తిలకధారణం...! హిందువులను గుర్తించడానికి ఉపకరించే ముఖ్యమైన చిహ్నం ఇది...! హిందుమతంలోని ఆయా సంప్రదాయాలకు అనుగుణంగా...వారి వారి పద్ధతుల్లో బొట్టును పెట్టుకుంటారు. ప్రపంచంలో ఏ దేశాల్లోనైనా బొట్టు ధరించిన స్త్రీ...భారత స్త్రీగానే సాక్షాత్కరిస్తుంది. శుభకార్యానికి నాందిగా బొట్టు పెట్టి పిలవడం మన సంప్రదాయం...! నుదుట బొట్టుతో ఉన్న స్త్రీలను ముత్తయిదువులుగా గుర్తిస్తారు. మహిళలకు నుదుట బొట్టు అదో మధురమైన చిహ్నం...! మన సంప్రదాయంలో ఏది వున్నా లేక పోయినా బొట్టు పెట్టి సాగనంపుతారు. భారతీయులు బొట్టును లక్ష్మీ దేవిగా భావిస్తారు. అందుకే ఇంటి గడపలను సైతం బొట్టుతో అలకరించి అమ్మవారిని ఆహ్వానిస్తారు. అంతేకాదు ఇతరుల దిష్టి సోకకుండా కూడా బొట్టు పెట్టుకుంటారు. మన దేశంలో ఊయల్లో ఉండే పసిపాప మొదలుకుని వృద్ధాప్యం లో పండువాళ్ల దాకా...స్త్రీ,పురుష బేధం లేకుండా అందరూ బొట్టును పెట్టుకుంటారు.
హిందువుల్లో అన్ని కులాల వారికి తమ తమ సంప్రదాయాలకు అనుగుణంగా బొట్టు పెట్టుకోవడం పూర్వ కాలం నుంచి ఉన్నదే...! శుభకార్యాల సమయంలో అందరూ తప్పక బొట్టును ధరించాల్సిందే...! ఇంకా పురుషులకంటే మహిళలందరూ నుదుట బొట్టు ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే...! లేదంటే అపచారంగా భావించేవారు. బొట్టు....స్త్రీలకు సౌందర్యానికి చిహ్నమే కాదు...! ఇతరుల నర దిష్టి సోకకుండా కాపాడుతుందని మన పెద్దల నమ్మకం..!
మనం ధరించే కుంకుమ ఎరుపు రంగులో ఉంటుంది. మానవుడి జీవన జ్యోతిని...., ప్రాణశక్తిని నిలిపే రక్తం కూడా ఎర్రని రంగులోనే ఉంటుంది. ఈ రంగు సూర్యశక్తిని ప్రతిబింబిస్తుంది..! సూర్య కాంతిని తనలో లీనం చేసుకొని సూర్యుని వేడిని తాకనివ్వదు. కుంకుమను నుదుటనే ధరించాలి. ఇది మన ప్రాచీన రుషుల శాస్త్రయుక్త ఆలోచన..!
మన శరీరంలోని సర్వనాడులను కలుపుతూ మెదడుకి సంకేతస్థానంగా నిలిచి... ఎల్లప్పుడు జాగ్రదవస్థలో ఉండేది సుఘమ్నా నాడి...! ఇది అత్యంత కీలకమైనది ఇది కనుబొమ్మల మధ్యలో ఉంటుంది. దీనినే మన ప్రాచీన రుషులు జ్ఞాన నేత్రం అన్నారు. ఈ శక్తివంతమైన జ్ఞాన నేత్రానికి...పగవారి దృష్టి పడకుండా, సూర్యతాపం తగలకుండా...ఆ స్థానంలో బొట్టును పెట్టుకోవడం మన సంప్రదాయంలో భాగంగా చేశారు ప్రాచీన రుషులు...!
మానవుడి నిరంతర ఆలోచనలు, శరీరంలో జరిగే రక్త ప్రసరణ వేడిని కలుగజేస్తాయి. వరుస ఆలోచనలతో జనించిన వేడిలో జ్ఞాన నేత్రం కరిగిపోకుండా...ఎల్లప్పుడు నుదుట స్థానాన్ని చల్లగా వుంచేందుకు మన రుషులు కుంకుమను ధరించాలని తెలిపారు.

No comments:
Post a Comment