.
భారత దేశములోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ జిల్లాలో గల హిందూ దేవాలయం. ఈ ప్రాంతం పరమేశ్వరుని భార్య అయిన సతీ దేవి యొక్క గుండె మరియు నాభి పడిన ప్రాంతమని ఇక్కడి ప్రజల నమ్మకం. ఇది కొన్నిసార్లు శక్తి పీఠాలలో ఒకటిగా గుర్తింపబడుతుంది.
ఈ దేవాలయ అధిష్టాన దేవత "మాయ". ఆమె మూడు తలలతోనూ మరియు నాలుగు చేతులతోనూ కూడుకొని ఉన్న శక్తి యొక్క అవతారంగా ప్రసిద్ధి చెందినది. హరిద్వార్ ప్రముఖంగా "మాయాపురి" గా పిలివబడుతుంది. ఈ దేవాలయంలో తమ కోరికలు నెరవేర్చుకొనేందుకు భక్తులు కొలువబడే "సిద్ధ పీఠం" గా ప్రసిద్ధి చెందినది. ఇది హరిద్వార్ లో గల మూడు శక్తి పీఠాలలో ఒకటిగా అలరాలుతుంది. ఇది కాక హరిద్వార్ లో గల ముఖ్యమైన శక్తి పీఠాలుగా అలరాలుతున్నవి చండీదేవి ఆలయం మరియు మానసదేవీ ఆలయం.
ఈ దేవాలయం 11 వ శతాబ్దానికి చెందినది. ఇది హరిద్వార్ లోని మూడు ప్రాచీన దేవాలయాలలో ఒకటి. ఇది కాక ఇతర ప్రాచీన దేవాలయాలు నారాయణ శిల మరియు భైరవ దేవాలయం. ఈ దేవాలయం యొక్క అంతర మందిరంలో మాయా దేవత యొక్క మూర్తి మధ్య భాగములోనూ, కాళీ యొక్క మూర్తి ఎడమ వైపున, కామాఖ్య దేవత మూర్తి కుడివైపున ఉంటాయి. యివికాక మరి రెండు యితర శక్తి దెవతలు అంతర మందిరంలో ఉంటాయి. ఈ దేవాలయం "హర్ కి పౌరి" కి తూర్పు వైపున ఉన్నది. ఈ దేవాలయానికి వెళ్ళుటకు బస్సు, రిక్షా సౌకర్యాలు కలవు. ఈ దేవాలయం హరిద్వార్ వెళ్ళే యాత్రికులు తప్పనిసరిగా దర్శించవలసిన దేవాలయం. ఈ దేవాలయానికి అనేక ప్రాంతముల నుండి భక్తులు వస్తూ ఉంటారు. ముఖ్యంగా నవరాత్రి మరియు కుంభమేళా సందర్బంలో ఎక్కువగా దర్శిస్తూంటారు.
No comments:
Post a Comment