లేన్యాద్రిపై వెలసిన గిరిజాత్మక వినాయకుడిని దర్శించేందుకు కూకడ్ నది దాటాలి. నదినుంచి ఆలయానికి 283 చక్కని మెట్లు ఉన్నాయి. విగ్రహం వైకల్యంగా ఉంటుంది. హనుమంతుడు, శివుడు రెండువైపులా ఉంటారు ముఖం కనపడకుండా విగ్రహాన్ని ప్రతిష్టించినందువల్ల వెనుకవైపునుంచి భక్తులు ప్రార్ధనలు చేస్తారు. పూజాదికాలు నిర్వహిస్తారు. అందమైన శిల్పాకృతులు అసంఖ్యాకంగా మరో చిన్న ఆలయం పక్కనే ఉంది. గతంలో ఇది బౌద్ధగుహ అని కొందరంటారు. పార్వతీదేవి పుత్రప్రాప్తి కోసం ఇక్కడే తపస్సు చేసిందని గణపతి పసిబిడ్డగా ప్రత్యక్షమయ్యాడని స్థలపురాణం చెబుతుంది.
.పార్వతీదేవి నలుగు పిండితో వినాయకుడిని చేసి ప్రాణం పోసిన క్షేత్రమే 'గిరిజాత్మక గణపతి' క్షేత్రం. ఈ క్షేత్రం పూణే జిల్లా జున్నర్ తాలూకాలోని 'గోలేగామ్' అనే ప్రాంతంలో విలసిల్లుతోంది. ఇక్కడి 'లేన్యాద్రి' అనే పర్వతంపై ఈ క్షేత్రం దర్శనమిస్తుంది. మానవ నిర్మితమైన దేవాలయంలో కాకుండా, ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన కొండగుహలో స్వామివారు కొలువుదీరి కనిపిస్తారు.
.
ఇక్కడి స్వామివారిని దర్శించుకోవాలంటే దాదాపు మూడువేల మెట్లు ఎక్కవలసి వుంటుంది. అయితే ప్రకృతి రమణీయత ... స్వామి మహిమ కారణంగా పెద్దగా అలసట తెలియదని అంటారు. ఈ పర్వతంపైనే వినాయకుడు తన బాల్య చేష్టలతో పార్వతీదేవికి నయనానందాన్ని కలిగించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ సమయంలోనే వినాయకుడిని విశ్వకర్మ దర్శించుకున్నాడనీ, వినాయకుడికి గౌతముడు ఉపనయన కార్యక్రమం నిర్వహించాడని అంటారు.
.
తనని సంహరించడానికే వినాయకుడు అవతరించాడని తెలుసుకున్న 'సింధురాసురుడు', తన సైన్యాన్ని వినాయకుడి పైకి పంపించాడు. అసుర సేనలను ఈ పర్వతంపైనే వినాయకుడు సంహరించినట్టు స్థలపురాణం చెబుతోంది. కాస్త శ్రమపడి పర్వత పై భాగాన ఉన్న గుహను చేరుకోవాలేగాని, స్వామివారి అనుగ్రహం లభించిన అనుభూతి కలుగుతుంది. అక్కడి నుంచి కనిపించే అద్భుత దృశ్యాలు మనసును మంత్రముగ్ధం చేస్తాయి.
https://www.facebook.com/rb.venkatareddy
No comments:
Post a Comment