మన భారతీయ సంస్కృతిలో పశుసంపదకు విశిష్ట ప్రాధాన్యం ఉన్నందువలన పశుపాలన,గోసంరక్షణకు ప్రసిద్ధి.పాలిచ్చే గోవుకు,పనిచేసే బసవనికి ఎంతో విలువ,పూజనీయత ఉంది.ధాన్యలక్ష్మి ఇంటికి వచ్చే సమయంలో వచ్చే "సంక్రాంతి"పర్వదినాలలో మొదటిరోజు బోగి,రెండోరోజు మకర సంక్రాంతి, ప్రత్యేకంగా మూడోరోజు పశువుల పండుగ చేస్తారు.ఇదే కనుమ ప్రత్యేకత. నాలుగోరోజు ముక్కనుమ.దీనిని దూడల పండుగ అంటారు.కొన్ని ప్రాంతాలలో ముక్కనుమ నాడు గోవులను,ఎద్దులను మాత్రమే పుజిస్తారు.పశువుల పండుగ అంటే పశువులకు విశ్రాంతి.ఆరోజు పొలం పనులు చేయరు.ఉదయమే శుభ్రంగా కడిగి కొమ్ములకు రంగులు పూసి అందంగా అలంకరిస్తారు.కొమ్ములకు మువ్వలు,మెడలో గంటలు కడతారు.
ముక్కనుమ ప్రత్యేకత......
*ముక్కనుమ భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు గడిచిన నాలుగువ రోజున వస్తుంది.
*కనుమ మరునాటిని 'ముక్కనుమ' అని అంటారు. దీనికి బొమ్మల పండుగ అని పేరు.
* ఈ రోజున కొత్తగా పెండ్లి అయిన మహిళలు 'సావిత్రి గౌరివత్రం' అంటే 'బొమ్మల నోము' పడతారు.
*దేవిని తొమ్మిది రోజులు పూజించి తొమ్మిది పిండివంటలతో రోజూ నివేదన చేసిన పిదప ఆ మట్టి బొమ్మలను పుణ్య తీర్థమందు నిమజ్జనం చేస్తారు.
*ముక్కనుమ నాడు సావిత్రి గౌరివ్రతం చేసే మహిళలకు దీర్ఘ సుమంగళీ ప్రాప్తం చేకూరుతుందని విశ్వాసం.

No comments:
Post a Comment