మంత్రము. ~ దైవదర్శనం

మంత్రము.

సత్యాన్నాస్తి పరో ధర్మః సత్యం,జ్ఞానమనంతం బ్రహ్మ
సత్యేన వాయుర్వాతి సత్యే నాదిత్యో రోచతే
దివి సత్యం వాచా ప్రతిష్ఠా సత్యే సర్వం ప్రతిష్టితం
తస్మాత్సత్యం పరమం వదంతి సత్యం పరం వరం సత్యం
సత్యేన న సువర్గా ల్లోకా చ్యవంతే కదాచన
శతం హి సత్యం తస్మాత్సత్యే రమంతే

అర్థము:-సత్యమును మించినధర్మము లేదు. సత్యమే జ్ఞానము ,అనంతము నైన బ్రహ్మ స్వరూపము సత్యము వల్లనే వాయువు వీచు చున్నది.సత్యము వల్లనేసూర్యుడు ప్రకాశించు చున్నాడు.సత్యము వల్లనే వాక్కు శాశ్వత మవుతూంది.సత్యమందేసర్వ జగత్తు సుప్రష్టితమై వున్నది.కావున సత్యమే సర్వ శ్రేయంబైన ధర్మము.సత్యమే ఉత్కృష్టము.శ్రేష్ఠమైనదీ సత్యమే సత్యము వల్లనే స్వర్గాదుల నుండి మానవులు చ్యుతులు కాకుండా వుందురు.సత్యమే శాశ్వతము.అందుచేతనే మహాత్ములు సత్యము నందే రమించు చున్నారు.

సత్యం దమ స్తప శ్సౌచం సంతోషో హ్రీ: క్షమార్జవం
జ్ఞానం శమో దయా ధ్యానం ఏష ధర్మ స్సనాతనః

అర్థము:-సత్యము,యింద్రియ నిగ్రహము,తపము,శుచి,సంతోషము,లజ్జ,ఓర్పు, ఋజుత్వము,జ్ఞానము,
మనో నిగ్రహము,దయ ధ్యానము-- వీటిని కలిగి వుండవలెను.యిదియే సనాతన ధర్మము.

సత్యం మృదు ప్రియం ధీరో వాక్యం హితకరం వదేత్
ఆత్మోత్కర్ష స్తదానిందాం పరేషాం పరివర్జతే
అర్థము:-- మృదువుగా,ప్రియముగా, ధైర్యము గా,హితకరముగా సత్యము పలుకుటనభ్యసించుము. నిన్ను నీవు పోగడుకోనుట,పరులను నిందించుట విడిచి పెట్టుము.

కేయూరాణి న భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా
న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజా:
వా ణ్యీకా సమలం కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే
క్షీయంతేఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం (భర్తృహరి సుభాషితం)
పురుషులకు భుజకీర్తులు,సూర్యహారములు,చంద్రహారములు మొదలగు సొమ్ములు కానీ స్నానము,చందనము పూసికొనుట,పువ్వులు ముడుచుకొనుట,కురులు దువ్వుకొనుట,మొదలగునవి నేవియు అలంకారమును కలుగజేయవు.శాస్త్ర సంస్కారం  గల వాక్కు యొక్కటే అలంకారమును   కలుగజేయును.సువర్ణ మయాది  భూషణము లన్నియు నశించును.వాగ్భూషణ మొక్కటియే నశించని  భూషణము.

భూషలు గావు  మర్త్యులకు  భూరి మయాంగద తారహారముల్
భూషిత కేశ పాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్
భూషలు గావు పూరుషుని భూషితు జేయు బవిత్ర వాణి వా
గ్భూషణమే సుభూషణము భూషణముల్ నశియించు నన్నియున్ (ఏనుగు లక్ష్మణ కవి అనువాదము) 

ఎవరిలో అయితే అనురాగ సంపత్తి విశేషంగా వ్యక్తమవుతుందో అతడు భగవంతునికి చేరువలో వుంటాడు. అనురాగ సంపత్తి అంటే వివేకం,వైరాగ్యం,భూతదయ,సాధుసేవ,సాధు సాంగత్యం,
భగవంతుడి నామగుణ సంకీర్తనం,సత్య సంధత ఈ గుణాలు కలిగిన వ్యక్తీ లో భగవంతుడు నెలకొని వుంటాడు మతం భగవంతుడిని దర్శింప చేయ లేనంత వరకూ అది వృథాయే. కేవలం మత గ్రంథాలను మాత్రమె చదివి తృప్తి పడే వాడు తన వీపు మీద పంచదార బస్తాలను మోస్తున్నా అందులోని తియ్యదనాన్ని యెరుగని గాడిద లాంటివాడు (రామకృష్ణ పరమహంస)
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List