తులసీ తీర్థం ప్రబావితమైనదా ? ~ దైవదర్శనం

తులసీ తీర్థం ప్రబావితమైనదా ?


దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ మనం తీర్థాన్ని తీసుకుంటాం. తీర్థానికి తనకంటూ కొన్ని వైభవ గుణాలున్నాయి.హిందూ కుటుంబాలలో తులసి మొక్కను నాటి, పించి పోషిస్తారు. పవిత్ర జలాన్ని తులసి ఆకులతో జోడించడం ద్వారా ఆ జలం ఎంతో ప్రబావితమౌతుంది. ఆ జలం ఔషధ గుణాలను పొందుతుంది. విదేశాలలో ఓ విధమైన శుద్ద జలాన్ని ‘క్లిస్టర్డ్ వాటర్’ అని పిలుస్తారు. క్లిస్టర్డ్ వాటర్ లో ప్రమాదకరమైనటువంటి వ్యాపించి ఉన్న కాలుష్యం లేదని అమెరికాన్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ జలం ఎంతో శుద్దిచేయబడిన నట్టిదై మినిరల్స్ కలిగి వాడిన వారిని ఆరోగ్యవంతంగా మరియు జాగృతంగా ఉంచుతుంది. ఒక గ్లాసెడు మామూలు నీటిలో రెండు చుక్కల క్లిస్టర్డ్ వాటర్ కలిపినట్లయితే ఆ నీరంతా ఆరోగ్యప్రదమైన పానీయంగా మారుతుంది. తులసిని కలిపిన నీరు కూడా క్లస్టర్డ్ వాటర్ కలిపిన జలంలాంటి గుణం ఉందని కనుగొనడం జరిగింది. ఈ విషయమై ప్రఖ్యాతి గాంచిన శాస్త్రవేత్త డా. టి.పి. శశికుమార్ పరిశోధనలు జరిపాడు. దేవతా విగ్రహాన్ని కడగడానికి వాడే తులసి జలాన్ని సేకరించి ఈ జలంపై ప్రయోగాలు చేసాడు. పరిశోధన అనంతరం అతను తులసి జలానికి క్లస్టర్డ్ వాటర్ అన్ని గుణాలు ఉన్నాయని నిర్ధారించాడు. తులసి జలం త్రాగడానికి గుడికి వెళ్ళవలసిన అవసరం లేదు. దాన్ని ఇంటివద్దనే తయారు చేసుకోవచ్చు. మన ఋషులకు తులసీ జలం యెక్క గొప్పతనం తెలసుకాబట్టే దాన్ని వాడమని మనకు తెలిపారు.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List