నల్లమల అడవులలో కృష్ణా నది ఒడ్డున పాల వంక లో శ్రీ వీర భద్ర స్వామి కొలువై ఉన్నాడు పర్వతాల మల్లయ్య అని ,పాలక వీరయ్య అని భక్తులు పిలుచుకొంటారు 15,16 శతాబ్దపు విజయ నగర రాజులూ కుటుంబ సమేతం గా ,అష్ట దిగ్గజ కవులతో చతురంగ బాల బలాల తో ఇక్కడికి వచ్చి పక్షం రోజు లుండి స్వామిని అర్చిన్చానట్లు ఆధారాలున్నాయి .ఈ క్షేత్ర రక్షణకు సైన్యాధి పతులను కూడా నియమించారు .64గ్రామాలను వీరి పోషణ కై రాసిచ్చారు ఈ క్షేత్రం లో చుక్కల పర్వతం అనే ఎత్తైన శిఖరం నుండి జాలు వారే నీటి చుక్కలు ప్రకృతికి అందాల హరి విల్లు .ఈ నీటి చుక్కల కింద‘’సంగాన గద్దె ‘’అనే చోట అరచెయ్యి చాచి నిలబడితే ,ఆ అరచేతిలో నీటి చుక్క పడిన వారికి పిల్లలు పుడతారని భక్తుల అచంచల విశ్వాసం .అలా పుట్టిన పిల్లలకు స్వామి పేరు పెట్టుకొంటారు ఇక్కడ పూజారులు గిరిజనులే .తోలి ఏకాదశి నాడు వేలాది భక్తులు సందర్శిస్తారు .ఏడాదికి ఒక్క రోజే అంటే తోలి ఏకాదశి నాడే పూజ ఉంటుంది ,ఇక్కడి పది అడుగుల ఎత్తైన పుట్టలో నాగేంద్ర స్వామి ఉన్నాడని ప్రతి రోజు పాలవంక క్షేత్రం నుండి శ్రేఎ శైలానికి వెళ్లి వస్తూంటాడని భక్తుల విశ్వాసం ఇదీ మరో వింతయే .శ్రీ శైలం తో పాటు సమాన మైన ప్రసిద్ధి చెందిన ఆలయం పాలవంక క్షేత్రం.
Home »
» అరచేతిలో నీటి చుక్క పడితే పిల్లలు పుట్టే - పాల వంక.
అరచేతిలో నీటి చుక్క పడితే పిల్లలు పుట్టే - పాల వంక.
RB.VENKATA REDDY
B.KOTHAPALLI
No comments:
Post a Comment