కుండలినీ సిద్ధ మహా యోగం - కుండలినీ జాగరణ అవస్థలు - దర్దూర అవస్థ (2). ~ దైవదర్శనం

కుండలినీ సిద్ధ మహా యోగం - కుండలినీ జాగరణ అవస్థలు - దర్దూర అవస్థ (2).

మన  శరీరమునందలి కోశికలు, కండరాలలో... ఉధృతమైన విద్యుత్ ప్రవాహపు చలనాలు,  కండరాలలో సైతము  కప్పగంతులు వేస్తున్నట్లు అనుభూతిని కలగజేస్తాయి. ఈ దశలోనే సాధకుడు తన కండరాలలో మరింత పెద్ద పెద్ద కుదుపులను, గంతులను అనుభవిస్తాడు. కొంతమంది సాధకులు అయితే, తమ ఆసనము నుండి విసిరి వేయబడడం జరుగుతుంది. కండరాలు ప్రేరేపించబడినవై, కప్పగంతుల మాదిరి తమలో తాము చలించడానికి కారణం... అదనపు విద్యుత్ శక్తి విడుదల కావడమే. ఇది కుండలిని జాగృతం నందలి ప్రథమ అవస్థ కన్నా ఉన్నతమైన... ద్వితీయ
 అవస్థ. సాధకుడు సాధనలోని ఈ రకమైన ప్రగతికి  ప్రగతికి భయపడరాదు. కొందరు సాధకులకు తమ కండరాలు బద్దలవుతున్నట్లుగానూ,  నిజానికి అదే అవస్థ  కొంతకాలం కొంతకాలం కొనసాగుతుండడం వలన,  దినచర్యకు సంబంధించిన పనులకు ఇబ్బంది కలుగును. అటువంటి సాధకులు పైన తెలిపిన అసౌఖ్యాన్ని శాంతింపజేసి కొనుటకై అనుభవజ్ఞుడైన యోగిని ఆశ్రయించ వలెను.
 కుండలిని జాగృతం యొక్క ఈ దర్దూర  అవస్థను సరిగ్గా నియంత్రించక పోయినట్లయితే,  కొంతమంది సాధకులకు కండరముల సంకోచము మరియు కంపనములు అలాగే ఉండిపోతాయి. అందుచేత తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే మధ్యలో వచ్చిన ఇటువంటి కంపనముల వలన  జీవితమంతా బాధపడుతూ... దినచర్యలకు అనర్హులైన కొంతమంది వ్యక్తులను ఈ వ్యాసకర్త చూడడం జరిగింది. ఈ బాధను పొందినవారు  ఉచిత రీతిన నూనె మర్దనము  చేయుచూ... శరీరాన్ని ముందుకు వెనుకకు ప్రక్కలకు వంచ గల ఆసనాలయిన గరుడాసనం, ధనురాసనం, సర్వాంగాసనం, మత్స్యాసనం, సర్పాసనం మరియు శలభాసనం  వంటి ఆసనములను అభ్యసించుట మంచిది. ఇటువంటి కంపనము లను  శాంతింప చేయగల యోగనిద్రను కూడా అభ్యసించవలెను.
Share:

Related Posts:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive