ఈ ఆల్బం లో " కాశిలో ప్రసిద్ధి చెందిన "
పవిత్ర స్నాన ఘాట్లు " ఉన్నాయి.
ప్రతి హిందువు కాశీలో మరణించాలి అనుకుంటాడు , అలా జరగని పక్షంలో కనీసం కాశీ ని ఒక్కసారైనా దర్శించాలి అక్కడి నది గంగా మాతలో స్నానం చేసి,తెలిసో తెలియకో చేసిన పాప రాశులను దగ్ధం చేయాలని అనుకుంటాడు.పరమ శివుడి జటాజూటం నుండి జాలువారే పవిత్ర గంగమ్మ ఎంతటి పాప రాశులనైన భస్మం చేసే శక్తి గలది.గంగమ్మ వొడిలో ఎన్నో స్నాన ఘాట్లు ఉన్నాయి.వాటిలో కొన్నిటికి విశేష పురాణ ప్రాశస్త్యం కుడా ఉన్నది.సద్గురు శ్రీ దత్తాత్రేయ స్వామి వారు ప్రతి రోజు మణికర్ణికా ఘాట్లో మాధ్యాహ్నిక స్నానం చేసి సంధ్య వార్చుకుంటారు అంటుంటారు.సప్తర్షులు మొదలుకుని దేవ, గంధర్వ, యక్ష,కిన్నెర, కింపురుషులు ఇలా ఎందరో ప్రతీ రోజు గంగా స్నానం ఆచరించి విశ్వేశ్వరుడి దర్శనం చేసుకుని,విశాలాక్షీ మత అనుగ్రహం పొంది,అన్నపూర్ణమ్మ తల్లి చేతి ముద్ద తిని,క్షేత్ర పాలకుడు కాళ భైరవుడ్ని దర్శించి తరించాలనుకుంటారు.పురాణాల్లో సైతం పరమేశ్వరుడు మొదట సృష్టించిన నగరం " కాశీ " అని చెప్పబడి ఉంది.అక్కడకు వెళ్ళే అదృష్టం కలిగిన ప్రతి ఒక్కరు ఈ స్నాన ఘాట్లు కనుకున్ని పవిత్ర స్నానం ఆచరించి ధన్యులవుతారు.ఆ స్నాన ఘట్లను దర్శించుకుని తరిద్దాం ....
ఓం నమః శివాయ
అందరం సమయాన్ని చాలా వరకూ కేవలం కాలక్షేపం చేయడానికే వినియోగిస్తుంటాము కదా దానితో పాటుగా ఇలా ఆధ్యాత్మికాభివృద్ధి కోసం కుడా వినియోగించుకోవడం ధర్మం అని ఇలా ఆల్బం రూపంలో పొందుపరచడం జరుగుతున్నది.

No comments:
Post a Comment