బ్రహ్మానందము. ~ దైవదర్శనం

బ్రహ్మానందము.

బ్రహ్మానందమునకు కొలతలు చెప్పిన యెడల అది ఉన్నదున్నట్లున్న సత్యము కాదు. అయినను పరిశీలించెదము.

1. మనుష్యానందము :

ఉత్తమ ఆశయములు, దృఢమైన సంకల్ప శక్తి కలవాడు, బలిష్ఠుడు, వేదాధ్యయన సంపన్నుడు, సద్గుణశాలి, నడి యవ్వనములోనున్న ఏక ఛత్రాధిపతి, ఐశ్వర్యవంతుడు అయినట్టి మానవుని ఆనందము. మానవులలోకెల్లా అధికాధిక ఆనందమును అనుభవించు మానవుని ఆనందము. ఇది కారణముతో కూడిన ఆనందము. కారణము నశించిన ఉండనిది.

2. మనుష్య గంధర్వ ఆనందము : పై చెప్పిన మనుష్యానందమునకు నూరు రెట్లు అధికము.

3. దేవగంధర్వానందము : ఇది మనుష్య గంధర్వానందమునకు నూరు రెట్లు అధికము.

4. చిరలోక వాసులగు పితరుల ఆనందము : దేవ గంధర్వ ఆనందము కంటె నూరు రెట్లు అధికము.

5. అజానజుల ఆనందము : పితరుల ఆనందము కంటే నూరు రెట్లు అధికము.

6. వైదిక కర్మల చేత దైవత్వము పొందిన కర్మ దేవతల ఆనందము :

అజానజుల ఆనందముకంటె నూరు రెట్లు అధికము.

7. దేవతల ఆనందము : కర్మ దేవతల ఆనందము కంటె నూరు రెట్లు అధికము.

8. ఇంద్రుని ఆనందము : దేవతల ఆనందము కంటె నూరు రెట్లు అధికము.

9. బృహస్పతి ఆనందము : ఇంద్రుని ఆనందము కంటే నూరురెట్లు అధికము.

10. ప్రజాపతి ఆనందము : బృహస్పతి ఆనందముకంటె నూరు రెట్లు అధికము.

11. హిరణ్యగర్భుని ఆనందము : ప్రజాపతి ఆనందము కంటె నూరు రెట్లు అధికము.

12. బ్రహ్మానందము : హిరణ్యగర్భుని ఆనందము కంటె నూరు రెట్లు అధికము.

13. కామరహితుడైన బ్రహ్మవేత్త ఆనందము : బ్రహ్మానందముతో సమానమైన ఆనందము.

14. విజ్ఞాన స్వరూపుడు : ఆనందమే తానైనవాడు. ఆనంద కారణములు లేనివాడు.

15. అచల పరిపూర్ణుడు : ఆనంద రహితుడు, భ్రాంతి రహితుడు, బట్టబయలు.
Share:

Related Posts:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive