ఆవుమూత్రం వలన ఉపయోగాలు. ~ దైవదర్శనం

ఆవుమూత్రం వలన ఉపయోగాలు.


 * ప్రతినిత్యం వడకట్టిన గోమూత్రం 25 మిల్లీలీటర్లు  చొప్పున తాగుచుండిన శ్లేష్మము వలన కలిగిన వ్యాధులు అన్నియు హరించును .

 * ఎన్ని సార్లు విరేచనములు అవ్వవలెను అనుకున్న అన్నిసార్లు గోమూత్రమును గుడ్డతో వడకట్టి 30 మిల్లీలీటర్లు నుంచి 50  మిల్లీలీటర్లు ఉదయాన్నే ప్రాతఃకాలం నందు తాగుచున్న యెడల విరేచనములు అగును.

 * గోమూత్రంతో కొంచం పటికబెల్లం పొడి , కొంచం ఉప్పు కలిపి ప్రతినిత్యం తాగుచున్న ఉదరవ్యాధులు అన్నియు హరించిపోవును.

 *  10  మిల్లీలీటర్లు గోమూత్రంలో ఒక చిటికెడు పసుపు చూర్ణం కలిపి పూటకొక్క మోతాదుగా రోజూ రెండుపూటలా తాగించుచున్న యెడల చిన్నపిల్లలకు కలిగే కడుపుబ్బరాలు హరించిపోవును .

 * వడకట్టిన గోమూత్రం 35 మిల్లీలీటర్లు ప్రతినిత్యం ప్రాతఃకాలం నందు త్రాగుచుండిన యెడల పాండువ్యాధి 20 నుంచి 40 రోజుల్లో హరించిపోవును .

 * గోమూత్రం గోరువెచ్చగా చేసి ఆ గోమూత్రంతో చెవులను శుభ్రపరుచుచుండిన చెవి నుండి చీముకారుట హరించిపోవును .

 * గోమూత్రం 40 మిల్లీలీటర్లు పూటకొక్క మోతాదుగా రోజూ రెండు పూటలా త్రాగించుచున్న యెడల స్త్రీలకు సూతికా వ్యాధి వచ్చిన పిమ్మట కలిగే శరీరం వాపు , గర్భాశయం గడ్డ వలే గట్టిగా అయ్యే సమస్య హరించి ఆరోగ్యంగా ఉండును.

 * నేలవేము రసం గోమూత్రం 30 మిల్లీలీటర్లు కలిపి పూటకి ఒక మోతాదుగా రోజూ రెండుపూటలా తాగుచుండిన యెడల జీర్ణజ్వరాలు , పాండువ్యాధులు , వళ్ళు వాపులు 7 రోజుల్లోనే అంతరించిపోవును .

 * ప్రతినిత్యం ప్రాతఃకాలం నందు 20 మిల్లీలీటర్లు  గోమూత్రం 125 మిల్లీలీటర్ల  నీటిలో కలిపి తాగుచుండిన యెడల మూత్రం బిగింపు హరించి మూత్రం ధారాళముగా వెడలుచుండును.

 * ప్రతినిత్యం ప్రాతఃకాలం నందు గోమూత్రం 30 మిల్లీలీటర్లు , 20 గ్రాములు పటికబెల్లం పొడి కలిపి తాగుచుండిన యెడల మలబద్దకం హరించును . నోటికి రుచి తెలియని అరుచి అను రోగమును కూడా పోగొట్టును .

 * పత్ర తాళకం , బావంచాలు , మాల్కంగిని గింజలు సమాన భాగాలలో తీసుకుని గోమూత్రంతో కలిపి నూరి చిన్నచిన్న గోళీల వలే చేసి గాజుసీసాలో భద్రపరచుకొనవలెను. అవసరం వచ్చినప్పుడల్లా అందొక గోళీని నిమ్మపండు రసంతో అరగదీసి బొల్లిమచ్చలపైన  లేపనం చేయుచుండిన బొల్లి మచ్చలు రెండు నుంచి మూడునెలల్లో హరించిపోవును .

 * గోమూత్రం శరీరమునందలి వాతశ్లేష్మములను హరించును .

 * శరీరం నందలి క్రిములను , గుల్మములను , ఉన్మాదరోగాలను హరించును .

 * చర్మరోగాలు పైన కూడా అత్యద్భుతంగా పనిచేయును .

  ఆవుపేడతో ఉపయోగాలు  -

 * ఆవుపేడ రసం 70 మిల్లీలీటర్లలో 125 మిల్లీలీటర్ల ఆవుపాలు కలిపి తాగించుచుండిన గర్భము నందు చచ్చిన పిండము బయటపడును.

 * ఆవుపేడను వెచ్చచేసి గుదస్థానం నందు కాపడం పెట్టుచున్న ముడ్డితిమ్మిరి హరించును .

 * ఎండించిన ఆవుపేడ చూర్ణం ఉప్పుతో నిలువ ఉంచిన కుండ పెంకు చూర్ణం రెండు సమభాగాలుగా కలిపి నూరి ఈ చూర్ణంతో వళ్ళు నలగబెట్టుకొనుచుండిన యెడల అతిచెమట సమస్య తీరును .

 * ఆవుపేడ వంటికి పట్టించుకోని మర్దన చేసి ఒక గంట ఆగి ఆ తరువాత వేడినీటితో స్నానం చేయుచున్న యెడల దురదలు తగ్గును.

 * వస్త్రగాలితం పట్టిన ఆవుపిడకల బూడిదను మశూచికం పొక్కులపైనా , పుళ్లపైనా చల్లుచుండిన యెడల అవి త్వరగా మానును .

 * ఆవునెయ్యితో వస్త్రగాలితం పట్టిన ఆవుపేడ పిడకల బూడిద కలిపి రాయుచున్న పుళ్ళు త్వరగా మానును .

 * వండుకున్న ఆహారపదార్థాల గిన్నెలను ఆవుపిడకలు కాల్చిన బూడిద పైన ఉంచిన చీమలు పట్టకుండా ఉండును.

 * 20 గ్రాముల ఆవుపేడ పిడకల బూడిదని 100 మిల్లీలీటర్ల నీళ్లలో కలిపి వడపోసి ప్రతినిత్యం ప్రాతఃకాలం నందు తాగుచున్న కడుపు ప్రేగుల్లోని క్రిములు అయిదారురోజుల్లోనే హరించిపోవును .

 * ఆవుపేడతో చేయబడిన పిడకలను నిప్పుల్లో కాల్చి నీళ్ళల్లో వేసిన బొగ్గువలే అగును. ఆ బొగ్గును ఎండించి మెత్తటి చూర్ణంగా చేసి భద్రపరుచుకొని ఆ చూర్ణంతో ప్రతినిత్యం పండ్లు తోముకొనుచుండిన యెడల దంతములలోని క్రిములు , చిగుళ్లవాపులు హరించును . దంతాలు ఆరోగ్యంగా ఉండును.

 * ఆవుపేడ రసం ౩౦ మిల్లీలీటర్లు నీళ్లతో కలిపి తాగిన కలరా నయం అగును.

  ఆవుపెరుగు వలన ఉపయోగాలు  -

 * ఆవుపెరుగు లో కాని , ఆవు మజ్జిగలో కాని సమభాగంగా మంచినీరు కలిపి తాగుచున్న యెడల అజీర్ణం వలన కలిగిన విరేచనాలు తగ్గును.

 * ఆవుపెరుగు తాగుచున్న యెడల గాజుచూర్ణంగాని , గాజుముక్కలుగాని పొరపాటున లొపలికి పోయిన కలిగే బాధలు తగ్గును.

 * పాత ఇటుకను శుభ్రముగా తుడిచి దానిని నిప్పులలో వేసి కాల్చి ఆవుపెరుగులో ముంచవలెను. ఆ తరువాత ఆ ఇటుకను తీసివేసి ఆ ఆవుపెరుగును కొంచంకొంచం లొపలికి తీసుకొనుచుండిన అతిదాహం తగ్గును.

 * ఆవుపెరుగులో పటికబెల్లం పొడి కలిపి త్రాగించుచున్న యెడల గన్నేరుపప్పు విషం హరించి ప్రాణాలు నిలబడును.

 * సూర్యోదయం కాకమునుపే ఆవుపెరుగు , అన్నం కలుపుకుని తినుచున్న పార్శ్వపు నొప్పి తగ్గును. ఇలా వరసగా మూడురోజులు చేయవలెను .

         పైన చెప్పిన ఫలితాలు నాటు ఆవు కి సంబంధించినవి వాడినప్పుడే ఫలితాలు పొందగలము. సంకరజాతి ఆవుల వలన ఎటువంటి ఫలితము ఉండదు. మొరొక్క ముఖ్యవిషయం ఆవుని బయట మేతకు వదలడం వలన అన్నిరకాల మొక్కలు తినటం వలన ఆవుకి సంబంధించిన పాలు , నెయ్యి, మూత్రం, పేడ , పెరుగు వీటికి విశేష ఔషధ లక్షణాలు సంప్రాప్తినిచ్చును. ఒకేచోట కట్టి ఉంచి ఆహారం ఇచ్చు ఆవులకు అంత శక్తి ఉండదు.                
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List