యమాష్టకం. ~ దైవదర్శనం

యమాష్టకం.

*తపసా ధర్మమారాధ్య పుష్కరే భాస్కరః పురా |*
*ధర్మాంశం యం సుతం ప్రాప ధర్మరాజం నమామ్యహం ||*

*సమతా సర్వభూతేషు యస్య సర్వస్య సాక్షిణః |*
*అతో యన్నామ శమనమితి తం ప్రణమామ్యహం ||*

*యేనాంతశ్చ కృతో విశ్వే సర్వేషాం జీవినాం పరం |*
*క్రమానురూపకాలేన తం కృతాంతం నమామ్యహం ||*

*బిభర్తి దండం దండ్యాయ పాపినాం శుద్ధిహేతవే |*
*నమామి తం దండధరం యః శాస్తా సర్వ కర్మణాం ||*

*విశ్వే యః కలయత్యేవ సర్వాయుశ్చాzపి సంతతం |*
*అతీవ దుర్నివార్యం చ తం కాలం ప్రణమామ్యహం ||*

*తపస్వీ వైష్ణవో ధర్మీ సంయమీ విజితేంద్రియః |*
*జీవినాం కర్మఫలదం తం యమం ప్రణమామ్యహం ||*

*స్వాత్మారామం చ సర్వజ్ఞో మిత్రం పుణ్యకృతాం భవేత్‌ |*
*పాపినాం క్లేశదో యశ్చ పుణ్యం మిత్రం నమామ్యహం ||*

*యజ్ఞన్మ బ్రహ్మణో వంశే జ్వలంతం బ్రహ్మతేజసా |*
*యో ధ్యాయతి పరం బ్రహ్మ బ్రహ్మవంశం నమామ్యహం ||*

పూర్వము సూర్యుడు పుష్కర క్షెత్రమున ధర్మదేవతను ఆరాధించి ధర్మదేవతాంశుడైన కుమారుని కనెను. అతని పేరు ధర్మరాజు. ఆ యమధర్మరాజుకు నమస్కరింతును. సమస్త ప్రాణులయందు పక్షపాత రహితుడై సమానముగా ఉండి ప్రాణులు చేయు సమస్తకర్మలకు సాక్షీభూతుడైన శమనుని నమస్కరింతును. ప్రపంచములోని సమస్త జీవులకు వారివారి కర్మాను రూపమైన సమయమున వారిని అంతమును చేయుచున్నందువలన కృతాంతుడవగు నిన్ను నమస్కరింతును. పాపము చేసిన ప్రాణులను పాపవిముక్తులను చేయుటకు దండన విధించుటకై చేతిలో దండము ధరించున్నందువలన దండధరుడవు అగు నిన్ను నమస్కరించుచున్నాను. ఈ ప్రపంచమున నున్న జంతువుల ఆయుస్సును ఏర్పరచుచున్నందువలన నీవు కాలుడవైతివి. తపమాచరించుచు విష్ణుభక్తుడవై, జితేంద్రియముడవై జీవులు చేసిన కర్మలకు ఫలమును సంయమనముతో ఇచ్చుచున్నందువలన యముడవైతివి. సర్వజ్ఞడు, పుణ్య కర్మలు చేయువారికి స్నేహితుడు, పాపకర్మలు చేయువారికి కష్టములను కల్గించువాడు ఆత్మారాముడవైయుందువు. బ్రహ్మవంశములో పుట్టి బ్రహ్మతేజస్సుతో ప్రకాశించుచు పరబ్రహ్మను ధ్యానించు నిన్ను నమస్కరింతునని సావిత్రి యముని స్తుతించెను.

*ఇత్యుక్త్యా సా చ సావిత్రీ ప్రణనామ యమం మునే |*
*యమస్తాం విష్ణుభజనం కర్మపాకమువాచ హ ||*

ఈవిధముగా సావిత్రి యమధర్మరాజును భక్తిపూర్వకముగా స్తోత్రము చేయగా యముడు సంతోషించి ఆమెకు విష్ణుమూర్తిని సేవించు విధానమును అశుభకర్మవిపాకమును ఇట్లు చెప్పెను.

*ఇదం యమాష్టకం నిత్యం ప్రాతరుత్థాయ యః పఠేత్‌ |*
*యమాత్తస్య భయం నాస్తి సర్వపాపాత్పమ్రుచ్యతే ||*

*మహాపాపీ యది పఠేన్నిత్యం భక్త్యా చ నారద |*
*యమః కరోతి తం శుద్ధం కాయవ్యాహేన నిశ్చితం ||*

సావిత్రి యముని స్తుతించిన ఈ యమాష్టకమును ఉదయముననే లేచి చదివినవారికి యముని భయముండదు. అట్లే అతని సమస్త పాపములు నశించిపోవును. ఓనారదా ! దీనిని మిక్కిలి పాపములు చేసినవాడైనా భక్తి శ్రద్ధలతో చదివినచో యముడతనిని పరిశుద్ధుని చేయును అని నారాయణుడు నారదునితో అనెను.
Share:

Related Posts:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive