మహిమాన్వితమైనదిగా చెప్పబడుతోన్న 'నాగేశ్వర జ్యోతిర్లింగం' గుజరాత్ రాష్ట్రంలోని ద్వారక సమీపంలో విలసిల్లుతోంది. ద్వారక ... శ్రీ కృష్ణుడి అంతఃపురమైన భేట్ ద్వారకా ప్రాంతానికి మధ్యలోని నాగేశ్వర గ్రామంలో ఈ జ్యోతిర్లింగం ఆవిర్భవించింది. దారుకావనమనే ఈ ప్రదేశం జనావాసాలకు దూరంగా వుంటుంది.
దారుక అనే రాక్షసి వరబల గర్వంతో సాధుజనులను హింసించడం మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే ఆమె కొందరు శివ భక్తులను బంధించింది. వాళ్లందరి అభ్యర్ధన మేరకు పరమశివుడు నాగేశ్వరుడిగా అవతరించాడు. రాక్షసులందరినీ శంకరుడు సంహరిస్తూ ఉండటంతో, దారుకా పారిపోయి అమ్మవారిని శరణు కోరినట్టు శివపురాణం చెబుతోంది.
దేవాలయం దగ్గరలో ఎక్కడా ఇల్లు కాని చెట్లు కాని ఉండవు కాని ద్వాదశ జ్యోతిర్లింగాల పేర్లలో ‘’నాగేశం దారుకా వనే ‘’అని మనం చదువుతూ ఉంటాం .నాగేశలింగం కిందుగా ఉంటుంది నాలుగు మెట్లు దిగి వెళ్లి దర్శించాలి .మగవాళ్ళు లింగాన్ని తాకే అవకాశం ఉంది .స్త్రీలకూ అర్హత లేదు స్వామి నాగేశ్వరుడు అమ్మవారు నాగేశ్వరి గుడి ప్రక్కనే అతి పెద్ద శివ లింగం ఉంది ఇలాంటిది ఇంకెక్కడాఏ జ్యోతిర్లింగా ఆలయం దగ్గరా లేక పోవటం వింత విశేషం విచిత్రం కూడా.
No comments:
Post a Comment