ముండేశ్వరి మాత ఆలయం. ~ దైవదర్శనం

ముండేశ్వరి మాత ఆలయం.

బీహార్‌ లో వైష్ణో దేవీ ఆలయాల్లోని అతి పురాతన దేవాలయాల్లో కైమూర్ జిల్లాలోని ముండేశ్వరి పుణ్యక్షేత్రం ప్రసిద్ధమైనది. సుమారు 1900 ఏళ్ల నాటి చరిత్ర కలిగిన ఈ ఆలయంలో నిత్యం పూజలు జరుగుతున్నాయి. ఈ ఆలయం 608 అడుగుల ఎత్తుగల కొండపై ఉంది. అతి ప్రాచీన ఈ ఆలయం క్రీ.శ 108 సంవత్సరంలో కట్టబడింది.
గుప్తుల కాలం నుంచే ఈ ఆలయం విశిష్టంగా పూజలందుకుంటోందని వెల్లడించారు. వారి కాలంలోనే ఈ ఆలయంలో అత్యద్భుతమైన శిల్పాలు, ప్రతిమలు, చిత్ర పటాలు.. ఆవిష్కరింపబడ్డాయని..ఇవి ఆలయ ప్రాశస్త్యానికి మరింత వన్నెతెచ్చేవిగా ఉంటాయి.
ఈ దేవాలయంలో ఉన్న శిలాఫలకంపై రెండు శాసనాలు బ్రాహ్మీ లిపిలో ఉన్నాయని తెలిపారు. ఈ శాసనాల ద్వారా దేవాలయం గుప్తుల కాలం నాటి కంటే ముందే నిర్మించబడినట్లు పురావస్తు శాఖ నిపుణులు, చరిత్రకారులు పేర్కొంటున్నారు.
అంతేకాకుండా ఈ ఆలయంలో నాలుగు ముఖాలు గల శివుని విగ్రహం ఉందని.. ఈ ప్రతిమకు భక్తి శ్రద్ధలతో భక్తులు పూజలు చేస్తుంటారని పేర్కొన్నారు. ఈ ప్రతిమ కూడా అత్యంత పురాతనమైనదన్నారు.
ముండేశ్వరి ఆలయంలోని రామనవమి, శివరాత్రి పండుగలు ఎంతో ప్రభావితం చేస్తాయి. ఆధ్యాత్మిక కీర్తిలో మునిగి పారవశ్యం పొందటానికి ప్రతి ఏటా పెద్ద సంఖ్యలో తీర్థయాత్రీకులు ఈ ఆలయానికి వస్తారు. నవరాత్రి సందర్భంగా జరిగే ప్రతి ఏటా జరిగే ఉత్సవంలో అనేక మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించడం మరొక ప్రధాన అంశం.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List