ఉజ్జయిని నగరంలో ఉన్న అత్యంత పవిత్రమైన దేవాలయాలలో ఒకటి. ప్రతిరోజూ వందల కొద్ది భక్తులు గణేశుడి ఆశీర్వచనాల కోసం ఈ ఆలయానికి వొస్తారు. చింతమన్ అంటే 'ఒత్తిడి నుండి ఉపశమనం' అని అర్థం, ఇది ఒక ప్రాచీన హిందూ మత పదం. కష్టాలలో ఉన్న భక్తులు ఈ ఆలయానికి వొచ్చి వేడుకుంటే, తప్పనిసరిగా వాటినుండి విముక్తిని గణేశుడు ప్రసాదిస్తాడని నమ్ముతారు.
ఫతేపూర్ రైల్వే లైన్ పక్కన, ఆలయ ప్రాంగణం గుండా 'శిప్రా' నది ప్రవహిస్తున్నది. ఈ ఆలయ ప్రాంగణానికి చేరుకున్న భక్తులకు అనేక సౌకర్యాలు ఉన్నాయి. ఈ దేవాలయానికి ప్రైవేటు కార్లు, బస్సులు, ఆటో రిక్షాస్ మరియు రైళ్ళ ద్వారా చేరుకోవొచ్చు. ఈ దేవాలయం, ఉజ్జయిని రైల్వే స్టేషన్ కు కేవలం 5 కి.మీ. దూరంలోనే ఉన్నది. ఈ ఆలయంలో ఉన్న గణేషుడి విగ్రహం స్వయంభూ విగ్రహమని ఇక్కడి ప్రజల నమ్మకం. గణేశుడి భార్యలైన, రిద్ధి మరియు సిద్ధి, ఇద్దరు ఆయనకు ఇరువైపులా కూర్చుని ఉండటం చూడవొచ్చు.
No comments:
Post a Comment