* ప్రపంచానికి కాలజ్ఞానం ద్వార జ్ఞానామృతాన్ని పంచిన రవ్వలకొండ..
* బ్రహ్మం గారు కాలజ్ఞానం రచన రవ్వలకొండ ఇక కనుమరుగు అవుతుందా..!!
* నాడు ఆనందాశ్రమం నేడు రవ్వలకొండ..
.
బ్రహ్మం గారు సాక్షాత్ దైవ స్వరూపులు.. రాబోయే కాలంలో జరగబోయే విపత్తుల గురించి తన కాలజ్ఞానం లో సుస్పష్టంగా వివరించి, జనులన్దరిని సన్మార్గం లో నడువమని బోధించిన మహిమాన్వితుడు., చరితకారుల కాలజ్ఞాన పరిశోధన పలితంగా, బ్రహ్మం గారు చిన్నతనములోనే తల్లిదండ్రులను కోల్పోయి అత్రి మహాముని ఆశ్రమం లో చేరుకున్నారు. కర్ణాటక లోని పాపాగ్ని మఠాధిపతి యనమదల వీరభోజయచార్యులు, సతీ సమేతంగా సంతాన భాగ్యం కోసం పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ అత్రి మహాముని ఆశ్రమం చేరుకుంటారు. సంతాన ప్రాప్తి కై పరితపుస్తున్న ఆ పుణ్య దంపతుల చెంతకు, దైవ స్వరూపులు అయిన బ్రహ్మం గారిని అత్రి మహాముని అందజేస్తారు.
.
వీరభోజయాచార్య, ఈ బాలుడు, మహిమాన్వితుడు, మునుముందు, ఈ బాలుడు ఎన్నో వింతలు చూపించబోతున్నాడు అంటూ ఆ బాలుడుని వీరభోజయాచార్య దంపతులకు అందజేస్తారు. ఆ విధంగా బ్రహ్మం గారు పాపాగ్ని మఠాధిపతి గారింట సనాతన సంప్రదాయాల నడుమ పెరుగుతూ వస్తారు. (ఈనాడు కర్ణాటక లోని పాపాగ్ని మఠం బ్రహ్మం గారి ప్రథమ మఠం గా పేరు గాంచి దివ్య క్షేత్రం గ వెలుగొందుతున్నది.) అతి చిన్న వయసులోనే, బ్రహ్మం గారు కాళికాంబ పై సప్తశతి రచించి అందరిని అబ్బురపరుస్తారు. బ్రహ్మం గారి పదవ ఏట వీరభోజయచార్యులు స్వర్గాస్తులవుతారు. అటు పిమ్మట దేశాటన నిమిత్తమై బయలుదేరబోతు తన తల్లి ఆశీర్వాదాలు కోరతారు. అందుకు, వారి తల్లి, నాయన, వీరంభోట్లయ్య (బ్రహ్మం గారు చిన్న నాడు వీరంభోట్లయ్య గా పిలువబడ్డారు, పాపాగ్ని ప్రస్తుత మఠాదిపతుల వద్ద దీనికి సంబంధించి శాసనాలు వున్నాయి), మఠాధిపత్యం స్వీకరించవలసిన నీవు ఇలా తల్లిని వదిలి పెట్టి దేశాటనకు బయల్దేరితే ఎలాగంటూ శోక సంద్రం లో మునిగి పోతుంది. అప్పుడు బ్రహ్మం గారు, తన తల్లి గారికి సృష్టి క్రమాన్ని వివరించారు. స్త్రీ పురుషుల సంభోగం పవిత్ర కార్యమని, శుక్లాశోనితం తో స్త్రీ గర్భ ధారణ గావిన్చాక, గర్భం ధరించిన ప్రతి నెలలో, కడుపులో శిశువు ప్రాణం పోసే విధానాన్ని కళ్ళకు కట్టినట్టుగా వివరిస్తారు బ్రహ్మం గారు. ఆగామి, ప్రారబ్ద, సంచిత కర్మ సిద్దాంత గురించి వివరించి ఆమెకు మాయ తెరను తొలగించి, లోక కళ్యాణ నిమిత్తమై దేశాటనకు బయల్దేరతారు బ్రహ్మం గారు.
.
కర్నూలు జిల్లాలొని బనగానపల్లె మండలం లోని అచ్చమ్మ ఇంటి దగ్గర ఉదయాన్నే ఇంటి అరుగు మీద నిద్రిస్తున్న బ్రహ్మంగారిని చూసి, ఆయన వివరాలను అడిగి తెలుసుకుంది. తాను బతుకుతెరువు కోసం వచ్చానని, తనకేదైనా పనప్పజెప్పమని కోరగా ... తన దగ్గర ఉన్న పశువులను తోలుకెళ్ళమని చెప్పింది అచ్చమ్మ. అలా పశువుల కాపరిగా మారిన బ్రహ్మంగారు రోజూ రవ్వలకొండపైకి పశువులను తోలుకెళ్లేవారు. ఆ ప్రదేశం ఎంతో ప్రశాంతంగా ఉండటంతో ఇక్కడే కాలజ్ఞానం వ్రాయాలని నిశ్చయించుకొన్నారు. అక్కడే ఒక తాటిచెట్టు ఆకులను తెంచుకొని కాలజ్ఞానం వ్రాసినట్లు చెబుతారు. తాను వెళ్ళి కాలజ్ఞానం రాసుకుంటూ కూర్చుంటే పశువుల సంగతి ఏంకాను? అని గ్రహించిన బ్రహ్మగారు ... వాటిని ఒక మైదానంలో వదిలేసి వాటి చుట్టూ గీత గీశారు. గోవులు ఆ గీతను దాటకుండా మేతమేసేవి.
.
ఒకరోజు మిగతా గోపాలకులు ఈ విషయాన్నీ చూచి భయపడి పరుగు పరుగున, అచ్చమ్మ గారికి ఈ విషయాని చేరవేస్తారు. మరుసటి రోజుగా యథావిధిగా ఆవులను తీసుకుని వెళ్లి చుట్టూ గిరి గీసి రవ్వలకొండ లో కాలజ్ఞాన రచన గావిస్తూ వున్న బ్రహ్మం గారిని చూసి ఆశ్చర్య పోతుంది అచ్చమ్మ. (ఆచమ్మ బ్రహ్మం గారిని దర్శించుకున్న రవ్వలకొండ లో ఈనాడు సుందరమైన బ్రహ్మం గారి దేవాలయం వున్నది). బ్రహ్మం గారి మహిమ తెలుసుకున్న అచ్చమ్మ ప్రుట్టు గుడ్డి వాడిన తన కొడుకు బ్రహ్మానంద రెడ్డి కి చూపు ప్రసాదించమని ప్రార్తిస్తుంది. బ్రహ్మం గారు తన దివ్య దృష్టితో, బ్రహ్మానంద రెడ్డి గత జన్మ పాపాలను దర్శించి, అతనికి చూపు ప్రసాదించి, పాప నివృత్తి గావించారు.
తనకు జ్ఞాన బోధ చేయమని కోరింది. పోతులూరి కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు. అనేక సందర్భాల్లో వేర్వేరు వ్యక్తులకు తెలియజెప్పారు. అంతేకాకుండా చాలా భాగాన్ని ఒకచోట పాతిపెట్టారు. ఆ తర్వాత దానిపైన చింతచెట్టు మొలిచింది. ఆయన కాలజ్ఞానాన్ని ఎందుకు పాతిపెట్టారు? ఇలా ఎందుకు చేశారు? అనే దానికి మాత్రం ఇప్పటివరకు జవాబు దొరకలేదు. గుహలోనుంచి శ్రీశైలం, మహనంది, యాగంటి వెళ్ళటానికి దారులు ఉన్నాయి. ఈ దారి వెంబడి స్వామి వారు ఆ ప్రాంతాలకి వెళ్ళేవారు. బ్రహ్మంగారు ఎందరికో వివిధ సందర్భాలలో జ్ఞాన బోధ చేశారు. వారిలో అచ్చమ్మ, బనగానపల్లె నవాబు, హైదరాబాద్ నవాబు ముఖ్యలు. నవాబులకు వారి దివానాల్లో, అచ్చమాంబకు యాగంటి క్షేత్రంలోని ముచ్చట్ల గుట్ట వద్ద జ్ఞానబోధ చేశారు. కాలజ్ఞానం వ్రాసిన తర్వాత బ్రహ్మంగారు కందిమల్లాయపల్లె చేరి వడ్రంగి వృత్తిచేస్తూ గడిపారు. తనవద్దకు వచ్చినవారికి వేదాంతం వినిపిస్తూ కులమతాలకు అతీతంగా అంతా సమసమాజం బాటన నడవాలని బోధించారు.
.
రవ్వలకొండ చుట్టు మైనింగ్ దందా జోరుగా సాగుతోంది నిబంధనలకు విరుద్ధంగా కంకర క్వారీలు మరియు క్రేషర్లను ఏర్పాటు చేసి కొండ తవ్వుకుపోతున్నా అధికారులకు పట్టడంలేదు. బ్లాస్టింగ్లతో రవ్వలకొండ గుహ దెబ్బతింటున్నా.. గుహలొ బీటలు వారుతున్నా. గుట్టపై నిబంధనలకు విరుద్ధంగా క్వారీని ఏర్పాటు చేశారు. లెక్కకు మించి తవ్వకాలు చేపడుతున్నా పట్టించుకునే వారేలేరు. బ్లాస్టింగ్లతో గుహలోపల స్వయంభు వినాకుడు కూడ రెండుగా పగలడం కూడ జరిగింది. అంతే కాకుండా గుహలోపల బ్రహ్మగారు తవ్విన బావిలో ప్రతి నిత్యము మంచి నీరు ఉబికి బయటకు వస్తువుండేది. కాని ఇప్పుడు బావిలోని నీరు ఇంకి పోతుంది. ఇక కొద్ది నేలలలోనే ప్రపంచానికి కాలజ్ఞానం ద్వార జ్ఞానామృతాన్ని పంచిన రవ్వలకొండ గుహ కనపడకుండ పూర్తిగా శిధిలం కావటమే కాకుండా అలనాటి మాహిమాన్వితమై రవ్వలకొండ గుహ సంభందించిన అనావాళ్ళ మనకు కనపడదు.
.
రవ్వలకొండ చేరుకోవటానికి:..
రవ్వలకొండ చేరుకోవటానికి ముందుగా బనగానపల్లె చేరుకోవాలి. బనగానపల్లె నుండి రవ్వలకొండ కు 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. వీలైతే లోకల్ గా తిరిగే ఆటోలలో లేదా కాలినడకన కొండ పైకి చేరుకోవచ్చు. బనగానపల్లె కు హైదరాబాద్, కర్నూలు, డోన్, నంద్యాల, బెంగళూరు, ప్రొద్దుటూరు, తాడిపత్రి తదితర ప్రాంతాల నుండి ప్రభుత్వ బస్సులలో ఎక్కి చేరుకోవచ్చు.
.
సేకరణ…
మీ..
ఆర్.బి. వెంకటరెడ్డి
భారతీయ సనాతన హిందూ ధర్మ సంరక్షణ సమితి
reddemb@gmail.com
https://www.facebook.com/rb.venkatareddy
No comments:
Post a Comment