాదశముఖి
రోహిణి - ద్విముఖి
మృగశిర - త్రిముఖి
ఆరుద్ర - అష్టముఖి
పునర్వసు - పంచముఖి
పుష్యమి - సప్తముఖి
ఆశ్లేష - చతుర్ముఖి
మఖ - నవముఖి
పుబ్బ - షణ్ముఖి
ఉత్తర - ఏకముఖి, ద్వాదశముఖి
హస్త - ద్విముఖి
చిత్త - త్రిముఖి
స్వాతి - అష్టముఖి
విశాఖ - పంచముఖి
అనురాధ - సప్తముఖి
జ్యేష్ఠ - చతుర్ముఖి
మూల - నవముఖి
పూర్వాషాఢ - షణ్ముఖి
ఉత్తరాషాఢ - ఏకముఖి లేదా ద్వాదశముఖి
శ్రవణం - ద్విముఖి
ధనిష్ట - త్రిముఖి
శతభిషం - అష్టముఖి
పూర్వాభాద్ర - పంచముఖి
ఉత్తరాభాద్ర - సప్తముఖి
రేవతి - చతుర్ముఖి.
నవరత్నముల కు బదులు రుద్రాక్షలు కూడా ధరించవచ్చు.
1) కెంపు – ఏకముఖి, ద్వాదశముఖి
2) ముత్యం – ద్విముఖి, ఏకాదశ ముఖి
3) పగడం – త్రిముఖి, అష్టాదశ ముఖి
4) పచ్చ – చతుర్ముఖి, త్రయోదశ ముఖి
5) పుష్యరాగం – పంచ ముఖి, చతుర్దశ ముఖి
6) వజ్రం – షణ్ముఖి, పంచ దశ ముఖి
7) నీలం – సప్త ముఖి, షోడశ ముఖి
8.)గోమేధికం – అష్టముఖి, గౌరీ శంకర ముఖి
9) వైఢూర్యం – నవ ముఖి, ఆష్టా దశ ముఖి.
రుద్రాక్షలు ధరించడం వల్ల వచ్చు ఫలితములు
1) ఏకముఖి రుద్రాక్ష – ఈ రుద్రాక్ష చాలా విలువైనది. ఎటువంటి మంత్ర తంత్ర ప్రయోగాలు అయినా తిప్పి కొట్టగలదు. సిరి సంపదలు, శిరో సంబంధ రోగములు నివారణ అగును.
2) ద్విముఖి – ఇది బ్రహ్మ రుద్రాక్ష అని కొందరి అభిప్రాయం. అర్ధనారీశ్వర తత్వానికి ప్రతీక అని కూడా అనుకోవచ్చు. సంతాన ప్రాప్తి, ఏకాగ్రత, వ్యాపార అభివృద్ధి. కల్గును. మనోవ్యాకులతను దూరం చేస్తుంది
3) త్రిముఖి – ఈ రుద్రాక్ష చాలా అదృష్టదాయకమయినది. ధనధాన్యసమృద్ధి, కామెర్ల వ్యాధి నివారణ మరియు సర్ప దోష నివారణ అగును.
4) చతుర్ముఖి – పరిశోధకులు, జ్యోతిర్గణిత వేత్తలు ధరించడం వల్ల అదికరాణింపు ఉండును మరియు ఏకాగ్రత పెరుగును.
5) పంచముఖి – బ్రహ్మ స్వరూపమయిన ఈ రుద్రాక్ష వల్ల అకాలమృత్యునివారణ, గుండెపోటు వంటి హృద్రోగ సంబంధిత వ్యాధులు నివారణ అగును మరియు మలబద్దకం నివారణ అగును.
6) షణ్ముఖి – ఈ రుద్రాక్ష కుమార స్వామి స్వరూపం, శక్తి, విజయం, శరీర ధారుఢ్యం, ఆరోగ్యం లభించును.
7) సప్త ముఖి– సభావశ్యత,సంపద, కీర్తి, ఉత్తేజం కల్గును.
8.)అష్ట ముఖి – ఆకస్మిక ధన ప్రాప్తి కల్గును.
9) నవముఖి రుద్రాక్ష – ఈ రుద్రాక్ష భైరవ స్వరూపమయినది. రాజకీయ పదవులలో ఔన్నత్యం ఆశించువారికి, అపమృత్యు నివారణకు, పరోపకార దక్షులకు ధరించవచ్చు.
10) దశముఖి రుద్రాక్ష – విష్ణు స్వరూపమయినది. గొంతు సంబంధ రోగాలను, నవగ్రహముల ద్వారా కలుగు కష్టములు, సమస్యలు నివారణ అగును.
11) ఏకాదశ ముఖి – ఇది శివాత్మకమయిన రుద్రాక్ష. వైవాహిక జీవితం లోఆనందమునకు, గర్భ సంభందరోగాలకు అనుకూలత లభించును.
ఇలా ఏకవింశతి ముఖ రుద్రాక్షలు అన్నియు అనేక విధముల సత్ఫలితములు కల్గును.(తప్పని సరిగా నియమ,నిభందనలు పాటించవలయును)

No comments:
Post a Comment