భక్తుల కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం శ్రీబాలాజీ వెంకటేశ్వర స్వామి. ~ దైవదర్శనం

భక్తుల కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం శ్రీబాలాజీ వెంకటేశ్వర స్వామి.

ఆదిలాబాద్ జిల్లా, రెబ్బెన మండలం లోని గంగాపూర్ గ్రామపంచాయితి లోని గంగాపూర్ గ్రామా శివారులోని శ్రీబాలాజీ వెంకటేశ్వరస్వామి దేవస్ధానం చాల పురాతనమైనఆలయం. పచ్చని ప్రకృతి అందాల మధ్య వాగులు వంకల మధ్య స్వామివారిని దర్శనం కొసం ఆదిలాబాద్ జిల్లా నుంచే కాకుండా వేర్వేరు జిల్లాల నుంచి భక్తులు తరలివస్తారు.
.
శ్రీబాలజీ ఆలయ క్షేత్రం చరిత్ర :...
రెబ్బెన మండలంలోని గంగాపూర్ గ్రమపోలిమేరలో ఉన్న గుట్టపై శ్రీబలజీ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని వందల ఏళ్ల క్రితం 16వ శబ్ధతానికి ముందు గంగాపూర్ కు చెందిన విస్వబ్రహ్మణ కులానికి చెందిన పొతజీ నిర్మిచినట్లు గ్రామస్తుల ద్వారా తెలుస్తోంది, పొతజీ చిన్నతనం నుంచి శ్రీబాలజీ వెంకటేశ్వరస్వామిని భక్తితో కొలుస్తూ ప్రతి ఏట మాఘశుద్ధ పొర్ణమి రోజు తిరుపతిలో శ్రీ వెంకటేశ్వరునికి మొక్కులు తీర్చేవాడు. ఆ తర్వాత వయోభారంతో అతని ఆరోగ్యం క్షినిచడం ఆర్ధిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో తిరుపతికి వెళ్ళలేక తీవ్ర మనోవేదనకు గురయ్వోవాడు, ఓ రాత్రి వెంకటేశ్వర స్వామి పొతాజీ కలలో కనిపించి నీలాంటి భక్తుల కోసం గంగాపూర్ పోలిమేర లోని గుట్టబాగం ముందు ఆలయం నిర్మించాలని ప్రతి మాఘశుద్ద పౌర్ణమి రోజున దర్శనమిస్తానని కలలో చెప్పాడు. గంగాపూర్ ను ఆనుకొని ఊన్న వాగు సమీపంలో గుట్టాను లోలువగా శ్రీబాలజి వెంకటేశ్వరస్వామి వారి విగ్రహలు ఆయనకు దర్శనమిచ్చాయి దీనీతో ఆయన అక్కడ ఆలయాన్ని నిర్మించాడు.
.
మొదటి గుహలో గోవింద రాజు విగ్రహం స్వామి ఎడమ వైపూనా శివాలయం దాని పక్కన శ్రీహనుమాన్ విగ్రహం గరుడ విగ్రహాలు న్నాయి. పోతాజి సమాది ఆలయ ముందు భాగంలో ఉంది పోతాజి మరణానంతరం గ్రామస్తులే క్రమం తప్పకుండా ప్రతి ఏడాది జాతర ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List