* "హరహరశంభో" అంటూ శివుణ్ణి స్తుతిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి....
* సోమవారం శివాలయాలను దర్శించడం సర్వ పాపాలకు నుంచి విముక్తి...
* కార్తీక సోమవారం నాడు శివాలయాల్లో నేతితో
దీపాలను వెలిగించండి దీర్ఘసుమంగళీ ప్రాప్తం లభిస్తుంది...
* సోమవారం శివాలయాలను దర్శించడం సర్వ పాపాలకు నుంచి విముక్తి...
* కార్తీక సోమవారం నాడు శివాలయాల్లో నేతితో
దీపాలను వెలిగించండి దీర్ఘసుమంగళీ ప్రాప్తం లభిస్తుంది...
హిందూ మతంలో కార్తీక మాసం ప్రత్యేకమైనది. సాక్షాత్తు భగవంతుడు శివునికి పరమపవిత్రమైన మాసం ఇది. ఈ నెలలో సోమవారం నాడు ఉపవాసం ఉండి భగవంతుని పూజించి దానధర్మలు చేసినవారికి పాపాల నుంచి విముక్తి లభించడమే కాకుండా మోక్షం లభిస్తుందని అంటారు. కార్తీక మాసం సోమవారం నాడు ప్రారంభం అయితే అది ఒక విశేషం.
సోమవారం పూట కార్తీక మాస ప్రారంభం శుభఫలితాలకు సంకేతమని పురోహితులు చెబుతున్నారు. అందుచేత కార్తీక సోమవారం శివాలయాలను దర్శించడం చాలా మంచిది.
ఈ వారంలో ముత్తైదువులు భక్తిశ్రద్ధలతో శివునిని కొలిస్తే మాంగళ్య భాగ్యం చేకూరుతుందని విశ్వాసం. ఇంకా చెప్పాలంటే ఈ సోమవారాల్లో శైవభక్తులు నిష్టనియమాలతో శివునిని ఆరాధిస్తారు. సోమవారం సూర్యోదయానికి పూర్వమే బ్రహ్మీముహూర్తమున స్నానమాచరించి "హరహరశంభో" అంటూ శివుణ్ణి స్తుతిస్తే పాపాల నుంచి విముక్తి లభించడంతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ మాసమంతా ఉపవాసముండి శివునిని కొలిస్తే కైలాసవాసం సిద్ధిస్తుందని శాస్త్రోక్తం.దీనినే కార్తీకనత్తాలు అంటారు.
సోమవారం ఉదయం స్నానాదికార్యక్రమాలను పూర్తి చేసుకుని, పొడిబట్టలు ధరించి మొదటగా దీపారాధన చేయాలి. అనంతరం శివునికి రుద్రాభిషేకం చేయించి శివవ్రత నియమాలను పాటించాలి. ఈ విధంగా చేయడం ద్వారా నిత్య సిరిసంపదలతో, సుఖసౌఖ్యాలతో వర్ధిల్లుతారని విశ్వాసం.
కార్తీక సోమవారం నాడు శివాలయాల్లో నేతితో దీపమెలిగించే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. సోమవారం సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో సుప్రసిద్ధ ఆలయాలు లేదా సమీపంలోని ఆలయాలకు చేరుకుని పంచముఖం గల దివ్వెలతో దీపాలను వెలిగించడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయని పెద్దలు చెబుతున్నారు.
కార్తీక సోమవారం శివునికి ప్రీతికరం కావడంతో శివాలయాలను దర్శించడం శుభమని అంటారు. ఈ మాస ప్రారంభం నుంచి సూర్యోదయానికి ముందే లేచి స్నానమాచరించి, స్త్రీలు నదులలో, కోనేటిల్లో దీపాలు వదులుతారు. కార్తీక మాసంలో దీపాన్ని దానం ఇస్తే... మాంగల్యబలం, కీర్తి సౌభాగ్యాలు కలుగుతాయని విశ్వాసం.
కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని ప్రముఖ శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతాయి. కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు, చవితి, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి, అత్యంత పుణ్యప్రదం కావడంతో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి, దీపారాధన చేస్తారు.
సుప్రసిద్ధ శ్రీశైలం వంటి ఆలయాల్లో భక్తుల తాకిడి పెరుగుతుంది. కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని ప్రసిద్ధ శివాలయాల్లో భక్తులు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు. కాగా కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు, చవితి, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి రోజుల్లో పవిత్రపుణ్య నదీ స్నానమాచరించి, ఉపవాస దీక్షలు చేస్తూ లలిత, విష్ణు సహస్రనామ పారాయణలు, ప్రతినిత్యము ఉభయ సంధ్యలలో దీపారాధన ఆచరించిన వారికి అనంత కోటి పుణ్యఫలం లభిస్తుందని పెద్దలు అంటున్నారు.
No comments:
Post a Comment