ఒక శిష్యుడికి ఎవరు దేవతలు? ఎవరు రాక్షసులు ? వారి వారి ప్రవర్తనలలో తేడా ఏమిటి? అన్న విషయమై ఎప్పుడూ సందేహంగానే ఉండేది. తన సందేహం గురించి గురువుగారిని ఎప్పుడు అడిగినా కూడా ఆయన ఓ చిరునవ్వు నవ్వేసి ఊరుకునేవారు.*_
_**చివరికి ఆ శిష్యుడు ఓ రోజు ‘గురువుగారూ! మీరు ఇవాళ నాకు దేవతలు రాక్షసులు గురించి వారి మధ్య తేడాల గురించి చెప్పి తీరాల్సిందే! ’ అంటూ పట్టుపట్టాడు శిష్యుడు.*_
_**దానికి గురువుగారు ‘సరే! నీకు నీ మనసుకు తెలిసే విధంగా ఓ అనుభూతిని కలిగిస్తాను. దాన్ని బట్టి నీకు దేవతలు అంటే ఏమిటో, రాక్షసులు అంటే ఏమిటో వారి ప్రవర్తనలో తేడా లేమిటో తేలిపోతుంది ’ అన్నారు.*_
_**శిష్యుడు ఆ అనుభూతిని స్వీకరించేందుకు సిద్ధపడి తన కళ్లని మూసుకున్నాడు. శిష్యుడు కళ్లు మూసుకోగానే అతడి ముందు ఒక వింత దృశ్యం అతనికి కనిపించింది. ఆ దృశ్యంలో ఒక పెద్ద గది, అందులో ఆ గది మధ్యలో ఒక పెద్ద బల్ల, ఆ బల్లచుట్టూ రాక్షసులు కూర్చుని ఉన్నారు. ఆ బల్ల మీద రకరకాల ఆహార పదార్థాలు కనిపిస్తున్నాయి.*_
_**అందులో తాజా పండ్లు, ఘుమఘుమలాడే కూరలు... ఇలా ఒకటీ రెండూ కాదు... మనిషి జిహ్వను రెచ్చగొట్టే సర్వపదార్థాలూ ఆ బల్ల మీద ఉన్నాయి. కానీ ఏం లాభం ! ఆ బల్ల చుట్టూ ఉన్న ఆ రాక్షస జనాలకీ, బల్లకీ మధ్య అయిదేసి అడుగుల దూరం ఉంది. రాక్షసులు ఎంత గింజుకుంటున్నా ఆ బల్ల మధ్యలో ఉన్న ఆహార పదార్థాలను సమీపించలేకపోతున్నారు.*_
_**అలాగని ఆ ఆహారపదార్థాలను అందుకునేందుకు ఏ ఉపాయమూ లేదా అంటే లేకేం ! ఒక అయిదు అడుగుల గరిటె వారికి అందుబాటులో ఉంది. కాకపోతే ఉన్న ఒకే ఒక్క గరిటె కోసం గదిలోని ఆ రాక్షస జనాలంతా పోటీపడుతూ కొట్టుకోవడానికే సరిపోతోంది. ఒకవేళ ఎవరన్నా బలవంతుడు ఆ గరిటెను చేజిక్కించుకున్నా, దాంతో ఆహారాన్ని నింపుకుని తినడానికి నోటి దాకా తెచ్చుకునేసరికి ఎవరో ఒకరు ఆ గెరిటెను లాక్కోవడం వల్ల అందులోని పదార్థాలు నేలపాలై పోతున్నాయి, దాంతో గది మొత్తం చిందరవందరగా తయారయింది.*_
_**శిష్యుడు ఆశ్చర్యంగా ఆ దృశ్యాన్ని చూస్తున్నంతలో అది మాయమైపోయి మరో దృశ్యం కనిపించింది. అందులోనూ ఇదే పరిస్థితి. కాకపోతే ఇక్కడ గది మధ్యలో ఉన్న ఆ పెద్ద బల్ల చుట్టూ అయిదేసి అడుగుల దూరంలో కూర్చొని ఉన్నవారు దేవతలు. వారందరికీ కూడా ఒకటే గరిటె. కానీ వాళ్లంతా ఎవరూ ఎవరితో పోట్లాడుకోకుండా, ప్రశాంతంగా, నిర్మలంగా కనిపిస్తున్నారు.*_
_**వారిని గమనిస్తే వారి ఆకలి కూడా తీరినట్లే ఉంది. గదిలో ఎలాంటి కొట్లాటలూ, తోసుకోవడాలు లేవు. ఎలాంటి హడావుడీ లేదు. గది కూడా సుందరంగా తీర్చిదిద్దారనట్ల అందంగా ఉంది. అదెలా సాధ్యమా అని ఆశ్చర్యపోతున్న శిష్యుడికి, ఆ ప్రశాంతత వెనుక ఉన్న విషయం అతడి మనసుకు బోధపడింది. గదిలో ఉన్న ఒకే ఒక్క గరిటెనీ వారు ఒకరి తరువాత ఒకరు ఉపయోగించు కున్నారు. వారు ఆ గెరిటెతో ఆహారాన్ని నింపుకుని తాము భుజిస్తూ అవతలి వారికీ పెడుతున్నారు. గరిటె తమదాకా వచ్చేదాకా, తమ ఆకలి తీరేదాకా వేచి వుండి అంతా సహనంతో, ఓర్పుతో, క్రమశిక్షణ తో నడుచు కొంటున్నారు.*_
_**తనకు కనిపించిన రెండు దృశ్యాలనూ తల్చుకుంటూ శిష్యుడు తన కళ్లని తెరిచాడు. కంటి ఎదురుగా గురువుగారు ఎప్పటిలాగే చిరునవ్వులు చిందిస్తూ ఉన్నారు. ‘ఇప్పుడు అర్థం అయ్యిందా దేవతలకు రాక్షసులకు మధ్య ఉన్న తేడా ఏమిటో ! వారి ప్రవర్తనలో తేడా ఏమిటో’! అన్నారు గురువుగారు.*_
_**అప్పుడు శిష్యుడికి అర్థం అయిన విషయం ఏమిటంటే దేవతలు రాక్షసులు అంటే ఎక్కడో లేరు "ఎవరైతే తాము సంపాదించిన దానిని స్వార్థచింతనతో ఎవరికీ పెట్టకుండా, పంచకుండా తమ కడుపుకు తాము మాత్రమే తినేవాడు అసలైన రాక్షసులు. ఇక ఎవరైతే తాను సంపాదించిన దానిలో తన కడుపు నింపుకోవడమే కాకుండా ఎదుటి వారికీ పంచిపెడుతూ వారి ఆకలిని తీరుస్తూ, వారి అవసరాలను తీరుస్తూ ఉంటారో వారే అసలైన దేవతలు " అని తెలుసుకుని ఇక మీదట తాను కూడా రాక్షసుడిగా కాకుండా, దేవుడిగా జీవించాలని నిర్ణయించుకున్నాడు.*_
_**చూసారా ! మనిషి సంఘజీవి, సంఘంలో ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకొంటూ, ఒకరికి ఒకరు తోడు నీడగా నిలబడినప్పుడే అది ఉత్తమ సంఘం అవుతుంది, అందులో జీవించే వారందరూ ఉత్తమ పురుషులౌతారు. ఇక చివరిగా "అందరూ కూడా దేవుళ్ళలాగా జీవించాలని " కోరుకుంటూ...

No comments:
Post a Comment