ముఖ్య జ్యోతిష విషయములు ~ దైవదర్శనం

ముఖ్య జ్యోతిష విషయములు

1. మాసము : శుక్లపక్షము, కృష్ణపక్షము అను రెండు పక్షములు కలదియు, ముప్పది తిథులు ఆత్మగా కల కాలమును మాసము అందురు.



2. సౌరమాసము : సూర్యుడు ఒకరాశి నుంచి మరియొక రాశిలోనికి ప్రవేశించు మధ్యకాలమును సౌరమాసము అందురు. మేషమాసము, వృషభ మాసము అను వ్యవహరము తమిళనాడు మొదలగు దక్షిణ ప్రాంతములందు వ్యవహారమున ఉన్నది.



3. సావనమాసము : రెండు సూర్యోదయములకు మధ్యగల కాలమును సావన దినము అందురు. అనగా 24గం లు పరిమితికల దినము. అట్టిరోజులు ముప్ఫయి అయిన సావన మాసము. అట్టిమానములు 12 అయిన పావన సంవత్సరము.



4. చాంద్రమాసము: అమాంత మాసము - పూర్ణిమాంత మాసము అని రెండు రకములు. ಕುದ್ಧ పాడ్యమి లగాయతు అమావాస్యాంతము వరకుగల కాలమును అమాంత చాంద్రమాసము అందురు. కృష్ణ పాడ్యమి లగాయతు పౌర్జిమాంతము వరకు గలకాలమును పూర్ణిమాంత చాంద్రమానమని అందురు. ఇది ఉత్తర భారతములో వ్యవహారమున ఉండెను.



5. అధిక మాసము : సూర్యుడు ప్రతినెల ఒకరాశి నుండి మరియోుక రాశికి సంచరించుచుండును. సూర్యరాశి ప్రవేశమునకే సంక్రమణము అందురు. సూర్య సంక్రమణము ఉండని(శుద్ధపాడ్యమినుండి అమావాస్యవరకు గల మాసము)మాసమునే అధిక మాసము అని అందురు.



6. శూన్య మాసము : సూర్యుడు మీనరాశిలో ఉన్న చైత్రమాసమును, మిథున రాశిలో ఉన్న ఆషాఢమాసమును, కన్యారాశిలో ఉన్న బాధ్రపద మాసమును, ధనూరాశిలో ఉన్నపష్యమాసమును, ఈ మాసములను శూన్యమాసములందురు.



7. క్షయ మాసము : చాంద్రమాసములో ఏ మాసమున సూర్యుడు రెండు రాసులలో ప్రవేశించునో మాసమును క్షయమాసము ఆందురు.



8. మూఢమి లేక మౌఢ్యమి : కుజాది పంచగ్రహములు రవితో కలసియున్నకాలమును మూఢమందురు. వివాహాది శుభకార్యములకు శుభగ్రహములయిన గురు శుక్రుల మూఢములనే గ్రహింతుము. పాపగ్రహ మూఢములను ఆచరించనవసరము లేదు. గురుశుక్రులు రవితో కూడి ఉన్నప్పడు ఆ మౌఢ్యకాలమున వారు శుభఫలములు ఇచ్చుటలో శక్తి హీనులై ఉండెదరు. కనుక అక్షర శ్రీకారాది శుభకార్యములు, వివాహము, ఉపనయనము, గృహారంభము, గృహప్రవేశము, మొదలగు శుభకార్యములు ఆచరించుటలేదు.



9. కర్తరి: భరణి 3, 4 పాదములందు, కృత్తిక నాలుగు పాదములందు, రోహిణీ మొదటి పాదమునందు రవి సంచరించుకాలమును కర్తరి అందురు. భరణి 3, 4 పాదములందు సంచరించు కాలమును డొల్లు కర్తరి లేదా చిన్నకర్తరి అని అందురు. ఇది స్వల్ప దోషము మాత్రమే. రవికృత్తికా నక్షత్రమునందు ప్రవేశించినప్పడు అగ్నికర్తరి ప్రారంభము అగును. కర్తరీ కాలములో గృహ నిర్మాణములు నూతులు, చెరువులు, త్రవ్వట క్రొత్త వాహనములు వాడకము ప్రారంభించుట చేయరాదు. వివాహము, ఉపనయనము, యజ్ఞయాగాదులు మొదలుగునవి చేయవచ్చును.



10. త్రిసోష్టకము : మార్గశిర, పుష్య మాఘ, ఫాల్గుణమాసములలో కృష్ణపక్షమున వచ్చు సప్తమి, అష్టమి, నవమి తిథులతో కూడిన దినములను త్రిసోష్టకములు అందురు. ఈ సమయములందు వేదాధ్యయనములు మొదలగునవి చేయరాదు.



11. పక్ష ఛిద్ర తిథులు : చవితి, షష్టి, అష్టమి, నవమి, ద్వాదశి, చతుర్ధశి, తిథులు.



12. తిథి సంధి: అమావాస్య-పాడ్యమి మధ్య, పంచమి - షష్టి మధ్య, దశమి - ఏకాదశి మధ్య గల సంధిని తిథి సంధి అందురు. ఇది ఒకగంట ముప్ఫయి నిమిషములు ఆచరించెదరు.



13. లగ్నసంధి: మీన - మేషములకు, కర్కాటక -సింహములకు, వృశ్చిక -ధనుస్సులకు గల సంధిని లగ్న సంధి అందురు. ఇది 30ని ల వరకు ఆచరించెదరు.



14. నక్షత్ర సంధి: రేవతి - అశ్విని మధ్య, ఆశ్లేష-మఖ మధ్య, జ్యేష్ఠ-మూల నక్షత్రముల మధ్యకాలమును నక్షత్ర సంధి అందురు. ఈ సంధి ఒకగంట 30ని లు ఆచరించెదరు.



15. త్రివిధ నవమి : ప్రయాణము చేసిన నాటినుండి తొమ్మిదవ నక్షత్రమునందు కాని, తొమ్మిదవ తిథియందు కాని, తొమ్మిదవ తిథిరోజున కాని తిరిగి బయలు దేరకూడదు. ఇల్లు విడిచి బయలుదేరిన రోజునుండి 9వ నక్షత్రమునందు గాని తొమ్మిదవ తిథియందు గాని తొమ్మిదవ రోజుయందుగాని ఇంటి యందుకూడ ప్రవేశించకూడదు. వీటినే ప్రయాణ నవమి, ప్రత్యక్ష నవమి, ప్రవేశ నవమి ఆందురు. ఈ సమయములు నిషిద్ధములు.



16. చక్కెదురు దోషము : శుక్రమూఢమిలో ప్రయాణము చేయటమే చుక్కెదురు దోషము అందురు. కొత్తగా పెండ్లి అయిన స్త్రీ, గర్భిణీ స్త్రీ, చంటిబిడ్డతో బాలింతరాలు వీరు ముగ్గురూ శుక్రాభి ముఖముగా ప్రయాణము చేయరాదు.



17. అక్షయ తిథులు : అమావాస్య సోమవారం, సప్తమీ ఆదివారం, చతుర్ధశీ మంగళవారం, కలసిన తిథులే అక్షయ తిథులు.



18. అర్ధోదయ వ్రతము : మాఘ బహుళ అమావాస్యయందు త్రిమూర్తులను పూజించు వ్రతమును అర్ధోదయ వ్రతము అందురు.



19. ఆవమ తిథి : ఒకే రోజున మూడు తిథులు వచ్చిన ఆవమ తిథి ఆందురు.



20. వక్రం : గ్రహములు ఒకొక్కప్పుడు తాము సంచరించే రాశినుండి వేరొక రాశికి మరల వెళ్ళుటను వక్రము అందురు.



21. చంద్రబలము : జన్మలేక నామనక్షత్రము ఏరాశియందు ఉన్నదో ఆ రాశిలగాయతు తత్కాల చంద్రుడు 1, 3, 6, 7, 10, 11 రాశులలో ఉన్న శుభము మరియు కృష్ణపక్షమునందు 4, 8, 12 స్థానములందు ఉన్నప్పుడు శుభము. శుక్లపక్షమునందు 2, 9, 5 స్థానములందు ఉన్నప్పుడు శుభము. ఇట్టి ఈ విధముగా చంద్రుడు ఉన్నతల్లి బిడ్డను కాపాడినట్లుగా చంద్రుడు కాపాడును. దీనినే చంద్రబలయుక్తమని అందురు. కృష్ణపక్షమునందు తారా బలమును, శుక్లపక్షమునందు చంద్రబలమును ముఖ్యముగా గ్రహించవలయును.



22. తారాబలము - నవవిధ తారలు : జన్మ లేక నామ నక్షత్రము లగాయతు నిత్య దిన నక్షత్రము వరకు లెక్కించి తొమ్మిదిచే భాగించగా వచ్చిన శేష సంఖ్య తార అగును. అట్టి శేష సంఖ్య ఎన్నవదో అన్నవ తారను గ్రహించి ఫలితమును గ్రహించవలెను. 1. జన్మతార, 2 సంపత్తార, 3. విపత్తార, 4 క్షేమతార, 5. ప్రత్యక్తార, 6 సాధన తార, 7. వైధనతార 8. మిత్రతార, 9. పరమమిత్రతార అగును.



23. ప్రయాణమునకు శుభదినములు : తూర్పునకు - మంగళవారము, పడమరకు - బుధవారము, గురువారము, ఉత్తరమునకు - ఆదివారము, శుక్రవారములు, దక్షిణము నకు - సోమవారము, శనివారములు శుభదినములు. రాత్రికాలమందు వారశూల దోషము ఉండదు.



24. ప్రయాణమునకు దగ్ధయోగములు : ద్వాదశి - ఆదివారము, ఏకాదశి - సోమవారము, దశమి - మంగళవారము, తదియ - బుధవారము, షష్టి - గురువారము, అష్టమి - శుక్రవారము, సప్తమి - శనివారము ప్రయాణించరాదు.



25. పంచక రహితము : ముహూర్తమునకు అప్పటి తిథి, వార, నక్షత్ర, లగ్నములను (సంఖ్యలను) కలిపి తొమ్మిదిచే భాగించగా శేషము 3-5-7-9 మిగిలిన పంచక రహితమైనదని భావించవలయును. శేషము 1 మృతి పంచకము, 2 అగ్నిపంచకము, 4 రాజపంచకము, 6 చోరపంచకము, 8 రోగవంచకము దోష పంచకములు.



26. పంచకాపవాదము : ఆదివారము - రోగపంచకము, మంగళవారము - చోర అగ్ని పంచకములు, శనివారము - రాజపంచకము, బుధవారము - మృత్యుపంచకము, వర్ణనీయములు. తక్కిన వారములలో పంచక దోషమే పరిగ్రాహ్యము కాదని దైవజ్ఞ మనోహర వచనము. రాత్రియందు రోగ - చోర పంచకములున్న, పగటియందు రాజ - అగ్ని పంచకములు, రెండు సంధ్యలయందు మృత్యు పంచకము, దోష భూయిష్టములు. అనగా రాత్రియందు రాజ - అగ్నిపంచకములు, పగటియందు - చోర పంచకములు అనుసరించవచ్చును.



27. దోషపంచకములకు దానములు : 1. మృత్యుపంచకమునకు - రత్నములు, శాకమున్ను 2. అగ్ని పంచకమునకు - చందనము, గుడమున్ను 4. రాజపంచకమునకు -నిమ్మపండు, లవణము, 6. చోర పంచకమునకు - దీపము, సతిల బంగారము, 8. రోగపంచకమునకు - ధాన్యము, బంగారము ఈ విధముగ దోషపరిహారములకు దానములు చెప్పబడినవి.



28. గోచార వశాత్తు ఏదైనా గ్రహము అనుకూలము లేనప్పడు అది శనియా, కుజుడా,రాహువా, ఎవరైనప్పటికిని వానిని దృష్టిలో ఉంచుకుని బెంబేలెత్తరాదు. గోచారమునందు అనుకూలము లేనిగ్రహములు జాతకరీత్యా ఆ సమయమునందు పూర్తి అనుకూలముగా ఉన్నచో ఈ స్వల్ప దోషములు పరిగణలోకి రావు. అందుచే సంశయము వచ్చినప్పుడు జ్యోతిష్కుని కలిసి జాతక పరిశీలన చేసికొనవలయును. జాతక ఫలితములే ప్రధానముగా
చూచేది.
Share:

Related Posts:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive