శ్రీమాతా శ్రీ మహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరీ
చిదగ్ని కుండా సంభూతా దేవకార్య సముదద్యతా
‘శ్రీమాతా’ అనే నామంతో ప్రారంభం అయిన లలితా సహస్రంతో శ్రీమాతా లలిత యొక్క గొప్పదనం అంతా వర్ణించబడింది. లలితా మాత ఎందుకు ఉద్భవించింది అది శోధిస్తే ఒకప్పుడు భండాసురుడు అనే రాక్షసుని ద్వారా లోకాలన్నీ పీడింపబడసాగాయి. ఇంద్రాదులు వారి వారి రాజ్యములు కోల్పోయారు. అంతే కాదు, భండాసురుని సోదరులు విషంగుడు, విశుక్రుడు అనే వారి వల్ల రాక్షసుల బలం బాగా పెరిగిపోయింది. శ్రీమాత, దేవతలకు కష్టం వచ్చిన ప్రతిసారీ దేవతల యొక్క తేజస్సు అనే అగ్ని కుండం నుంచి అతడు ఆవిర్భవించి రాక్షస సంహారం చేస్తూ ఉండేది. ఇప్పుడు కూడా ఆమె దేవతల చిదగ్ని కుండము నుండి ఉద్భవించి దేవకార్యం పూర్తి చేసింది. భండాసురుడు విశిష్టమైన రాక్షసుడు. దక్షయగ్నంతో దాక్షాయణీ ఆహుతి అయిన తర్వాత పార్వతీదేవిగా అవతరించింది. ఆమె శివుడ్ని వివాహం ఆడాలన్న కోరికతో ఉంది. శివుడు విరాగియైు తపస్సు చేసుకోసాగాడు. అతడ్ని తపస్సు నుంచి లేపి తారకాసురాది రాక్షస సంహారం చేయించడం కోసం పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం చేయించాలి. ఇది దేవతలకు అవశ్యమైన కార్యం. అయితే దేవతలు పరమశివుని త పోభంగం కోసం మన్మధుని ప్రయోగించారు. మన్మధుడు తన ప్రవృత్తి ప్రకారం బాణములు సంధింపగా, శివుడు ఆగ్రహించి తన మూడో కంటితో మన్మధుని భస్మం చే శాడు. ఆ భస్మం కుప్పగా ఉన్నచోట గణేశ్వరుడు అనే చిత్రకర్మ ఒక విచిత్ర ఆకారం గల పురుషుణ్ని తయారు చేశాడు. ఆ పురుషుడు మొదట శివుడ్ని చూశాడు. చిత్రకర్మ ప్రేరణతో శతరుద్రీయం పారాయణ చేసి రుద్రుణ్ని ప్రసణ్నుని చేసుకున్నాడు. అంతే కాదు రుద్రుణ్ని మెప్పించి ‘‘ నాతో ఎవరైనా యుద్ధం చేస్తే వాళ్లలోని సగం బలం నాకు చేరాలి. శత్రువుల అస్త్రమ్రులు నన్ను బాధింపకూడదు.’’ అని కోరాడు. శివునికి అతడు 69 వేల సంవత్సరాల రాజ్యమోగం ఇచ్చాడు.
అక్కడే ఉన్న బ్రహ్మ ‘భండ’, భండ, అన్నాడు అనగా ఆశ్చర్యమాశ్చర్యం అని అర్థం. దానితో ఆ రాక్షసునికి ‘భండుడు’ అనే పేరొచ్చింంది. అతడే భండాసురుడు. రాక్షసులందరూ అతన్ని రారాజుగా ఎంచుకున్నారు. అయితే నిత్యం యజ్ఞ, యాగ క్రతువులు చేస్తూ, మహాదేవుని అర్చన చేసూ 60 వేల సంత్సరాలు కాలం గడిపారు. దానవ బలం పెరిగింది. ఇంద్రుని బలం క్షీణిస్తోంది. శ్రీ మహావిష్ణువు ఒక మాయను సృష్టించి భండుని రాజ్యంలో వారిని మోహపరిచి వారిని నిత్య కర్మానుష్టాన భ్రష్టులను చేసే ప్రయత్నం ప్రారంభించారు. రాక్షసులు ధర్మప్రవర్తనతో బలం పెరుగుతూ ఉంటే వారిని జయించడం కష్టం. అందుకే అధర్మం వైపు వారు ఆకర్షింపబడుటకే ఈ ప్రయత్నం. మదన తాపంతో ఆ ‘మాయామోహిని’కి భండుసురాది రాక్షసులు మోహితులై నిత్యకర్మానుష్టాన మహేశ్వరార్చన, యజ్ఞయాగాదుల విస్మరించి క్రమేణా బలం కోల్పోసాగారు. 800 సంవత్సరాలు గడిచిపోయాయి. అంతట నారదుడు ఒకనాడు ఇంద్రుని చేరి నీ శక్తిని పెంచుకోవలసిన సమయం ఆసన్నమైంది. నీవు వెంటనే శ్రీమాతను ఆఽరాఽఽధించు’ అంటూ ఆదేశించాడు. వారు అలాగే చేశారు. రాక్షస గురువు శుక్రాచార్యుడు భండాసురుని చేరి మాయగూర్చి తెలిపి విజ్ఞానంతున్ని చేశారు. భండాసురుడు మంత్రులతో కలిసి శుక్రాచార్యులు చెప్పినవన్నీ చెప్పి రాక్షసజాతికి కీడు రాబోతున్నదని సూచించాడు. గతంలో భండుని వరం వల్ల దేవతలందరూ నిస్తేజులయ్యారు. విశుక్రుడు భూలోకంలో అందరినీ నిస్తేజుల్ని చేశాడు. విషంగుడు రసాతలం అంతా నిస్తేజం చేశాడు. ఇలా మూడు లోకాలూ నిస్తేజం అయిన సందర్భంలో ఇంద్రాదులు నారదుని సలహా మేరకు శ్రీమాతా ఆరాధన చేయడం ప్రారంబించి, తర్వాత పరమశివుని మెప్పించి పరమేశ్వరుని సహకారంతో మహాయాగం చేయనారంభించారు. అందులో పరమశివుడు హోత. దేవతల నిస్తేజాన్ని పోగొట్టడానికి ఈ యాగం చేశారు. ఆ యాగంలో దేవతలందరూ చిదగ్ని కుండంలో ప్రవేశింపగానే శ్రీలలితామాతను పైకి రమ్మని శ్రీ పరమేశ్వరుడు అష్టకారికలను స్తుతించాడు. వాటి అర్త సర్వలోక రక్షణ కోసం భండాసుర సంహారం కోసం ‘‘ లలితాపరమేశాని!సంవిద్వహ్నేస్సముద్భవ’’ అని ప్రార్థింపగా ఆవిడ అవిర్భవించి మొట్టమొదట శ్రీచక్రం అధిరోహించింది. అందులో తనను తానే పులిరూపంలో సృష్టించుకుంది. దానికే కామేశ్వరుడు అనిపేరు.
లోకోపకారం కోసం సృష్టి చేయదలిచి ఆ కామేశ్వరుణ్ని వివాహమాడింది.. బ్రహ్మాది దేవతలను మరలా నూతనంగా సృష్టించింది. వారి వారి విధులను ఆజ్ఞాపించింది. ఖండాసురుణ్ని సంహరించడం కోసం ఆమె బయల్దేరింది. శ్రీ లలిత అంకుశం నుంచి సంపత్కరీ దేవి ఉద్భవించింది. పాశం నుంచి అశ్వారూఢాదేవి ఉద్భవించింది. సేనాని అయిన హఠా హీమాత అలాగే మంత్రిణి అయిన శ్యామలాదేవి ఇరువైపులా ఉన్నారు. బ్రహ్మాండపురాణంలో ఈ సందర్భంలో అమ్మవారివి 25 నామాలు చెప్పారు. అవి రోజూ పారాయణం చేయడం ద్వారా సౌభాగ్యవృద్ధి, అభీష్టసిద్ధి....

No comments:
Post a Comment