పరమ శివుడి ప్రేమాలయం శ్రీశైలం. ~ దైవదర్శనం

పరమ శివుడి ప్రేమాలయం శ్రీశైలం.


శ్రీశైలం దేశంలోని గొప్ప శైవాలయాల్లో ఒకటి. దీనికున్న మరో ప్రత్యేకత అది 12 జ్యోతిర్లింగాలలో ఒకటవడం. శ్రీ మల్లిఖార్జున స్వామి, శ్రీ భ్రమరాంబికా దేవి శ్రీశైల క్షేత్ర మూలవిరాట్టులు.
ఈ పురాతన దేవాలయం ఎత్తైన ప్రాకారం, గోపురం, బురుజు, అద్బుతమైన వాస్తు,శిల్పకళా సంపదతో సుసంపన్నమైంది. ద్రవిడ వాస్తు,శిల్పకళా సాంప్రదాయం ప్రకారం నిర్మింబడిన ఈ
దేవాలయంలో పెద్ద పెద్ద గోపురాలు, పొడవైన ప్రాకారాలతో కూడిన విశాలమైన ప్రాంగనం విజయనగర శిల్పకళకు ఒక అద్బుతమైన ఉదాహరణ.
క్రీస్తు శకం రెండవ శతాభ్దానికి చెందిన శాతవాహన రాజులు ఈ దేవాలయాన్ని గూర్చి ప్రస్తావించారు. నయనారులు శ్రీశైల ప్రశస్తిని గానం చేశారు. కాకతీయులు, విజయనగర రాజులు ( ప్రత్యేకించి శ్రీ క్రిష్ణ దేవరాయలు) శ్రీశైలానికి చాలా (మాన్యాలు) కానుకలిచ్చారు. ఈ దేవాలయానికి మతపరంగా, చారిత్రకంగా, వాస్తు శిల్పకళ పరంగా చాలా ప్రాముఖ్యత ఉంది.
ఈ దేవాలయ ఆవిర్బావానికి సంబంధించిన ఆధారాలు కాలగర్బంలో కలసిపోయాయి. స్కంద పురాణంలో ఏకంగా ఒక అధ్యాయమే ఈ దేవాలయాన్ని గూర్చి వివరిస్తుంది. ప్రఖ్యాత అద్వైత వేదాంత ప్రవచకులు శ్రీ ఆదిశంకరాచార్య శ్రీశైలాన్ని దర్శించి, అక్షరమైన 'శివానంద లహరి'ని ఇక్కడే రచించారని నమ్మకం. గడచిన సహస్రాబ్దంలోని శైవ మునుల చేత కూడా శ్రీశైల ప్రశస్ది గానం చేయబడింది.
శ్రీ భ్రమరాంభికా దేవికి అంకితం చేయబడిన కోవెల ప్రశస్తమైంది. దుర్గ తేనెటీగ రూపంలో ఇక్కడ శివున్ని ప్రార్ధించిందని, ఈ ప్రాంతాన్నే తన ఆవాసంగా ఎంచుకుందని కథలు ప్రచారంలో ఉన్నాయి.
శ్రీ శైలం పరిసరప్రాంతాల్లో ఇతర దేవాలయాలు:
త్రిపురాంతకం: శ్రీశైలానికి తూర్పు వైపున నెలకొని ఉంది.
కడపలోని సిద్దావతం: శ్రీశైలానికి దక్షిణాన ఉంది.
అలంపూర్ నవబ్రహ్మ దేవాలయాలు: శ్రీ శైలానికి పశ్చిమాన మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నాయి.
ఉమా మహేశ్వరం: శ్రీశైలానికి ఉత్తరాన మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది.
ఫాల ధార, పంచ ధార: ఇక్కడే ఆదిశంకరాచార్యులు ధ్యానం చేసేవారని ప్రతీతి.
హటకేశ్వరం: ఫాల ధార, పంచధార సమీపంలోని మరో దేవాలయం. ఇక్కడే బంగారంతో చేయబడిన లింగం పూజలందుకుంటుంది.
సాక్షి గణపతి దేవాలయం: శ్రీ శైలాన్ని దర్శించడానికి ముందే ఈ దేవాలయాన్ని దర్శించడం ముఖ్యమని నమ్మకం.
కైలాస ద్వారం: కాలినడకన శ్రీశైలాన్ని దర్శించేవారికి ఇదే ప్రధాన ద్వారం
శిఖరం: నల్లమల అడవుల్లో 2850 అడుగుల ఎత్తులో ఒక గుట్టపై ఉన్న శివాలయం.
పాతాళ గంగ: క్రిష్ణా నది ఒడ్డున ఉన్న శ్రీశైలం లోని స్నానవాటికలు
త్రిపురాంతకం, సిద్దావతం, అలంపుర, ఉమామహేశ్వరం ఈ నాలుగు దేవాలయాల్ని శ్రీశైలానికి నాలుగు ప్రధాన ముఖ ద్వారాలుగా పరిగణిస్తారు

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List