తమిళనాడు, కోయంబత్తూర్ పట్టణానికి పశ్చిమాన 7 కి.మీ దూరంలో కలదు. దీనినే మేల్ చిదంబరం అని కూడా అంటారు. ఇక్కడి ప్రధాన దైవం శివుడు. ఇక్కడి శివుడిని భక్తి శ్రద్ధలతో పూజించిన వారిని జనన మరణ కాల చక్రం నుండి శివుడు విముక్తి కలిగిస్తాడని ఇక్కడి భక్తుల విశ్వాసం. ఈ ఆలయం నొయ్యల్ నదికి దగ్గరలో కలదు. ఈ ఆలయాన్ని కరికాల చోరన్ అనే రాజు నిర్మించాడు. ఈ ఆలయానికి ముందర ఒక చిన్న కొలను లాంటిది కలదు. దానిని తెప్పకులం అని పిలుస్తారు. ఈ తెప్పకులం 16 కోణాలు మరియు 8 మూలలతో ఉంది. ఇది 15 వ శతాబ్దంలో, విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మించబడినది.
No comments:
Post a Comment