పార్థ సారథి దేవాలయం. ~ దైవదర్శనం

పార్థ సారథి దేవాలయం.

చెన్నైలోని పార్థ సారథి దేవాలయం ప్రసిద్ధ వైష్ణవ దేవాలయాలలో ఒకటి. ఈ దేవాలయం చెన్నై నగరం ట్రిప్లికేనులో ఉంది. ఈ ఆలయాన్ని 108 వైష్ణవ దివ్య క్షేత్రాలలో ఒకటిగా చెబుతారు. ఈ దేవాలయం ఎనిమిదో శతాబ్దానికి చెందినది చరిత్రకారుల అంచనా. సంస్కృత భాషలో పార్థసారధి అంటే పార్థుడు = అర్జునుడు యొక్క సారథి = రథాన్ని నడిపినవాడు అని అర్థం అంటే శ్రీ కృష్ణుడు.
స్థల పురాణం
సుమతి అనే మహారాజుకి ఇచ్చిన మాట ప్రకారం వేంకటేశ్వర స్వామి పార్థసారధిగా ఇక్కడ వెలసినాడని అంటారు. ఈ పార్థసారధి విగ్రహాన్ని ఆత్రేయ మహర్షి ప్రతిష్టించాడని చెబుతారు. ఇంకో కథ ప్రకారం శ్రీ రామానుజాచార్యుల తల్లిదండ్రులు ఇక్కడకు వచ్చి సంతానం కొరకు స్వామిని వేడుకొనగా రామానుజాచార్యుడు జన్మిస్తాడు. మరో కథ ప్రకారం పార్థసారథి స్వామి ధర్మ సంస్థాపనకు విశిష్టాద్వైతాన్ని ఆవిష్కరించడానికి రామానుజాచార్యులగా జన్మించాడని చెబుతారు. బ్రహ్మాండ పురాణం ప్రకారము ఈ క్షేత్రానికి తిరుఅల్లికేని అని పేరని, కాలక్రమంలో ఇది ట్రిప్లికేన్ గా మారిందని అంటారు.
మూల విరాట్టు పార్థసారధి విగ్రహం విశిష్టత
మహాభారత ఇతిహాసం ప్రకారం శ్రీకృష్ణుడు కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుని రథసారధిగా ఉంటాడు. కురుక్షేత్ర సంగ్రామ ప్రారంభంలో అర్జునుడు ఇరువైపుల ఉన్న బంధువు యుద్ధ సంగ్రామంలో మరణిస్తారని తలచి అస్త్రాలను విడిచి పేడుతుంటె కృష్ణుడు భగవద్గీతను భోధించి అర్జునున్ని యుద్ధానికి సమాయత్తం చేస్తాడు. కురుక్షేత్రంలో పాల్గొన్న ఆనవాళ్ళను తెలియజేస్తూ ఇక్కడి మూల విరాట్టుకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. భీష్ముడు విడిచిన అస్త్రాలు, బాణాలు శ్రీకృష్ణుడికి కూడ తగలడం వళ్ల స్వామి ముఖంపై కొన్ని మచ్చలు ఉంటాయి. సాధారణానికి భిన్నంగా స్వామికి మీసాలు ఉంటాయి. కురుక్షేత్ర సంగ్రామంలో ఆయుధం పట్టనని ప్రతిజ్ఞ చేయడం వల్ల ఈ విగ్రహానికి మహావిష్ణువు ఆయుధమైన సుదర్శన చక్రం ఉండదు. చేతిలో కేవలం శంఖం మాత్రమే ఉంటుంది. పార్థసారధి యాదవుల వంశంలో జన్మించడం వల్ల ఉత్సవ మూర్తిగా ఒక దారుశిల్పం (చెక్క బొమ్మ) మాత్రమే ఉంటుంది. సాధారణంగా ఉత్సవ మూర్తుల విగ్రహాలను పంచలోహాలతో గాని రాతితో గాని తయారు చేస్తారు.
ఆలయ విశేషాలు మరియు అనుబంధ ఆలయాలు
చెన్నై నగరములోని అత్యంత పురాతనమైన దేవాలయాలలో పార్థసారథి దేవాలయం ఒకటి. ఈ దేవాలయానికి రెండు వేర్వేరు ధ్వజ స్థంభాలు ఉన్నాయి. ఒకటి గర్భగుడికి ఎదురుగా, మరొకటి నరసింహ స్వామి దేవాలయానికి ఎదురుగా ఉన్నాయి. ఆలయ గోపురము, మండపాలు ద్రవిడ ఆలయ నిర్మాణ శైలిలో నిర్మించబడ్డాయి.
ఈ దేవాలయ ప్రాంగణములో ఉన్న అనుబంధ గుళ్ళు
• వేదవల్లి గుడి
• రంగనాథ స్వామి గుడి
• శ్రీరాముని గుడి
• వరదరాజస్వామి గుడి
• నరసింహ స్వామి దేవాలయం
• ఆండాళ్ళమ్మ గుడి
• అంజనేయ స్వామి దేవాలయం
• అళ్వార్ల సన్నిధి
• రామానుజాచార్యుల సన్నిధి
• భృగు మహర్షి గుడి
పండుగలు
• చైత్రై (ఏప్రిల్-మే) అనే తమిళ మాసంలో స్వామి బ్రహ్మోత్సవాలు జరుతాయి.
• ఆణి(జూన్-జూలై) అనే తమిళ మాసంలో అయగియసింగార్ ఉత్సవాలు జరుగుతాయి.
• రామానుజాచార్యుల గురించి ప్రత్యేక ఉత్సవాలు ఏప్రిల్- మేలో జరుతాయి.
• మణవలమ్ముణిగళ్ (అక్టోబరు-నవంబరు) ఆళ్వార్లకు, ఆచార్యులకు ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి.
• వైకుంఠ ఏకాదశి మరియు చైత్త్రై మాసం ఇక్కడ ప్రత్యేక విశేషం. ఈ కాలములో భక్తులు అసంఖ్యాకంగా స్వామి దర్శనం చేసుకొంటారు.
• స్వామి ఉభయ నాంచారులతో ఉత్సవమూర్తిగా ఉరేగింపుగా వెళ్ళేటప్పుడు ఆయన దర్శనం నయనానందం చేస్తుంది.
• పవిత్ర దినాల్లో ఆలయ మండపాలలో అనేక పురాణ సంబంధిత కథా కాలక్షేపాలు జరుగుతూ ఉంటాయి.
స్వామి పుష్కరిణి
దేవాలయానికి ఎదురుగా ఉన్న తటాకం లేదా పుష్కరిణిని కైరవిణి (తెలుగులో తెల్లటి మల్లెపూవు) అని పిలుస్తారు. తెల్లని మల్లెపువ్వు భగవంతుడుని అర్చించడానికి అత్యంత పవిత్రమైన పుష్పము. ఈ కైరవిణికి అనుసంధానంగా ఇంద్ర, సోమ, మీనా, అగ్ని, విష్ణు అనే ఐదు తీర్థాలు ఉన్నాయి.
ఈ ఆలయంలో వేరుశెనగ నూనె మరియు మిరప కాయలు నిషిద్ధం

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List