మహిమాన్వితమైన శ్రీ భవానీ శంకర స్వామి అలయం.. ~ దైవదర్శనం

మహిమాన్వితమైన శ్రీ భవానీ శంకర స్వామి అలయం..

* కుందూనది తీరాన ఓంకారం ధ్వనితో అలలాడుతున్న పవిత్ర పుణ్యక్షేత్రం..
* సాలగ్రామము తేచ్చి శివలింగాన్ని పుజచేస్తున్న నాగ సర్పం....
* కార్తీక పౌర్ణమి రోజున...పార్వతి పరమేశ్వరుల కళ్యాణం...
.
మీకు తెలుసా ?? పురాతన శివాలయం ఒకటి నవ్యాంధ్ర(ఆంధ్ర ప్రదేశ్) రాష్ట్రంలో ఉందని ..?? అసలు ఇంతకీ ఆ ఆలయం ఎక్కడుందో ... ఆ ఆలయం పూర్వాపరాలు ఏమిటో తెలుసుకంందాం ...
.
.
శ్రీ గంగా గౌరి సమేత శ్రీ భవానీ శంకర స్వామి ఆలయానికి ఘనమైన చరిత్ర ఉంది. ఎందరో రాజులకు ఆరాధ్య దైవమైన ఈ శివాలయం పేరు ప్రఖ్యాతులు సంతరించుకుంది. స్వయంబు పంట భూమి ఉన్నప్పటికీ నైవేద్యం కరువయ్యాయి. ఆ గ్రామంలో ముత్యలు రాశులుగా పోసి అమ్మిన ఘన చరిత్ర ఉంది... చరిత్ర నేడు ఒక కథగానే మిగిలింది. నాడు కళకళలాడిన ఆలయం నేడు శిథిలావస్థకు చేరుకుంది. పట్టించుకునేవారు లేక ఆనాటి అద్భుత కళాసంపద కనుమరుగువుతున్న పరిస్థితి ఏర్పడింది. మిడుతూరు గ్రామంలో వెలిసిన శ్రీ భవానీ శంకర దేవాలయాన్ని క్రీ. శ. 14 వ శతాబ్ధంలో రాజులు నిర్మించారు. నాడు ఆలయంలో పూజలతో వైభవంగా వెలిగింది. గ్రామాన్ని ఆనుకొని ఉన్న నేటి కుందూ నది ఆకాలంలో ఉధృతంగా ప్రవహించేది. నది దాటడానికి సామంతరాజులు పడవలపై రాకపోకలు సాగించేవారని చరిత్ర ద్వారా తెలుస్తుంది. నాటి చరిత్రకు నేడు వాస్తవ పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి.
.
.
కోరిన కోర్కెలు తీర్చే విుడుతూరు శ్రీ భవానీ శంకర స్వామి ... అష్టైశ్వర్యాలు, ఆయుష్షు, వరాలు ఇచ్చే స్వామిగా, భక్తుల కొంగు బంగారంగా కడప జిల్లా లో వేలసిన శ్రీ గంగా గౌరి సమేత శ్రీ భవానీ శంకర స్వామి దేవస్థానం ప్రసిద్ధికెక్కింది. జిల్లాలో పురాతన ఆలయాలలో ఇది ఒకటి... కుందూనది తీరాన ఓంకారం ధ్వనితో అలలాడుతున్న శివాలయం... ! కడప జిల్లా నుండి మైదుకూరు వెళ్లే దారిలో ఖాజీపేట అనే మండలం ఉంది. ఈ మండలం కడప నగరం నుండి సుమారుగా అటుఇటు 20 కి. మీ. దూరంలో ఉండి 30నిముషాలలో చేరుకొనే విధంగా ఉంటుంది. ఖాజీపేట మండలంలోని ఈ మిడుతూరు గ్రామంలో శివాలయం ఎంతో ప్రసిద్ధి చెందినది.
.
.
శ్రీ గంగా గౌరి సమేత శ్రీ భవానీ శంకర స్వామి ఆలయం దక్షణ భారత దేశంలోనే అతి పురాతన ఆలయంగా చరిత్రకెక్కింది. ఈ ఆలయ ప్రాంగణంలో శిలా శాసనాల ద్వార క్రీ. శ. 14 వ శతాబ్ధంలో నిర్మించిన ఆలయాంగా స్థల పురాణం ద్వార తెలుస్తుంది... ఆలయం చుట్టూ కోష్ట విగ్రహాలను అమర్చారు. ఇవి శిథిలావస్థలో ఉన్నపుడు అంతరాళంలో ఉండేవి. ఇక్కడ శివుడు, పార్వతి, కాళబైరవుడు, శివుని విగ్రహం ఎదురుగా వీరబద్రస్వామి, వరాహావతారం, గణపతి, విష్ణుమూర్తి తదితర విగ్రహాలను గమనించవచ్చు. వేలాది మంది చూస్తుండగా ప్రతి సంవత్సరం కార్తీకమాసంలో 3వ సోమవారం రోజున...పార్వతి పరమేశ్వరుల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. శివపార్వతుల పెళ్లిని కళ్లారా చూసిన వారికి భక్తి, జ్ఞానము కలిగి సర్వపాపాలు నశిస్తాయని, కన్యలు ఉత్తమ పురుషుని పొందుతారని, భూతప్రేత పిశాచాలు తొలగటమే కాక మనోవాంఛ సిద్ధిస్తుందని, వైకుంఠప్రాప్తి కలుగుతుందని, సకల భోగభాగ్యాలు క‌లుగుతాయని, సంతానప్రాప్తి కలగటమే కాక సకల కార్యసిద్ధి కలుగుతుందని భక్తుల విస్వాసం...తరువాత అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. అంతేగాక పురాతన నవగ్రహ మండపం కూడ ఇక్కడ కలదు. ఈ ఆలయంలోని బావి లోని నీరు ఏడాది పొడుగునా అత్యంత శుభ్రంగా పారదర్శకంగా ఉంటుంది.
.
.
శ్రీ భవానీ శంకర స్వామి దేవస్థానంలో నైరుతి భాగమున పాణిమట్టం వద్ద పెద్ద రంధ్రముగుండ ఒక పెద్ద నాగ సర్పము సాలగ్రామములను తీసుకోనివచ్చి శివలింగాన్ని పుజచేస్తుందని అక్కడి వారి చెప్పుతారు. గర్భగుడికి ముందున్న నవరంగ మంటపంలో అత్యంత అద్భుతంగా శిల్పకళ నొప్పారే నంది విగ్రహం ఉంది. కర్నూలు జిల్లా యాగంటిలోని నంది విగ్రహానికి ఈ విగ్రహానికి సంబంధముందనీ చరిత్రకారులంటారు. యాగంటి నందీశ్వర విగ్రహం రంకే వేస్తుందని కాలజ్ఞానవేత్త బ్రహ్మం గారన్నట్లు చెప్తారు. యాగంటి నందీశ్వరుడు రంకె వేసినప్పుడు మిడుతూరు లోని శ్రీ భవానీ శంకర అలయంలో ఉన్న నందీశ్వరుడూ కూడ రంకె వేస్తాడనే కథనము ఉంది.
.
.
అలయ చరిత్ర:...
చెంచు కులస్థుడైన శివభక్తుడు విుడతడి భక్తికి మెచ్చి కైలాసనాదుడు.. ఒక్కరోజు మిడతడు రావి చెట్టు క్రింద నిద్రిస్తుండగా కలలో కనిపించి .. దగ్గర్లోనే ఉండే కుందూ నది ఓడ్డు తీరాన నా శివలింగా విగ్రహం ఉన్నదనీ, వెంటనే బయటికి తేచ్చి తన కోసం ఓ ఆలయాన్ని నిర్మించాలనీ ఆదేశించాడట పరమ శివుడు. నిద్రలేచి చూసేసరికి ఆ భక్తుడికి కొద్ది దూరంలోనే ఓ నాగసర్పం శివలింగాన్నిచుట్టుకొని ఉండడం కనిపించిందట. వెంటనే ఆ శివభక్తుడైన విుడతడు.. మరికొంత మంది గ్రామస్థుల సహాయంతో కుందూనది వడ్డు తీరాన ఉన్న శివలింగాన్ని బయటి తేచ్చి కుందూనది వడ్డుపై ఆలయాన్ని నిర్మించి పూజించడం ప్రారంభించారని స్థలపురాణం చెబుతోంది. మిడతడి శివ భక్తికి మేచ్చిన గ్రామస్థుల తమ గ్రామానికి మిడతడు అని నామకరణం చేసినారు. కాలక్రమేనా మిడతడు గ్రామంను విుడుతూరు గ్రామంగా పిలవబడుతుంది.
.
.
పరీక్షిత్తు వంశాన్ని నిర్విర్యం చెయడానికి జనమేజయుడు చేసిన సర్పయాగ పాప పరిహారార్థం శుక మహర్షి ఆదేశం పై మిడుతూరు గ్రామంలోని క్రీ. శ. 14 వ శతాబ్ధంలో శ్రీ భవానీ శంకర దేవస్థానము నిర్మించి శివునికి పూజలు నిర్వహించినట్ల చరిత్ర ద్వారా తెలుస్తుంది. చోళులు, పల్లవులు, కృష్ణదేవరాయలు ఆ తర్వాతి కాలంలో ఆలయాన్ని అభివృద్ధి చేశారని అనంతరం భీమసేనరాజు దేవస్థానమును పరిపాలించేవారని... చరిత్ర ద్వారా తెలుస్తుంది.
.
.
ఈ మహిమాన్వితమైన శ్రీ భవానీ శంకర స్వామి అలయానికి గుడికట్టు శాస్త్రం ప్రకారం ఈ ఆలయం శిథిలా వస్థకు చేరుకుంటే జీర్ణోద్ధరణ చేసి పునర్నించేందుకు అనాటి సామంత రాజులు ఒక నిధిని ఉంచడం జరిగిందని.. ఆ నిధి ఉన్నట్లు గుర్తుగా నిధి ఎక్కడ వున్నది ఒక శిలాశాసనాన్ని ఉంచినట్లు కొంత మంది వాళ్ళతరతరాలుగా వారి కుటుంబ పెద్దలు ఆనిధి గురించి చేప్పేవారని ప్రస్తుతం ఆ శిలాశసనం ఎక్కడ ఉందో తెలియదని, కొందరైతే పూర్వం కుందూనది ఉధృతంగా ప్రవహించినప్పుడు ఆ శిలాశాసనాలు నీటిలో కొట్టుకు పోయి ఉండవచ్చు అని అక్కడి పెద్దలు చేప్పుతారు.
.
.
నిత్యం జరిగే దూప, దీప నైవేధ్యాల పూజల కోసం దాదాపు 63 ఎకారాల పంట భూమిని సామంతరాజైన భీమసేనరాజు ఉచితంగా శివునికి మాన్యంగా ఇవ్వడం జరిగింది. కాల క్రమేన ఇప్పడు కేవలం 5 ఎకారాల 30 సెంట్ల మాత్రమే పంట సాగులో కలదు.. తరువాత కాలంలో ముస్లిముల పాలనలో ఈ మిడుతూరు గ్రామంలోని శ్రీ భవానీ శంకర దేవస్థానము పడగోట్టడం జరిగింది. కొన్ని సంవత్సరాల తరువాత సంప్రదాయ బ్రాహ్మణులతో శ్రీ గంగా గౌరి సమేత శ్రీ భవానీ శంకర స్వామి అలయాన్ని మల్లన్న భార్య మాత కామాక్షమ్మ పున ప్రతిష్ఠంపజేసి శివ పార్వతుల కళ్యాణం జరిపించడం జరిగినది.

Share:

Related Posts:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive